Trigrahi Rajyog 2026: త్రిగ్రాహి రాజయోగం...దీపావళి నుంచి ఈ నాలుగు రాశులకు అదృష్టమే
దీపావళి 2026 నుంచి త్రిగ్రాహి రాజయోగం ప్రభావంతో మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చిక రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి, అదృష్టం కలిసిరానున్నాయి.
Trigrahi Rajyog 2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో సంచరించినప్పుడు వాటి స్థానాలను బట్టి వివిధ యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తే, మరికొన్ని ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ వ్యవహారాల్లో అనుకూల మార్పులకు సంకేతంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో దీపావళి పండుగ సమయంలో ఏర్పడనున్న త్రిగ్రాహి యోగం జ్యోతిష్య వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. చంద్రుడు, గురుడు, కేతువు ఒకే రాశిలో కలవడంతో ఈ యోగం ఏర్పడనుంది. ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చిక రాశుల వారికి ఈ గ్రహస్థితులు అనుకూల ఫలితాలను అందిస్తాయని జ్యోతిష్య అంచనా.
త్రిగ్రాహి రాజయోగం ఎలా ఏర్పడుతుంది?
గ్రహ సంచారంలో చంద్రుడి ప్రయాణం చాలా వేగంగా ఉంటుంది. సుమారు రెండున్నర రోజులకు ఒకసారి చంద్రుడు తన రాశిని మారుస్తుంటాడు. ఈ నేపథ్యంలో చంద్రుడు సింహ రాశిలోకి ప్రవేశించడంతో అక్కడ ఇప్పటికే సంచరిస్తున్న గురు, కేతువులతో కలయిక ఏర్పడుతుంది. ఇలా మూడు గ్రహాలు ఒకే రాశిలో ఉండటాన్ని త్రిగ్రాహి యోగంగా పరిగణిస్తున్నారు. ఈ గ్రహస్థితి ప్రభావంతో కొన్ని రాశుల వారికి గతంలో నిలిచిపోయిన పనులు ముందుకు కదలడం, ఆర్థికంగా మెరుగైన అవకాశాలు రావడం, వృత్తిపరంగా గుర్తింపు లభించడం వంటి పరిణామాలు ఉండవచ్చని జ్యోతిష్య విశ్లేషణ చెబుతోంది. మరి ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో తెలుసుకుందాం.
మిథునరాశి
మిథున రాశి వారికి ఈ గ్రహాల కలయిక ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మూడో స్థానానికి సంబంధించిన అంశాల్లో అనుకూలత ఏర్పడవచ్చు. చాలా కాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టే పరిస్థితులు రావచ్చు. తోబుట్టువులతో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనం పొందే సూచనలు ఉన్నాయి.
కర్కాటకరాశి
కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయాల్లో కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషించే ప్రయత్నాలు ఫలించవచ్చు. గతంలో చేసిన పెట్టుబడులు లేదా పెండింగ్లో ఉన్న బకాయిల విషయంలో సానుకూల పరిణామాలు ఉండవచ్చు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసినప్పటికీ పొదుపుపై దృష్టి పెట్టగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది.
సింహరాశి
ఈ త్రిగ్రాహి యోగం సింహ రాశిలోనే ఏర్పడుతుండటంతో ఈ రాశి వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. వ్యక్తిగత నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. గతంలో ఎదురైన ఆటంకాలను అధిగమించే ధైర్యం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి అనుకూల సమాచారం అందవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఉన్నాయి.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉండవచ్చు. పదో స్థానానికి సంబంధించిన ప్రభావం కారణంగా ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపుపై ఆశలు చిగురించవచ్చు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య అవకాశాలు రావచ్చు. నిరుద్యోగులు తమకు నచ్చిన రంగంలో ఉద్యోగం సంపాదించేందుకు చేసే ప్రయత్నాల్లో ముందడుగు వేయవచ్చు. ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించండి.




