2027లో శని సంచారంలో కీలక మార్పు.. ఈ రాశుల వారికి ఇక అన్నీ మంచి రోజులే
Astrology: జ్యోతిష్యశాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శని సంచారం జరిగినప్పుడల్లా 12 రాశుల వారిలో ఆసక్తి పెరుగుతుంది.
2027లో శని సంచారంలో కీలక మార్పు.. ఈ రాశుల వారికి ఇక అన్నీ మంచి రోజులే
Astrology: జ్యోతిష్యశాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శని సంచారం జరిగినప్పుడల్లా 12 రాశుల వారిలో ఆసక్తి పెరుగుతుంది. 2027లో శని సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకోవచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
2027లో శని సంచారం ఎప్పుడంటే?
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని ఒక రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తాడు. అనంతరం మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. 2027లో శని సంచారంలో కీలకమైన మార్పు చోటుచేసుకోనుంది. జూన్ 3న శని మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 9న వక్రగతిలోకి వెళ్లి, అక్టోబర్ 20న తిరిగి మీన రాశిలోకి చేరుకుంటాడు.
ఈ సంచారంతో కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల వారికి ఏలినాటి శని దశల్లో మార్పులు కనిపిస్తాయి. ఆయా రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
కుంభ రాశి
2027లో కుంభ రాశి వారికి శని సంచారం కొంత ఉపశమనాన్ని ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని చివరి దశ కొనసాగుతోంది. జూన్లో శని మేష రాశిలోకి వెళ్లడంతో ఈ ప్రభావం తాత్కాలికంగా ముగుస్తుంది. దీంతో గతంలో ఎదురైన కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఆశించిన మార్పులు కనిపించవచ్చు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, కొత్త అవకాశాలు అందుబాటులోకి రావచ్చు. వ్యాపారస్తులకు కూడా కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ పొదుపుపై దృష్టి పెట్టాలి. కుటుంబ జీవితంలో సానుకూల వాతావరణం ఏర్పడవచ్చు. అయితే అక్టోబర్లో శని తిరిగి మీన రాశిలోకి రావడంతో ఏలినాటి శని చివరి దశ మళ్లీ ప్రారంభమవుతుంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. శనివారం పేదలకు ఆహారం అందించడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిదని జ్యోతిష్య సంప్రదాయాలు సూచిస్తున్నాయి.
మీన రాశి
మీన రాశి వారికి 2027లో ఏలినాటి శని ప్రభావం కొనసాగుతుంది. ప్రస్తుతం మధ్య దశలో ఉన్న ఈ రాశి వారికి జూన్ వరకు బాధ్యతలు, ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఉద్యోగస్తులు పని విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అనుకున్న పనులు పూర్తికావడానికి ఆలస్యం కావచ్చు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారు అన్ని విషయాలను పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయాలి. అప్పులు, ఆర్థిక లావాదేవీల విషయంలోనూ జాగ్రత్త అవసరం. జూన్లో శని మేష రాశిలోకి వెళ్లడంతో ఈ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ ప్రారంభమవుతుంది. అక్టోబర్లో తిరిగి మీన రాశిలోకి రావడంతో మధ్య దశ మళ్లీ మొదలవుతుంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం సంప్రదాయపరంగా శుభప్రదంగా భావిస్తారు.
మేష రాశి
మేష రాశి వారికి 2027లో శని సంచారం కీలకమైన దశకు నాంది పలకనుంది. జూన్ 3న శని ఈ రాశిలోకి ప్రవేశించడంతో ఏలినాటి శని రెండో దశ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని మార్పులు చోటుచేసుకోవచ్చు. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి గుర్తింపు పొందవచ్చు. వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి.
ఆర్థికంగా అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సహనంగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవాలి. అక్టోబర్ 20న శని తిరిగి మీన రాశిలోకి వెళ్లడంతో మేష రాశి వారికి ఏలినాటి శని రెండో దశ తాత్కాలికంగా ముగిసి చివరి దశ ప్రారంభమవుతుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి 2027లో శని ప్రభావం కొత్త అనుభవాలను తీసుకురావచ్చు. జూన్ 3న శని మేష రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ రాశి వారికి ఏలినాటి శని మొదటి దశ ప్రారంభమవుతుంది. దీంతో ఖర్చులు, కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన అంశాల్లో మార్పులు కనిపించవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పని ప్రదేశంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. వ్యాపారస్తులు లాభాల కోసం తొందరపడకుండా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. ఆదాయం ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆర్థిక నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి.
శని ప్రభావం ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జ్యోతిష్య సంప్రదాయాల ప్రకారం శని ప్రభావం ఉన్న సమయంలో కొన్ని నియమాలు పాటించడం మంచిదిగా భావిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు, అప్పులకు దూరంగా ఉండాలి. ఉద్యోగం, వ్యాపారంలో క్రమశిక్షణతో పనిచేయాలి. పేదలకు, వృద్ధులకు చేతనైన సహాయం చేయాలి. శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, హనుమంతుడిని ఆరాధించాలని పండితులు చెబుతారు.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు జ్యోతిష్యశాస్త్ర విశ్వాసాల ఆధారంగా ఇచ్చిన అంచనాలు మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించాలి.




