Aprilia: ఆఫీస్‌కి వెళ్లొచ్చు.. ఆపై లాంగ్ డ్రైవ్ వెళ్లొచ్చు.. ఆల్‌రౌండర్ స్కూటర్ ఇది

Aprilia: అప్రిలియా ఇండియా భారత మార్కెట్లో SXR GT 125 hp-e, SXR GT 175 hp-e మ్యాక్సీ స్కూటర్లను విడుదల చేసింది.

CR Reddy
Published on: 6 Oct 2026 10:39 AM IST
Aprilia SXR GT 125
X

Aprilia SXR GT 125

Aprilia: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అప్రిలియా ఇండియా తన నూతన మ్యాక్సీ-స్కూటర్ శ్రేణిని భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ తన SXR GT సిరీస్ కింద SXR GT 125 hp-e, SXR GT 175 hp-e పేరుతో రెండు అద్భుతమైన మోడళ్లను లాంచ్ చేసింది. ఈ కొత్త స్కూటర్లు అట్రాక్టివ్ లుక్స్, వేగం, రైడింగ్ కంఫర్ట్‌ల కలయికగా రూపుదిద్దుకున్నాయి. ఆఫీసు ప్రయాణాలతో పాటు వీకెండ్‌లో లాంగ్ రైడ్స్ వెళ్లడానికి కూడా ఇవి అనుకూలంగా ఉంటాయి.

పాకెట్ ఫ్రెండ్లీ ధరలు, ఆకట్టుకునే కలర్స్

ధరల విషయానికి వస్తే కంపెనీ వీటికి సరసమైన బడ్జెట్‌నే నిర్ణయించింది. అప్రిలియా SXR GT 125 hp-e ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1,09,999గా నిర్ణయించారు. ఈ స్కూటర్ మ్యాట్ బ్లాక్, గ్లాసీ అజూర్, గ్లాసీ వైట్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. ఇక పవర్ ఫుల్ SXR GT 175 hp-e ఎక్స్-షోరూమ్ ధర రూ.1,29,999గా ఉంది. ఇందులో మెటాలిక్ బ్లూ, మ్యాట్ బ్లాక్, మ్యాట్ గ్రీన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

బటన్ నొక్కితే చాలు

పర్ఫార్మెన్స్ పరంగా ఈ రెండు స్కూటర్లు చాలా బలంగా ఉన్నాయి. 175cc వేరియంట్‌లో ఈ సెగ్మెంట్‌లోనే అతిపెద్ద, పవర్‌ఫుల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 9.76 kW పవర్, 14.14 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 125cc మోడల్ 7.8 kW పవర్, 10.4 Nm టార్క్‌ను అందిస్తుంది. ట్రాఫిక్‌లో తేలిగ్గా దూసుకెళ్లడానికి, హైవేలపై వేగంగా ప్రయాణించడానికి ఈ ఇంజిన్లు తోడ్పడతాయి.

14 అంగుళాల పెద్ద వీల్స్

ప్రయాణాన్ని మరింత సుఖవంతంగా మార్చడానికి ఈ విభాగంలో తొలిసారిగా 14 అంగుళాల పెద్ద వీల్స్‌‌ను అమర్చారు. పెద్ద టైర్ల వల్ల రోడ్లపై ఉండే గుంతలు, రోడ్ల ఎత్తుపల్లాల ప్రభావం రైడర్‌పై పడకుండా వాహనం అదుపులో ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌‌లో సాఫీగా సాగిపోవడానికే కాకుండా లాంగ్ రోడ్ ట్రిప్‌లకు వెళ్లినప్పుడు కూడా శరీరం అలసిపోకుండా సాఫీగా ప్రయాణించవచ్చు.

E20 పెట్రోల్ సపోర్ట్

ఈ స్కూటర్లను సరికొత్త బిఎస్-6 ఓబిడి-II స్టేజ్ బి నిబంధనలకు అనుగుణంగా తయారు చేశారు. ఇవి E20 పెట్రోల్ (ఇథనాల్ కలిపిన పెట్రోల్) తోనూ ఎంతో సులభంగా నడుస్తాయి. దీనివల్ల బైక్ నుంచి పొగ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, పెట్రోల్ ఆదా అయి మైలేజ్ విషయంలోనూ కస్టమర్ల జేబుకు భారం కాకుండా ఉంటుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.