Today Rasi Phalalu: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. ఆ ఒక్క రాశి వారు జాగ్రత్త!

Today Rasi Phalalu: వృషభం, సింహం, కన్యా రాశుల వారికి అదృష్టం, మేష రాశి వారికి ధననష్టం.

Naresh.k
Published on: 19 July 2026 8:22 AM IST
Today Rasi Phalalu
X

Today Rasi Phalalu: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. ఆ ఒక్క రాశి వారు జాగ్రత్త!

Daily Rasi Phalalu: జ్యోతిషాన్ని, రాశి ఫలాలను విశ్వసించేవారు మన దేశంలో చాలామంది ఉంటారు. ఉదయం లేవగానే దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభించడం, వాటికి అనుగుణంగానే పనులను ప్లాన్‌ చేసుకోవడం చాలామందికి అలవాటు. మరి వారి కోసం ఈ నాటి ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో, ఎవరికి ఎలాంటి యోగం ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మేష రాశి

వృత్తి, ఉద్యోగ రంగాల వారికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. నిగ్రహం అవసరం. అయితే, విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు సులభంగా ముందుకుసాగుతాయి.ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడుల విషయంలో ఆలోచించి అడుగు వేయండి. కుటుంబంలో చిన్నపాటి కలహాలు వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి శాంతంగా ఉండండి. పిల్లల పట్ల, మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది.

వృషభ రాశి

మీరు చేపట్టే ప్రయత్న కార్యాలన్నింటిలోనూ దిగ్విజయాన్ని పొందుతారు. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. భవిష్యత్తుకు ఉపయోగపడే శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో ఆర్థికంగా, మానసికంగా మిక్కిలి ఆనందిస్తారు. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

మిథున రాశి

ముఖ్యంగా కళాకారులు, మీడియా రంగాల వారికి నూతన మరియు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందే యోగం ఉంది.

కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. దేహాలంకరణకు, ఫ్యాషన్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు.

కర్కాటక రాశి

వృత్తి రీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అయితే విదేశీ యానానికి సంబంధించిన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది.అనవసరంగా డబ్బు ఖర్చవడంతో కాస్త ఆందోళన చెందుతారు. ఖర్చులపై నియంత్రణ అవసరం.ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు, చిన్నపాటి అలసట ఉంటుంది.

సింహ రాశి

చాలా రోజులుగా వేధిస్తున్న స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి. నూతన గృహ నిర్మాణ పనులపై శ్రద్ధ వహిస్తారు.ఆకస్మిక ధనలాభం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు, దీనివల్ల భక్తిశ్రద్ధలు, మనశ్శాంతి అధికమవుతాయి.

కన్యా రాశి

ఈరోజు మీ ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. కొత్త పనులకు, ప్రాజెక్టులకు చక్కని రూపకల్పన చేస్తారు.ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కళాత్మక వస్తువులను సేకరించడానికి ఖర్చు చేస్తారు.విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. పాత మిత్రులను, బంధువులను కలుసుకోవడం వల్ల ఉత్సాహం పెరుగుతుంది.

తులా రాశి

ఇతరులకు అపకారం కలిగించే పనులకు, అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుత్సాహం మీపై ప్రభావం చూపకుండా చూసుకోండి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం అవసరం. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మాటతీరు జాగ్రత్త. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధల నుండి దూరంగా ఉండవచ్చు.

వృశ్చిక రాశి

ఈరోజు మీరు మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. మీ సూక్ష్మబుద్ధితో క్లిష్టమైన సమస్యల్లోనూ విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి.అనుకోని మార్గాల ద్వారా ఆకస్మిక లాభాలు ఉంటాయి.శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సమాజంలో ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

ధనుస్సు రాశి

సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి మీ వంతు కృషి చేస్తారు.ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దీనివల్ల చాలా కాలంగా ఉన్న రుణబాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.కుటుంబ పరిస్థితులు చాలా సంతృప్తికరంగా మరియు ప్రశాంతంగా ఉంటాయి. ఆత్మీయులు, బంధుమిత్రులను కలుసుకుంటారు.

మకర రాశి

చేసే పనుల్లోనూ, ప్రయత్నకార్యాలకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల శారీరక అలసట చెందుతారు. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి.ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి, కానీ పనులకు ఢోకా ఉండదు.కుటుంబంలో ఉన్న చిన్నపాటి కలహాలు దూరమై సయోధ్య కుదురుతుంది. చెడు సహవాసాలకు, పనులకు దూరంగా ఉండటం మంచిది.

కుంభ రాశి

సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. అయితే, పనుల్లో అనవసర వ్యయప్రయాసలు ఎదురవుతాయి.వృథా ఖర్చులు పెరుగుతాయి. బడ్జెట్ విషయంలో నియంత్రణ అవసరం.బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా మాటతీరులో జాగ్రత్త వహించాలి. కొంత మానసిక ఆందోళన, శారీరక బలహీనత వల్ల ఇబ్బంది పడతారు. విందులలో పాల్గొనేటప్పుడు జాగ్రత్త.

మీన రాశి

వృత్తిరీత్యా మీకు అనుకూలమైన స్థానచలనం ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు.ఆర్థిక ఇబ్బందులతో కాస్త సతమతమవుతారు. డబ్బు విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరం.ఇతరులతో పోట్లాటలకు, వాదనలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి వైద్యుల సలహా ప్రకారం ఔషధసేవ తప్పదు.

గమనిక: ఈ రాశిఫలాలు అనేవి నమ్మకం, గ్రహస్థితుల ఆధారంగా ఇవ్వబడినవి. మీ వ్యక్తిగత జాతక చక్రాల ఆధారంగా ఫలితాలలో మార్పులు ఉండవచ్చు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story