ఇక అమెజాన్‌లో కార్లు కూడా కొనొచ్చు.. అమెజాన్ ఆటోస్ పేరుతో కొత్త సేవ
Amazon Autos: ఆన్‌లైన్ షాపింగ్‌కు పేరుగాంచిన అమెజాన్ ఇకపై కార్ల విక్రయ రంగంలోకి కూడా అడుగుపెడుతోంది. బ్రిటన్‌లో 2027 ప్రారంభంలో ‘Amazon Autos’ పేరుతో కొత్త సేవను ప్రారంభించనుంది.
ఇక అమెజాన్‌లో కార్లు కూడా కొనొచ్చు.. అమెజాన్ ఆటోస్ పేరుతో కొత్త సేవ
Amazon Autos: ఆన్‌లైన్ షాపింగ్‌కు పేరుగాంచిన అమెజాన్ ఇకపై కార్ల విక్రయ రంగంలోకి కూడా అడుగుపెడుతోంది. బ్రిటన్‌లో 2027 ప్రారంభంలో ‘Amazon Autos’ పేరుతో కొత్త సేవను ప్రారంభించనుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు వివిధ కంపెనీల కొత్త, పాత కార్ల మోడళ్లను చూడటంతో పాటు నచ్చిన కారును రిజర్వ్ చేసుకోవచ్చు.
హ్యుందాయ్ కార్లతో ప్రారంభం.. కొత్త, పాత కార్లు అందుబాటులోకి
అమెజాన్ ప్రారంభించనున్న ఈ సేవలో తొలుత హ్యుందాయ్ కార్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పెట్రోల్ కార్లను కొనుగోలుదారులు పరిశీలించవచ్చు. ప్రారంభంలో హ్యుందాయ్‌కు చెందిన IONIQ 3, IONIQ 5, KONA, i20 మోడళ్లను అమెజాన్‌లో లిస్ట్ చేయనున్నారు. వీటితో పాటు Vertu Motors అనే డీలర్ గ్రూప్‌నకు చెందిన పాత కార్లు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటాయి. రాబోయే నెలల్లో మరిన్ని కార్ల కంపెనీలు, డీలర్‌షిప్ సంస్థలను భాగస్వాములుగా చేర్చుకోనున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
అమెజాన్‌లోనే కార్ల మోడళ్లు, ధరలు చూసుకోవచ్చు
Amazon Autos సేవ ప్రారంభమైన తర్వాత వినియోగదారులు Amazon.co.uk వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమకు నచ్చిన కార్ల వివరాలు తెలుసుకోవచ్చు. వివిధ మోడళ్లను, వాటి ధరలను పోల్చి చూసుకోవచ్చు. నచ్చిన కారును ఎంపిక చేసుకుని రిజర్వ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీంతో కారు కొనుగోలు చేయాలనుకునేవారు షోరూమ్‌ల చుట్టూ తిరగకుండానే ముందుగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరలు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.
పాత కారు విలువ, కొత్త కారు ఫైనాన్స్ వివరాలు కూడా
ఈ ప్లాట్‌ఫామ్‌లో మరికొన్ని ప్రత్యేక సదుపాయాలను కూడా అమెజాన్ అందించనుంది. వినియోగదారులు తమ వద్ద ఉన్న పాత కారు విలువ ఎంత ఉండవచ్చో అంచనా వేసుకోవచ్చు. కొత్త కారు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్న ఫైనాన్స్ అవకాశాలను కూడా పరిశీలించవచ్చు. అయితే, అమెజాన్‌లోనే కారు కొనుగోలు ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని భావించకూడదు. ఆన్‌లైన్‌లో కారును ఎంపిక చేసుకుని రిజర్వ్ చేసుకున్న తర్వాత, తుది కొనుగోలు ప్రక్రియను సంబంధిత డీలర్‌షిప్ వద్ద పూర్తి చేయాలి. అలాగే కార్ల ధరలను అమెజాన్ నిర్ణయించదు. వాటిని సంబంధిత డీలర్లే నిర్ణయిస్తారు.
2024లో అమెరికాలో ప్రారంభం.. ఇప్పుడు బ్రిటన్‌కు విస్తరణ
అమెజాన్ తొలిసారిగా 2024 డిసెంబర్‌లో అమెరికాలో Amazon Autos సేవను ప్రారంభించింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సేవ ఇప్పటికే అమెరికాలోని 150కి పైగా నగరాలకు విస్తరించింది. ఇప్పుడు 2027 ప్రారంభంలో బ్రిటన్‌లోనూ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. Amazon Autos International డైరెక్టర్ మెట్ నఫోర్ట్ మాట్లాడుతూ.. కారు కొనుగోలు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తెలిపారు. అమెజాన్‌లో ఇతర వస్తువులను కొనుగోలు చేసినంత సులభంగా, పారదర్శకంగా కార్ల కొనుగోలు అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సేవ విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉంది.




