Thursday Horoscope: గురువారం ఈ రాశులకు రాజయోగం... లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక లాభం
గురువారం రాశిఫలాలు- లక్ష్మీదేవి అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి, వ్యాపారంలో కొత్త అవకాశాలు కలిగే సూచనలు ఉన్నాయి.
Thursday Horoscope: గురువారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూల సమాచారం అందే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. అంతేకాకుండా కొన్ని రాశులకు రాజయోగంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగబోతున్నది. మరి 12 రాశుల వారికి గురువారం ఎలా ఉండబోతోందో చూద్దాం.
మేషరాశి
ఈ రోజు మీ జీవితంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోవచ్చు. గతంలో మీరు చేసిన ప్రయత్నాలకు తగిన ఫలితాలు అందే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో చిన్నపాటి ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. వారి సమస్యలను అర్థం చేసుకుని అండగా నిలవండి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నందున ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.
వృషభరాశి
ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనుల్లో ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రావచ్చు. అయితే ఫలితాలు ఆశించిన విధంగా రావాలంటే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మిథునరాశి
ఆర్థికంగా పురోగతి సాధించేందుకు అనుకూలమైన రోజు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభించవచ్చు. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశాజనక పరిణామాలు ఎదురుకావచ్చు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపుపై దృష్టి పెట్టండి.
కర్కాటకరాశి
కొత్త బాధ్యతలు మీకు మంచి గుర్తింపు తీసుకురావచ్చు. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ పని చేసినా తగిన సమయం కేటాయించండి. సహనం, క్రమశిక్షణతో వ్యవహరిస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
సింహరాశి
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ఒప్పందాల్లో సానుకూల ఫలితాలు కనిపించవచ్చు. గురువు అనుగ్రహంతో ఈ రాశివారికి పనులు పూర్తవుతాయి.
కన్యారాశి
ముఖ్యమైన బాధ్యతలు చేపట్టాల్సి రావచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. చదువు, ఉద్యోగం, కుటుంబం మధ్య సమతుల్యత పాటించడం అవసరం. వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను మీ తెలివితేటలతో పరిష్కరించగలుగుతారు. ప్రతి విషయంలోనూ తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి.
తులారాశి
మీరు ప్రారంభించిన పనులు ఆశించిన దిశగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు అనుకూల ఫలితాలను అందించవచ్చు. వ్యాపార విస్తరణ, పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఏర్పడవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
వృశ్చికరాశి
పనుల ఒత్తిడి కొంత ఎక్కువగా ఉండవచ్చు. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. పని విషయంలో క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దు. గురువారం మధ్యాహ్నం నుంచి ఈ రాశివారి జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. గురు అనుగ్రహంతో లక్ష్మీకటాక్షం సిద్దిస్తుంది.
ధనుస్సురాశి
కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వాటిని పెద్దవి చేయకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. చేపట్టిన పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులకు సంబంధించి కొత్త మార్గాలు కనిపించవచ్చు. ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి.
మకరరాశి
కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఉద్యోగులకు పదోన్నతి లేదా అదనపు బాధ్యతలు లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించుకుని ముందుకు సాగితే ప్రయోజనం ఉంటుంది.
కుంభరాశి
ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనుల్లో పురోగతి సాధించడానికి పాత ప్రణాళికల్లో మార్పులు చేయాల్సి రావచ్చు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సమస్యలు ఎదురైతే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది.
మీనరాశి
మీరు చేపట్టిన పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది. లక్ష్యంపై దృష్టి నిలిపితే విజయాన్ని అందుకోగలుగుతారు.
గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించండి.




