Today Horoscope: ఈరోజు మీ ఇంట కనక వర్షాన్ని కురిపించే రాశులు...ఈ చిన్ని పరిష్కారంతో సాధ్యం
అధిక జ్యేష్టమాసం, బహుళ పక్ష విదియ, సాధ్యయోగంతో పలు పనుల్లో విజయంతో పాటు మీ ఇంట లక్ష్మీదేవి సిరులు కురిపిస్తుంది. మరి సిరులు కురిపించే రాశుల్లో మీ రాశికూడా ఉందా...ఒకసారి చూసుకోండి.
Today Horoscope: ఈరోజు అధిక జ్యేష్ఠ మాస బహుళ విదియ తిథి ఆధ్యాత్మికపరంగా పలు రాశుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వృషభం, కర్కాటకం, ధనస్సు, మీన రాశుల వారికి ధనప్రాప్తి యోగాలు బలంగా ఉన్నాయి. ఇక ఈరోజు నెయ్యితో దీపం వెలిగించి శ్రీమహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకధార స్తోత్రాన్ని పఠించడం వలన ఫలితాలు సానుకూలంగా ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. గోవుకు ఆహారం తినిపిండం, పేదలకు దానం చేయడం వలన కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇలాంటి చిన్న పరిష్కారాలతో మీ ఇంట కనకవర్షం కురుస్తుందని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు. విదియ తిథి, సాధ్య యోగంతో ఈరోజు ద్వాదశ రాశుల్లో వచ్చే మార్పులు ఏమిటో తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి ఈరోజు ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ బాధ్యతలు పెరిగినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకపోవడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాల్లో ఓపిక అవసరం. ఈరోజు మేషరాశివారు గోవుకు దాణ అందించడం వలన శుభ ఫలితాలను అందుకుంటారు.
వృషభరాశి
వృషభ రాశి వారికి ఈరోజు అనుకోని ధనలాభ సూచనలు ఉన్నాయి. స్నేహితులు, బంధువుల సహకారంతో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా కొంత ఊరట లభించే రోజు. కొత్త ఆలోచనలు మంచి ఫలితాలను అందించవచ్చు. ఈరోజు వృషభరాశివారు శ్రీమహాలక్ష్మిని ఆరాధించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
మిథునరాశి
మిథున రాశి వారు మాట విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలకు దారితీయకుండా సంయమనం పాటించాలి. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభసూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మిథునరాశివారు లక్ష్మీగణపతిని ఆరాధించడం వలన శుభవార్తలు వింటారు.
కర్కాటకరాశి
కర్కాటక రాశి వారికి కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యాల చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈరోజు కర్కాటకరాశివారు సుబ్రహ్మణ్య స్వామికి నెయ్యితో దీపం వెలిగించాలి.
సింహరాశి
సింహ రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం ప్రధాన బలం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలు లాభదాయకంగా మారవచ్చు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఈరోజు సింహరాశివారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మేలు జరుగుతుంది.
కన్యారాశి
కన్య రాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయం, వ్యయాల మధ్య సమతుల్యత పాటించడం అవసరం. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముంది. ఈరోజు కన్యారాశివారు ప్రదోష సమయంలో దక్షిణామూర్తిని ఆరాధించడం వలన గురుగ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
తులారాశి
తుల రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. బంధుమిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా త్వరగా కోలుకుంటారు. సాయంత్రంలోగా కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తులారాశివారు పంచముఖ ఆంజనేయుడికి అప్పాలను సమర్పించడం వలన అనుకున్న పనులు పూర్తవుతాయి.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారికి పనుల్లో ఆశించిన వేగం కనిపించకపోవచ్చు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దూర ప్రయాణాలను వాయిదా వేయడం శ్రేయస్కరం. మధ్యాహ్నం తరువాత ముఖ్యమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. ఈరోజు వృశ్చికరాశివారు కులదేవతకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడం వలన ధనలాభం కలుగుతుంది.
ధనస్సురాశి
ధనుస్సు రాశి వారికి శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు లేదా పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈరోజు ధనస్సురాశివారు లక్ష్మీకుబేర యంత్రానికి పసుపు కుంకుమతో పూజ చేయాలి. మెరుగైన ఫలితాలను పొందుతారు.
మకరరాశి
మకర రాశి వారు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఈరోజు మకరరాశివారు దుర్గాదేవిని ఇతోధికంగా పూజించడం వలన శతృవులపై విజయం సాధించడమే కాకుండా మీ ఇంట సిరుల పంట పండుతుంది.
కుంభరాశి
కుంభ రాశి వారికి పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ పట్టుదలతో ముందుకు వెళితే ఫలితాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు కుంభరాశివారు ఆదిదంపతులైన శివపార్వతుల షోడశోపేతంగా పూజను చేయడం వలన బాంధవ్యం బలపడుతుంది. సంతానం నుంచి ధనలాభం కలుగుతుంది.
మీనరాశి
మీన రాశి వారికి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. కొత్త పెట్టుబడులు, ఒప్పందాలు, వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వృద్ధి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీనరాశివారు అష్టలక్ష్మీ ఆరాధన చేయాలి. సూర్యాస్తమయంలోగా పేదలకు తోచినది దానం ఇవ్వాలి.
గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలితాలు సామాన్యమైనవి మాత్రమే. పూర్తిస్థాయి వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించాలి.




