Dog Dreams: కుక్క కరిచినట్లు కల వచ్చిందా.? దీని అర్థం ఏంటో తెలుసా.?
Dog Dreams: Dog Dreams: నిద్రలో వచ్చే కలలకు ఒక్కొక్కరు ఒక్కో అర్థం చెబుతుంటారు. ముఖ్యంగా స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని జంతువులు కలలో కనిపించడం శుభసూచకమని, మరికొన్ని కనిపించడం అశుభానికి సంకేతమని నమ్ముతారు.
Dog Dreams: కుక్క కరిచినట్లు కల వచ్చిందా.? దీని అర్థం ఏంటో తెలుసా.?
Dog Dreams: నిద్రలో వచ్చే కలలకు ఒక్కొక్కరు ఒక్కో అర్థం చెబుతుంటారు. ముఖ్యంగా స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని జంతువులు కలలో కనిపించడం శుభసూచకమని, మరికొన్ని కనిపించడం అశుభానికి సంకేతమని నమ్ముతారు. కలలో కుక్క కనిపిస్తే అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కలలో కుక్క కరిస్తే అదృష్టం కలిసొస్తుందా?
సాధారణంగా కుక్క కరిస్తే ప్రమాదానికి సంకేతంగా భావిస్తాం. కానీ స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కుక్క కరిచినట్లు కనిపించడం కొన్ని సందర్భాల్లో శుభప్రదమని చెబుతారు. ముఖ్యంగా చాలాకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తయ్యే అవకాశం ఉందని, అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని విశ్వసిస్తారు. అంతేకాదు, త్వరలోనే సంతోషకరమైన వార్త వినే సూచనగా కూడా ఈ కలను పరిగణిస్తారు. అయితే కుక్క కరిచినట్లు కల వచ్చిందని నిజ జీవితంలో ఏదైనా ప్రత్యేక పరిణామం జరుగుతుందని భావించాల్సిన అవసరం లేదు.
కోపంగా ఉన్న కుక్క, వెంటాడే కుక్క కనిపిస్తే..
కలలో కుక్క దూకుడుగా ప్రవర్తించడం లేదా మీపై కోపంతో ఉన్నట్లు కనిపించడం మంచిది కాదని స్వప్న శాస్త్రంలో చెబుతారు. సన్నిహితుల నుంచి నమ్మకద్రోహం ఎదురయ్యే అవకాశం ఉందని దీనికి అర్థం చెబుతారు. మీ చుట్టూ ఉన్నవారితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించే సంకేతంగా భావిస్తారు. అదేవిధంగా కుక్క మిమ్మల్ని వెంటాడుతున్నట్లు కల వస్తే, జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు, మానసిక ఒత్తిడి లేదా ఏదైనా భయానికి ప్రతిరూపంగా కొందరు భావిస్తారు. అయితే ఈ కలకు సంబంధించిన ఫలితాలు వ్యక్తుల నమ్మకాలను బట్టి మారుతుంటాయి.
కలలో కుక్కతో ఆడుకుంటే శుభవార్త వింటారా?
కలలో కుక్క మీతో సంతోషంగా ఆడుకుంటున్నట్లు కనిపిస్తే దానిని శుభసూచకంగా పరిగణిస్తారు. పాత స్నేహితులను తిరిగి కలుసుకునే అవకాశం ఉందని, గతంలో దూరమైన వ్యక్తులతో మళ్లీ అనుబంధం ఏర్పడుతుందని స్వప్న శాస్త్ర విశ్వాసం. అలాగే కుటుంబంలో సంతోషకరమైన పరిణామాలు చోటుచేసుకోవడం, ఆశించిన శుభవార్త అందుకోవడం వంటి ఫలితాలను కూడా దీనికి ఆపాదిస్తారు. మరోవైపు కుక్క పిల్లిని వెంటాడుతున్నట్లు కల వస్తే దానిని అశుభ సూచనగా భావిస్తారు. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు ఏర్పడటం, దంపతుల మధ్య మనస్పర్థలు పెరగడం, కుటుంబ జీవితంలో దూరం ఏర్పడటం వంటి పరిణామాలకు సంకేతంగా వివరిస్తారు.
కుక్క ఎముకను కొరికితే ఏమవుతుంది?
కలలో కుక్క ఎముకను కొరుకుతున్నట్లు కనిపిస్తే మీకు హాని కలిగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తున్నారని, మీ చుట్టూ కుట్రలు జరిగే అవకాశం ఉందని నమ్ముతారు. దీనివల్ల కుటుంబంలో గొడవలు లేదా మనస్పర్థలు ఏర్పడవచ్చని చెబుతారు. ఇక మీకు బదులుగా మరొక వ్యక్తిని కుక్క కరిచినట్లు కల వస్తే, మీకు ఏదైనా ప్రమాదం లేదా ఇబ్బంది ఎదురయ్యే సూచనగా భావిస్తారు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని స్వప్న శాస్త్ర విశ్వాసాలు సూచిస్తున్నాయి.
గమనిక: ఇవన్నీ స్వప్న శాస్త్రంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు మాత్రమే. కలలకు భవిష్యత్తు సంఘటనలను ముందుగానే తెలియజేసే శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించాలి.




