Ather Energy: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ. 20వేల డిస్కౌంట్.. ఫుల్ ఛార్జ్ తో 159 కిమీల టెన్షన్ ఫ్రీ రైడ్..
Ather Electric Scooter Discount : ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలని చూస్తున్న వారికి అద్బుతమైన ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. Ather Energy కంపెనీ మార్చి 2026 కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. Ather Rizta, 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై మొత్తం రూ.20,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Ather Energy: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ. 20వేల డిస్కౌంట్.. ఫుల్ ఛార్జ్ తో 159 కిమీల టెన్షన్ ఫ్రీ రైడ్..
Ather Energy: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన ప్రముఖ స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కంపెనీ Ather Rizta, Ather 450 Series మోడళ్లపై పరిమిత కాలానికి ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు మొత్తం రూ.20,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఈ ఆఫర్ మార్చి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పీఎం ఈ డ్రైవ్ (PM E-Drive) సబ్సిడీ కూడా ముగియనున్న నేపథ్యంలో ఈ ఆఫర్ వినియోగదారులకు మంచి అవకాశం అని కంపెనీ చెబుతోంది.
డిస్కౌంట్ ఎలా లభిస్తుంది?
ఈ ఆఫర్‌లో మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
భాగస్వామ్య బ్యాంకుల క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.10,000 డిస్కౌంట్
కంపెనీ నుంచి నేరుగా రూ.6,500 క్యాష్ బెనిఫిట్
రూ.3,500 విలువైన ఎక్స్‌టెండెడ్ కంపోనెంట్ వారంటీ
ఈ మూడు ప్రయోజనాలతో మొత్తం రూ.20,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
స్కూటర్ల కొత్త ధరలు...
Ather Rizta S ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1,04,758గా ఉంది.
ఇక Ather 450S మోడల్ ధర రూ.1,13,100గా నిర్ణయించారు. అదనంగా వినియోగదారులు పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద మరో రూ.5,000 వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది.
Ather Rizta – ఫ్యామిలీ స్కూటర్..
Ather Rizta ప్రత్యేకంగా కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్.
ఇందులో 2.9 kWh, 3.7 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. వీటితో వరుసగా 123 కిమీల, 159 కిమీల వరకు జర్నీ చేయోచ్చు.
34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, అదనపు ఫ్రంక్ స్పేస్ ఉండటం కుటుంబ వినియోగానికి ఎంతో ఉపయోగకరం. స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిమీ వరకు ఉంటుంది.
450 సిరీస్ – లేటెస్ట్ టెక్నాలజీ కోరుకునేవారికి..
Ather 450 Series ప్రధానంగా పనితీరు, టెక్నాలజీని కోరుకునే వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.
ఈ స్కూటర్‌లో శక్తివంతమైన మోటార్ ఉండటం వల్ల వేగవంతమైన యాక్సిలరేషన్ లభిస్తుంది. గరిష్ట వేగం గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్, కనెక్టెడ్ టెక్నాలజీ, మల్టీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు దీన్ని ప్రీమియం స్కూటర్‌గా మార్చేశాయి.




