యా సంచలనం..! రూ. 9.78 లక్షలకే సొనెట్ డీజిల్ ఆటోమేటిక్.. ప్రత్యర్థులకు ఇక చుక్కలే!

Budget Automatic SUV: కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో కియా ఇండియా మరో పెద్ద సంచలనం సృష్టించింది. 2026 సొనెట్‌లో డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌ను రూ.9.78 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి తెచ్చింది.

Venkat
Published on: 15 March 2026 11:12 PM IST
2026 kia sonet diesel automatic price under 10 lakh
X

యా సంచలనం..! రూ. 9.78 లక్షలకే సొనెట్ డీజిల్ ఆటోమేటిక్.. ప్రత్యర్థులకు ఇక చుక్కలే!

2026 Kia Sonet: కియా ఇండియా 2026 సొనెట్‌ను అప్‌డేట్ చేసి మరింత చవకైన ఆటోమేటిక్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో ప్రధాన ఆకర్షణ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్. కొత్త HTE (O) డీజిల్ AT ప్రారంభ ధర రూ.9.78 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇదే సమయంలో టర్బో పెట్రోల్ 7-స్పీడ్ DCT వేరియంట్ ప్రారంభ ధర కూడా దాదాపు రూ.9.90 లక్షలు వరకు తీసుకువచ్చింది. దీంతో సొనెట్ సెగ్మెంట్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందుబాటులోకి తెచ్చిన మోడల్‌గా నిలిచింది.

కొత్త ‘మాగ్మా రెడ్’ రంగుతో బోల్డ్ లుక్..

2026 సొనెట్‌లో కియా కొత్త Magma Red కలర్ ఆప్షన్‌ను చేర్చింది. దీనితో పాటు Imperial Blue, Pewter Olive, Glacier White Pearl, Aurora Black Pearl వంటి రంగులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం లుక్ కోరుకునే వారికి X-Line ట్రిమ్‌లో Matte Graphite షేడ్ కొనసాగుతోంది. ఈ కొత్త రంగు ఎంపికలు సొనెట్ స్పోర్టీ స్టైలింగ్‌ను మరింత హైలైట్ చేస్తున్నాయని ఆటో నివేదికలు పేర్కొన్నాయి.

తక్కువ వేరియంట్లకే ఆటోమేటిక్ సౌకర్యం..

ఇప్పటివరకు సొనెట్‌లో ఆటోమేటిక్ గియర్‌బాక్స్ ప్రధానంగా ఎగువ వేరియంట్లలో మాత్రమే లభించేది. ఇప్పుడు కియా దాన్ని దిగువ వేరియంట్లకూ విస్తరించింది. డీజిల్‌లో HTE (O), HTK (O), HTK+, HTK+ (O) వంటి కొత్త ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే విధంగా టర్బో పెట్రోల్ ఆటోమేటిక్‌ను కూడా తక్కువ ధరలో అందించాలనే వ్యూహంతో కొత్త ఆప్షన్లు తీసుకొచ్చింది. ఈ మార్పుతో ఇంతకుముందు బడ్జెట్ కారణంగా మాన్యువల్ కార్లనే చూసిన కొనుగోలుదారులు ఇప్పుడు ఆటోమేటిక్ వైపు మళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కియా వ్యూహం ఏంటంటే?

భారత మార్కెట్లో ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతున్న సమయంలో కియా తీసుకున్న ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా కీలకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ పెరుగుతున్న తరుణంలో, డీజిల్ ఆటోమేటిక్‌ను రూ.10 లక్షల లోపే అందించడం సొనెట్‌కు కొత్త కస్టమర్లను తీసుకురావచ్చు. ధర, స్టైల్, ఫీచర్లు, ట్రాన్స్‌మిషన్ ఎంపికల కలయికతో 2026 సొనెట్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో పోటీని మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది.

Venkat

Venkat

Next Story