Daily Horoscope: ఈరోజు ఈ రాశులవారందరికీ రాజయోగమే..ఈ ఇద్దరికి తప్ప
ఈరోజు జ్యేష్టా నక్షత్ర ప్రభావంతో ద్వాదశ రాశి ఫలితాల్లో భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది.
Daily Horoscope: నేడు వైశాఖ మాసం, బహుళ పక్షం, తదియ తిథి. సోమవారం చంద్రుడికి ప్రీతికరమైన రోజు. అనూరాధ, జ్యేష్ఠ నక్షత్రాల ప్రభావం కూడా ఉండబోతోంది. నక్షత్ర మార్పుల వల్ల ఈరోజు వృత్తి, వ్యాపార రంగాలలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా జ్యేష్ఠా నక్షత్ర ప్రభావం పెరిగే కొద్దీ అధికారిక వ్యవహారాల్లో వేగం పెరుగుతుంది. జ్యేష్టా నక్షత్ర ప్రభావం ఏ రాశిపై ఎలా ఉండబోతున్నది, ఎవరి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
మేషరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు పడ్డ కష్టానికి ఇన్నాళ్లకు ఫలితం దక్కే సమయం వచ్చింది. "శ్రమ నీ ఆయుధమైతే, విజయం నీ బానిసవుతుంది" అన్నట్లుగా, మీ నిరంతర కృషి నేడు ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతుంది. ఆధ్యాత్మిక చింతనతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు ఈరాశివారికి లక్ష్మీనారాయణుల దర్శనం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది.
వృషభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూంగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే రాజయోగం అని చెప్పాలి. ఊహించని ధనలాభం మీ ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. వ్యాపారంలో సరికొత్త వ్యూహాలు ఫలించి ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. విదేశీ ప్రయాణాలకు లేదా విదేశాల నుంచి వచ్చే శుభవార్తలకు ఆస్కారం ఉంది. ఈరోజు ఈరాశివారు కులదేవతారాధన చేయాలి.
మిథునరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. సమావేశాల్లో మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. క్లిష్టమైన సమస్యలను కూడా మీ వాక్చాతుర్యంతో సులభంగా పరిష్కరిస్తారు. మిగులు ఆదాయం కనిపిస్తోంది. భవిష్యత్ పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయం. ఈరోజు ఈరాశివారు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించాలి.
కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఈరోజు మీరు కొంచెం నిమ్మకు నీరెత్తినట్లుగా కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు మీ అదుపు దాటే అవకాశం ఉంది. అనవసర వాదనలకు పోతే మానసిక ప్రశాంతత కోల్పోయే ప్రమాదం ఉంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు. ఈరోజు ఈరాశివారికి సూర్య నమస్కారాలు మేలు చేస్తాయి.
సింహరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారమై, కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారికి వేంకటేశ్వర స్వామి కృపతో తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈరోజు ఈరాశివారికి విష్ణు సహస్రనామ పారాయణం వల్ల మానసిక స్థైర్యం లభిస్తుంది.
తులారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. సామాజిక హోదా పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరిగే రోజు ఇది. ఆదాయ మార్గాలు కొత్తగా పుట్టుకొస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈరాశివారు హనుమంతుని దర్శనం చేసుకోవాలి.
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా మీరు విజయం సాధిస్తారు. పెద్దల సలహాలు మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలు చేస్తారు. ఈరోజు ఈరాశివారికి దుర్గాదేవి స్తోత్రం పఠించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది.
ధనస్సురాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అదృష్టం మీ తలుపు తడుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తులు లేదా ధన సహాయం అందుతుంది. ఇంట్లో శుభ కార్యాలకు సంబంధించి చర్చలు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు రాశివారు శివారాధన చేయాలి.
మకరరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు శుభవార్త అందుతుంది. ఉద్యోగంలో మీ స్థానం సుస్థిరం అవుతుంది. సంతానం వల్ల గర్వకారణమైన వార్తలు వింటారు. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈరోజు ఈరాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలి.
కుంభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వస్తు, వాహన లాభాలు సూచిస్తున్నాయి. కొత్త ఇంటి కల నెరవేరే దిశగా అడుగులు పడతాయి. గృహంలో ప్రశాంతత ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈరోజు ఈరాశివారు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అన్ని ఆటంకాలు తొలగుతాయి.
మీనరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే పరీక్షాకాలమే. పనిభారం ఒత్తిడి కలిగించవచ్చు. సహనంతో వ్యవహరించడం ఉత్తమం. ఎవరితోనూ కఠినంగా మాట్లాడకండి. ఆదాయం కంటే ఖర్చు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ఈరోజు ఈరాశివారు శనిధ్యానం లేదా శివార్చన చేయడం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది.
గమనికః ఇక్కడ ఇచ్చినవి సామాన్య జాతక ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించాలి.




