Daily Horoscope: సెప్టెంబర్ 21 రాశిఫలాలు - ఈరోజు ఈ రాశులకు అదృష్టయోగం... అనుకోని విజయం
సెప్టెంబర్ 21 ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈరోజు అదృష్టయోగం పట్టనుంది. ఆ రాశులేమిటో తెలుసుకుందాం.
Daily Horoscope: సెప్టెంబర్ 21, సోమవారం ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితుల ప్రభావం భిన్నంగా ఉండనుంది. ముఖ్యంగా మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకరం, మీనం రాశుల వారికి పనుల్లో ముందడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం వంటి అంశాల్లో అనుకూల పరిణామాలు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. అయితే కర్కాటకం, కన్య, వృశ్చికం, కుంభం రాశుల వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది.
మేషరాశి
మేష రాశి వారికి ఈ రోజు కార్యసాధనకు అనుకూలంగా ఉంటుంది. చాలాకాలంగా ప్రయత్నిస్తున్న పనిలో ముందడుగు కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతగా వ్యవహరిస్తే ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో పోటీ ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలతో లాభాలను అందుకోవచ్చు. ఆర్థికంగా మెరుగుదల కనిపించినా అవసరానికి మించి ఖర్చు చేయకుండా జాగ్రత్తపడాలి. బంధువులతో శుభకార్యంలో పాల్గొనే అవకాశం ఉంది. స్థిరాస్తి వ్యవహారాల్లో కదలిక వస్తుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
వృషభరాశి
వృషభ రాశివారికి ప్రారంభించిన పనులను పూర్తి చేసే రోజు. ఉద్యోగంలో మీ అనుభవం, క్రమశిక్షణ ఉపయోగపడతాయి. క్లిష్టమైన సమస్య వచ్చినా ఆత్మవిశ్వాసంతో పరిష్కరించగలుగుతారు. వ్యాపారంలో గత అనుభవాలను ఆధారంగా చేసుకుని తీసుకునే నిర్ణయాలు ఆర్థికంగా ఉపయోగపడవచ్చు. ఆదాయం విషయంలో సంతృప్తికరమైన పరిస్థితి ఉంటుంది. అయితే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
మిథునరాశి
మిథున రాశికి ఈ రోజు విజయవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ప్రతిభను గుర్తించే సందర్భం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందవచ్చు. పదోన్నతి లేదా కొత్త బాధ్యతకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తాయి. వ్యాపారంలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరగవచ్చు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకరాశి
కర్కాటక రాశివారు ఈ రోజు కొంత ఓర్పుతో వ్యవహరించాలి. ఉద్యోగం, వ్యాపారంలో ఫలితాలు ఆలస్యమైనా ప్రయత్నాన్ని ఆపకూడదు. ముఖ్యంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆదాయం కంటే ఖర్చులు పెరగకుండా బడ్జెట్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. కుటుంబంలో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్యపరంగా అలసట లేదా ఇబ్బందులు ఎదురైతే విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి.
సింహరాశి
సింహ రాశివారికి ఈ రోజు ఉత్సాహాన్నిచ్చే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో మీ నాయకత్వ లక్షణాలు మరోసారి బయటపడతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం ఆర్థికంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సామాజిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఆనందం పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
కన్యారాశి
కన్య రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకేసారి అనేక పనులు చేపట్టకుండా ముఖ్యమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఉద్యోగంలో మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు రావచ్చు. హోదా లేదా బాధ్యత పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో చిన్నపాటి ఆటుపోట్లు ఉన్నా వాటిని అధిగమించవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ అనవసర వ్యయాలు పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
తులారాశి
తుల రాశివారికి ఈ రోజు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రణాళికలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఊహించని సమయంలో వచ్చే ఒక శుభవార్త మీలో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృశ్చికరాశి
వృశ్చిక రాశివారు ఈ రోజు పట్టుదలను ఆయుధంగా చేసుకోవాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే చిన్న అడ్డంకులు తాత్కాలికమే. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని పరిణామాలు నిరుత్సాహపరిచినా పరిస్థితిని చక్కదిద్దే సామర్థ్యం మీకు ఉంటుంది. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శివారాధన,
ధనుస్సురాశి
ధనుస్సు రాశివారికి ఈ రోజు పురోగతికి అనుకూలమైన రోజు. ఉద్యోగంలో మీ నాయకత్వం, సమయస్ఫూర్తి, పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు కదలడం ప్రారంభిస్తాయి. ధనయోగం, వాహనయోగం కలిసివచ్చే సూచనలు ఉన్నాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ముఖ్యమైన పని పూర్తయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మకరరాశి
మకర రాశివారికి దైవబలం కలిసివచ్చే రోజు. ఉద్యోగం, వ్యాపారంలో సానుకూల పరిణామాలు కనిపిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో సంబంధాలు మరింత బలపడతాయి. డబ్బు విషయంలో ఎవరి మాటకో తొందరగా నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆరోగ్యానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి.
కుంభరాశి
కుంభ రాశివారికి ఈ రోజు కొంత ఒత్తిడితో కూడుకున్నప్పటికీ పరిస్థితులను చక్కగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం పెరగవచ్చు. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయాలి. ఆర్థిక విషయాల్లో పరిస్థితికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా వృథా ఖర్చులను నియంత్రించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
మీనరాశి
మీన రాశివారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావడంతో పాటు అదనపు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇవి భవిష్యత్తులో స్థిరమైన ఎదుగుదలకు దోహదపడవచ్చు. ప్రారంభించిన పనులు అనుకూలంగా సాగుతాయి. ఈ రోజు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు దీర్ఘకాల ప్రయోజనాలను అందించే అవకాశం ఉంది. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. కుటుంబంలో శుభకార్య సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించండి.




