Vastu Tips: సాయంత్రం వేళ.. ఇంటి మెయిన్ డోర్ మూయకూడదని ఎందుకు అంటారో తెలుసా?
Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది కేవలం ఇంట్లోకి వెళ్లేందుకు, బయటకు రావడానికి మాత్రమే ఉపయోగపడే తలుపు కాదు.
Vastu Tips: సాయంత్రం వేళ.. ఇంటి మెయిన్ డోర్ మూయకూడదని ఎందుకు అంటారో తెలుసా?
Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది కేవలం ఇంట్లోకి వెళ్లేందుకు, బయటకు రావడానికి మాత్రమే ఉపయోగపడే తలుపు కాదు. ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించే ముఖ్యమైన మార్గంగా దీనిని భావిస్తారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ప్రధాన తలుపును కొంతసేపు తెరిచి ఉంచడం శుభప్రదమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
సాయంత్రం ప్రధాన తలుపు ఎందుకు తెరిచి ఉంచాలని చెబుతారు?
వాస్తు ప్రకారం సాయంత్రం వేళ ఇంట్లోకి శుభశక్తులు ప్రవేశిస్తాయని నమ్మకం. ఈ సమయంలో ప్రధాన తలుపు పూర్తిగా మూసి ఉంచితే సానుకూల శక్తి ఇంట్లోకి రాకుండా అడ్డంకి ఏర్పడుతుందని చెబుతారు. అందుకే సూర్యాస్తమయం సమయంలో కొంతసేపు తలుపు తెరిచి ఉంచడం మంచిదిగా భావిస్తారు.
లక్ష్మీదేవి అనుగ్రహానికి సంబంధం ఏంటి.?
హిందూ సంప్రదాయాల ప్రకారం సాయంత్రం సమయం లక్ష్మీదేవి ఇంటిని అనుగ్రహించే సమయంగా భావిస్తారు. ఆ సమయంలో ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా, వెలుగుతో ఉండి కొంతసేపు తెరిచి ఉంటే ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం.
సాయంత్రం దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు
మన దేశంలో చాలా కాలంగా సాయంత్రం ఇంటి ప్రధాన తలుపు వద్ద దీపం వెలిగించే ఆచారం కొనసాగుతోంది. దీపం వెలుగు ఇంట్లోని ప్రతికూలతను తొలగించి ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. అలాగే ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం శుభానికి సంకేతంగా భావిస్తారు.
గంగాజలం లేదా నీళ్లు ఎందుకు చల్లుతారు.?
వాస్తు ప్రకారం సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారం వద్ద గంగాజలం లేదా శుభ్రమైన నీటిని చల్లడం శుభప్రదంగా భావిస్తారు. దీంతో ఆ ప్రాంతం పవిత్రంగా మారుతుందని, ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయని విశ్వాసం. ఇది కూడా సంప్రదాయ ఆచారాల్లో ఒకటి.
ప్రధాన ద్వారం వద్ద చేయకూడని తప్పులు
వాస్తు ప్రకారం ప్రధాన తలుపు వద్ద ఎప్పుడూ చెత్త, దుమ్ము, పాత చెప్పులు లేదా అనవసర వస్తువులు పేరుకుపోకుండా చూసుకోవాలి. అలాగే ఆ ప్రాంతంలో చీకటి ఉండకుండా తగిన వెలుతురు ఏర్పాటు చేయాలని సూచిస్తారు. శుభ్రంగా, ప్రకాశవంతంగా ఉన్న ప్రధాన ద్వారం ఇంటికి సానుకూల వాతావరణాన్ని తీసుకొస్తుందని, కుటుంబంలో ఆనందం, ప్రశాంతత పెరుగుతుందని వాస్తు నమ్మకం.
గమనిక: పై విషయాలు వాస్తు శాస్త్రం, సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఇవ్వడమైంది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.




