Daily Horoscope: గజకేసరి యోగం.. అదృష్ట దేవత తలుపు తట్టబోయే రాశులు ఇవే..!
Daily Horoscope: బుధవారం, 15 ఏప్రిల్ 2026 నాటి ద్వాదశ రాశి ఫలాలు ఇక్కడ ఉన్నాయి.
Daily Horoscope: గజకేసరి యోగం.. అదృష్ట దేవత తలుపు తట్టబోయే రాశులు ఇవే..!
Today Rasi Phalalu: మేషం నుండి మీనం వరకు మీ జాతకం, ఆరోగ్య సూచనలు, ఆర్థిక పరిస్థితి , వృత్తి వ్యాపారాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. భూ, వాహన క్రయ విక్రయాలలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
వృషభం
పనులు చకచకా సాగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. అయితే, ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున నియంత్రణ అవసరం. ఆరోగ్య విషయంలో స్వల్ప జాగ్రత్తలు తీసుకోండి.
మిథునం
స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు.
కర్కాటకం
ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మానసిక ఆందోళన కలగకుండా ధైర్యంగా ఉండండి. వృత్తిరీత్యా శ్రమ అధికమవుతుంది.
సింహం
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అయితే ఆర్థిక ఇబ్బందులు కొంత సతమతం చేయవచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. దైవదర్శనం ప్రశాంతతను ఇస్తుంది.
కన్య
గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.
తుల
ఇంటా బయటా సానుకూల వాతావరణం ఉంటుంది. మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం వల్ల రుణ బాధలు తొలిగిపోయే అవకాశం ఉంది.
వృశ్చికం
పరిస్థితులు అంతగా అనుకూలించకపోవచ్చు. అకారణ వివాదాలకు దూరంగా ఉండండి. పనులు ముందుకు సాగడంలో జాప్యం జరగవచ్చు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు.
ధనుస్సు
కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. సన్నిహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
మకరం
పనుల్లో ఉన్న అవాంతరాలు తొలగిపోతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో మరింత సానుకూలత కనిపిస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
కుంభం
సన్నిహితులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
మీనం
ఆకస్మిక ధనలాభం పొందుతారు. శుభకార్యాలపై చర్చలు ఫలిస్తాయి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
గమనిక: ఇవి కేవలం గ్రహగతి ఆధారంగా చెప్పబడిన సాధారణ ఫలితాలు. వ్యక్తిగత జాతక వివరాల ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.




