Bajaj Pulsar 150: కొత్త అవతార్‌లో రాబోతున్న బజాజ్ పల్సర్ 150.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్

Bajaj Pulsar 150: బజాజ్ సంస్థ తమ పాపులర్ బైక్ పల్సర్ 150ను కొత్త అవతార్‌లో విడుదల చేయడానికి సిద్ధమైంది.

CR Reddy
Published on: 11 Aug 2026 8:21 AM IST
Bajaj Pulsar 150
X

Bajaj Pulsar 150

Bajaj Pulsar 150: భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ పల్సర్ 150 బైక్ త్వరలోనే సరికొత్త రూపంలో కస్టమర్ల ముందుకు రాబోతోంది. అధికారికంగా లాంచ్ కావడానికి ముందే ఈ కొత్త బైక్ ఇప్పటికే కొన్ని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లకు చేరుకుంది. దీనిని బట్టి ఈ బైక్ ఆవిష్కరణకు ఎంతో సమయం లేదని స్పష్టమవుతోంది. ఐకానిక్ పల్సర్ పాత లుక్‌ని దెబ్బతీయకుండానే, నేటితరం యువతను ఆకట్టుకునేలా మరింత మోడరన్, స్టైలిష్ మార్పులతో దీనిని రూపొందించారు.

సరికొత్త ఎల్‌ఈడీ లైటింగ్, డిజైన్

నూతన పల్సర్ 150 డిజైన్‌లో ప్రధాన మార్పు దాని లైటింగ్ విభాగంలో కనిపిస్తుంది. ఈ బైక్‌లో సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌తో పాటు ఆకర్షణీయమైన వెనుక టెయిల్ లైట్‌ను అమర్చారు. అయితే టర్న్ ఇండికేటర్లు మాత్రం యథావిధిగా హాలోజెన్ లైట్లతోనే రానున్నాయి. వీటితో పాటు కొత్త బాడీ గ్రాఫిక్స్, నూతన ఎగ్జాస్ట్ డిజైన్ బైక్‌కు స్పోర్టీ లుక్‌ని ఇస్తున్నాయి.

కలర్ ఎల్‌సీడీ స్క్రీన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు

సాంకేతికంగా ఈ బైక్‌లో అనేక ఆధునిక హంగులు జోడించారు. పాత డిజిటల్ మీటర్ స్థానంలో సరికొత్త కలర్ ఎల్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు టర్న్-బై-టర్న్ నెవిగేషన్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల బైక్ నడిపే సమయంలో రైడర్లు సులభంగా రూట్ మ్యాప్‌ను డిస్‌ప్లేపై చూసుకోవచ్చు. వీటితో పాటు విభిన్న వాతావరణ, రహదారి పరిస్థితులకు అనుగుణంగా సేఫ్టీ కోసం రోడ్, రైన్ అనే రెండు ఏబీఎస్ మోడ్‌లు లభించనున్నాయి.

ఇంజిన్, ఛాసిస్, లాంచ్ వివరాలు

కొత్త పల్సర్ 150 బైక్‌లో పవర్ ఫుల్ 150cc ఇంజిన్‌నే కొనసాగిస్తున్నారు. అయితే ఇంజిన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో కొత్తగా ఆయిల్ కూలింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజిన్ సుమారు 14bhp పవర్, 14Nm టాప్‌ని ఉత్పత్తి చేయగలదు. అలాగే 5-స్పీడ్ గేర్‌బాక్స్ కొనసాగుతుంది. ఛాసిస్, సస్పెన్షన్లలో కూడా మార్పులు చేసి ముందుభాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ అందించారు. బ్రేకింగ్ కోసం ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. రాబోయే ప్రీమియం వేరియంట్లలో స్ప్లిట్ సీట్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు కూడా ఇచ్చే అవకాశముంది. ఈ బైక్ ఆగస్టు 12న జరిగే కంపెనీ అధికారిక ఈవెంట్‌లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story