Daily Astrology: సెప్టెంబర్ 5 రాశిఫలాలు - గురు అనుగ్రహంతో ఈ రాశులకు అద్భుత విజయం
గురు అనుగ్రహంతో కొన్ని రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబ విషయాల్లో అద్భుత విజయాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Daily Astrology: సెప్టెంబర్ 5న గ్రహాల సంచారం, తిథి, నక్షత్ర ప్రభావాలు కొన్ని రాశులకు అనుకూలతను తీసుకురానున్నాయి. ముఖ్యంగా కన్య, సింహ, మకరం, వృషభం, మిథునం, మీనం రాశుల వారికి పనుల్లో పురోగతి, ఆర్థికంగా మెరుగైన అవకాశాలు, కుటుంబపరంగా సంతోషకరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని రాశుల వారు మాత్రం నిర్ణయాల్లో తొందరపడకుండా ఆలోచించి అడుగు వేయడం మంచిది. ఈరోజు ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం.
శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువులో ఈ రోజు కొనసాగుతోంది. శ్రావణ బహుళ నవమి రాత్రి 9.53 గంటల వరకు ఉండి, ఆ తర్వాత దశమి ప్రారంభమవుతుంది. మృగశీర్ష నక్షత్రం రాత్రి 9.30 గంటల వరకు కొనసాగి, అనంతరం ఆరుద్ర ప్రవేశిస్తుంది. వజ్ర యోగం మధ్యాహ్నం 12.47 గంటల వరకు ఉండి, ఆ తర్వాత సిద్ధి యోగం వస్తుంది. తైతిల కరణం ఉదయం 11.04 గంటల వరకు, అనంతరం గరజి కరణం రాత్రి 9.53 గంటల వరకు ఉంటుంది. ఈ పంచాంగ ప్రభావాల నేపథ్యంలో రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి.
మేషరాశి
ఈరోజు మేష రాశి వారికి అవకాశాలతో పాటు కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతాయి. ఉద్యోగం లేదా వృత్తిలో అనుకోని అవకాశం రావచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో చిన్న విషయాలను పెద్దవిగా మార్చకుండా సంయమనంతో వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
వృషభరాశి
వృషభ రాశి వారికి కార్యసాధనకు అనుకూలమైన రోజు. ఉద్యోగంలో అప్పగించిన పనులను సమయానికి పూర్తి చేయడం వల్ల ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకోవచ్చు. ఆర్థికంగా ఊరటనిచ్చే పరిణామాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం లభిస్తుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
మిథునరాశి
మిథున రాశి వారికి ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను అందిస్తాయి. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా మారవచ్చు. ఆర్థికంగా కొత్త ఆశలు చిగురిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
కర్కాటకరాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత ఒత్తిడితో కూడుకున్న రోజు. వృత్తి జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించగలరు. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆదాయానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
సింహరాశి
సింహ రాశి వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పనిపట్ల చూపించే అంకితభావం భవిష్యత్తులో పదోన్నతికి దారి తీస్తుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. స్నేహితులు, బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కన్యారాశి
కన్య రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసొచ్చే రోజు. ధర్మబద్ధంగా, నిజాయతీగా చేసే పనుల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు తలుపుతట్టవచ్చు. ఆర్థికాభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకునేవారికి అనుకూల సంకేతాలు ఉన్నాయి. ప్రయాణాల్లో మాత్రం అప్రమత్తంగా ఉండాలి.
తులారాశి
తుల రాశి వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. పనిభారం పెరగడంతో మానసిక ఒత్తిడి రావచ్చు. ముఖ్యమైన విషయాల్లో ఇతరుల మాటలను పూర్తిగా నమ్మకుండా స్వయంగా పరిశీలించాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఇంట్లో ప్రశాంతత కోసం మాటల్లో సంయమనం పాటించాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారు అనుభవజ్ఞుల సలహాలను తీసుకుని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందగలరు. ఉద్యోగంలో కీలక బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబ విషయాల్లో మాత్రం కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.
ధనుస్సురాశి
ధనుస్సు రాశి వారికి ఈరోజు కొంత సాధారణంగా ఉంటుంది. మొదలుపెట్టిన పనుల్లో ఆలస్యం రాకుండా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఉద్యోగంలో అధికారులతో వ్యవహరించేటప్పుడు మాటతీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కుటుంబంలో ఓర్పే మీకు మేలు చేస్తుంది.
మకరరాశి
మకర రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా అనుకూలించే సూచనలు ఉన్నాయి. వృత్తి నిపుణులు, వ్యాపారులు తమ సామర్థ్యాన్ని చాటుకునే అవకాశం పొందుతారు. చేసిన పనికి ప్రశంసలు, గుర్తింపు లభించవచ్చు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.
కుంభరాశి
కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకున్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే అధికారిక పత్రాలు, ఆర్థిక లావాదేవీల విషయంలో ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. అవసరమైన సమయంలో ఇతరుల సహకారం లభిస్తుంది. ప్రయాణాల్లో నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
మీనరాశి
మీన రాశి వారికి ఈరోజు ఫలప్రదమైన రోజు. ఉద్యోగం, వ్యాపారంలో చేసిన కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. అయితే ఇతరుల గొడవల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించండి.




