Upcoming SUVs: పంచ్, నెక్సాన్, బ్రెజాలకు చెక్ పెట్టడానికి వస్తున్న 6 కొత్త ఎస్‌యూవీలు.. లాంచ్ ఎప్పుడంటే?
Upcoming SUVs: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో రాబోయే రోజుల్లో పోటీ మరింత రంజుగా మారనుంది.
Upcoming SUVs
Upcoming SUVs: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో రాబోయే రోజుల్లో పోటీ మరింత రంజుగా మారనుంది. ముఖ్యంగా 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తమ పట్టును మరింత బలపేతం చేసుకోవడానికి ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన రెనాల్ట్, నిసాన్ భారీ సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో కేవలం ఎస్‌యూవీలే కాకుండా 7-సీటర్ ఎమ్‌పీవీ మోడళ్లు కూడా ఉన్నాయి. ఈ కొత్త కార్లు టర్బో పెట్రోల్, సీఎన్‌జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో రానున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో దూసుకుపోతున్న టాటా పంచ్, టాటా నెక్సాన్, మారుతి బ్రెజా వంటి పాపులర్ కార్లకు గట్టి పోటీ ఇచ్చే ఆ 6 అప్‌కమింగ్ మోడళ్ల వివరాలు ఇక్కడ చూద్దాం.
1. రెనాల్ట్ ట్రైబర్ టర్బో + సీఎన్‌జీ
రెనాల్ట్ తన ప్రసిద్ధ 7-సీటర్ కారు ట్రైబర్ ను మరింత పవర్ఫుల్ ఇంజిన్‌తో మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో కైగర్‌లో ఉండే 1.0-టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించనున్నారు. ఇది సుమారు 100bhp పవర్, 160Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే దీనితో పాటు ఫ్యాక్టరీ-ఫిటెడ్ సీఎన్‌జీ వేరియంట్‌పై కూడా కంపెనీ పనిచేస్తోంది.
2. నిసాన్ గ్రావైట్ టర్బో + సీఎన్‌జీ
నిసాన్ బ్రాండ్ నుంచి రానున్న ఈ కొత్త కారు రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫారమ్‌పైనే తయారవుతోంది. ఇందులో కూడా 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సీఎన్‌జీ ఆప్షన్ లభించనుంది. కొత్త RGEP ప్లాట్‌ఫారమ్‌కు మారుతున్న ఈ కార్లలో అండర్-బాడీ సీఎన్‌జీ ట్యాంక్ అమర్చడం ద్వారా బూట్ స్పేస్ మరింత ఎక్కువగా లభిస్తుంది.
3. కొత్త రెనాల్ట్ కైగర్
రెనాల్ట్ తన పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్‌ను సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పైకి మార్చనుంది. దీనివల్ల సీఎన్‌జీ కిట్‌ను కింద భాగంలో సర్దుబాటు చేయడం సులభమై, ఎక్కువ లగేజ్ స్థంలం లభిస్తుంది. ఇంజిన్ పరంగా ఇందులో 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 100bhp టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు కొనసాగే అవకాశం ఉంది.
4. కొత్త నిసాన్ మాగ్నైట్
నిసాన్ సంస్థ కూడా తన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ మాగ్నైట్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను త్వరలో విడుదల చేయనుంది. డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, మెరుగైన ప్లాట్‌ఫారమ్, అండర్-బాడీ సీఎన్‌జీ ట్యాంక్ ఆప్షన్‌తో ఇది రానుంది. ఇది ప్రస్తుత మోడల్ కంటే మెరుగైన ప్యాకేజింగ్‌ను అందిస్తుంది.
5. రెనాల్ట్ బ్రిడ్జర్
రెనాల్ట్ నుంచి పూర్తిగా కొత్తగా వస్తున్న 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఎస్‌యూవీ ఇది. ఇది కైగర్, డస్టర్ మధ్యలో ప్లేస్ చేయబడుతుంది. బాక్సీ డిజైన్, హై గ్రౌండ్ క్లియరెన్స్‌తో రానున్న ఈ కారు ధర సుమారు రూ.8 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ఇంజిన్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.
6. నిసాన్ కొత్త ఎస్‌యూవీ
రెనాల్ట్ బ్రిజర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగానే నిసాన్ కూడా తన సొంత డిజైన్‌తో ఒక కొత్త ఎస్‌యూవీని మార్కెట్లోకి తెస్తోంది. ఎక్స్టీరియర్, ఇంటీరియర్ పరంగా నిసాన్ తనదైన ప్రత్యేక శైలిని కలిగి ఉంటుంది. మొత్తానికి ఈ రెండు కంపెనీలు కలిసి కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నాయి.




