Daily Horoscope: ఒకవైపు ఒత్తిళ్లు...మరోవైపు ఆధ్యాత్మిక యాత్రలు...ఈ రాశులది సంపూర్ణ విజయం

రేవతి నక్షత్రం, ఆయుష్మాన్‌, సౌభాగ్య, శోభన యోగం ప్రభావం ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.

Balachander
Published on: 10 Jun 2026 7:46 AM IST
Daily Horoscope: ఒకవైపు ఒత్తిళ్లు...మరోవైపు ఆధ్యాత్మిక యాత్రలు...ఈ రాశులది సంపూర్ణ విజయం
X

Daily Horoscope: ఈ రోజు అధిక జ్యేష్ఠ మాస బహుళ పక్ష దశమి తిథి రాత్రి 12.57 వరకూ తదుపరి ఏకాదశీ తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 09.21 వరకూ తదుపరి రేవతీ నక్షత్రం, ఆయుష్మాన యోగం ఉదయం 06.30 వరకూ తదుపరి సౌభాగ్య యోగం రాత్రి 04.03 వరకూ తదుపరి శోభన యోగం, వణిజ కరణం మ.01.52 వరకూ, భద్ర(విష్టీ ) కరణం రాత్రి 12.57 వరకూ బవ కరణం ఉంటాయి. ఈరోజు ఆయుష్మాన్‌, సౌభాగ్య, శోభన యోగం ప్రభావంతో పలు రాశుల్లో అనుకోని మార్పులు ఉండనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. అనుకోని విధంగా సమస్యలు ఎదురౌతాయి. ఆత్మస్థైర్యంతో వాటిని ఎదుర్కొవాలి. మీరు నమ్మినవారు మీకు దూరంగా ఉంటారు. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఎదురౌతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వంతో ముడిపడిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పరంగా ఈరోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. నూతన పరిచయాలు పురోభివృద్దికి దోహదపడతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలుంటాయి. భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. బాల్య స్నేహితులను కలుసుకుంటారు.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. బుద్ధి, పరిజ్ఞానం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి. నూతన పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేవు.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. కటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. ఆధ్యాత్మిక యాత్రలు చేయడం శుభప్రదం.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. అయితే కోపాన్ని నియంత్రించుకోవలసిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలి. వీలైనంత వరకు శాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. మిత్రులతో కలిసి సమయాన్ని గడుపుతారు. అయితే, పెట్టుబడులు, కొనుగోళ్ల విషయంల జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగరంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపుతారు.

ధనుస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఆలోచనల్లో గందరగోళం తలెత్తవచ్చు. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల సహకారంతో కీలక పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. దైవారాదన చేయడం మంచిది.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడతారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయాలి. ధనలాభ సూచనలు ఉన్నాయి.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బందులు ఉండవు. నూతన ప్రణాళికలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. మంచి కాలం ప్రారంభమైందని అనుకోవాలి.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. సమాజంలో గుర్తింపు గౌరవం లభిస్తాయి. ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సమస్యలు కొలిక్కి వస్తాయి. సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

గమనికః ఇక్కడ ఇచ్చిన ఫలితాలు సామాన్యమైనవి. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story