ఫుల్ ఛార్జ్ తో 627 కిమీల మైలేజీ.. ఎంట్రీ ఇవ్వబోతున్న 2 పవర్‌ఫుల్ కార్లు.. మార్కెట్లో నయా సంచలనం
Upcoming SUVs in India 2026: భారతీయ రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాల హవాను మరింత పెంచేందుకు టాటా మోటార్స్ రంగంలోకి దిగింది. తమ ప్రతిష్టాత్మక మోడల్ టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV)ని జూన్ 20న లాంచ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఫుల్ ఛార్జ్ తో 627 కిమీల మైలేజీ.. ఎంట్రీ ఇవ్వబోతున్న 2 పవర్‌ఫుల్ కార్లు.. మార్కెట్లో నయా సంచలనం
Electric Vehicles India: భారతీయ ఆటోమొబైల్ రంగంలో మరో సరికొత్త విప్లవం రాబోతోంది. కస్టమర్లు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రెండు సరికొత్త కార్లు మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాయి. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్, అంతర్జాతీయ బ్రాండ్ నిస్సాన్ సంస్థలు అదిరిపోయే ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజన్ సామర్థ్యంతో తమ సరికొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సర్వం సిద్ధం చేశాయి.
ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో సరికొత్త సంచలనం 'టాటా సియెర్రా ఈవీ'..
భారతీయ రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాల హవాను మరింత పెంచేందుకు టాటా మోటార్స్ రంగంలోకి దిగింది. తమ ప్రతిష్టాత్మక మోడల్ టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV)ని జూన్ 20న లాంచ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సరికొత్త కారు కంపెనీ లైనప్‌లో కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ మోడళ్లకు మధ్యలో నిలవనుంది. పాత క్లాసిక్ సియెర్రా లుక్‌ను గుర్తుచేసేలా దీని డిజైన్ ఉన్నప్పటికీ, నేటి తరం వినియోగదారులను ఆకట్టుకునేలా ఎన్నో ఆధునిక మార్పులు చేశారు.
ఈ కారు ముందు భాగంలో బాడీ కలర్ క్లోజ్డ్ గ్రిల్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, బంపర్‌కు ఇరువైపులా రెక్టాంగులర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లను అమర్చారు. సైడ్ ప్రొఫైల్‌లో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, స్క్వేర్ వీల్ ఆర్చెస్, 19-ఇంచుల ఏరోడైనమిక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఈ కారుకు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
627 కిలోమీటర్ల భారీ రేంజ్.. పవర్‌ఫుల్ బ్యాటరీ
సాంకేతిక పరంగా చూస్తే, టాటా సియెర్రా ఈవీ సరికొత్త ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందింది. లీకైన సమాచారం ప్రకారం.. ఈ కారు 65 kWh, 75 kWh అనే రెండు పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రానుంది. దీని రేర్-వీల్-డ్రైవ్ వేరియంట్ 238 PS పవర్, 315 Nm టార్క్ ఇస్తుంది. అలాగే డ్యూయల్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్‌లో అదనంగా ముందు భాగంలో 158 PS పవర్ ఇచ్చే మోటార్ ఉంటుంది. రేంజ్ విషయానికి వస్తే, 65 kWh బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై 538 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, పెద్దదైన 75 kWh బ్యాటరీ ప్యాక్ ఏకంగా 627 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడం విశేషం. మార్కెట్లో దీని ధర రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
నిస్సాన్ టెక్టాన్.. సరికొత్త 'బేబీ పెట్రోల్'
మరోవైపు, ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ సైతం భారత మార్కెట్లో తన పట్టును నిలుపుకోవడానికి సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'నిస్సాన్ టెక్టాన్'ను జూలై 9న అంతర్జాతీయ మార్కెట్లో గ్లోబల్ డెబ్యూ చేయబోతోంది. నిస్సాన్ కంపెనీ ఐకానిక్ 'పెట్రోల్' ఎస్‌యూవీ డిజైన్ ఆధారంగా దీనిని రూపొందించడం వల్ల కంపెనీ దీనిని ముద్దుగా 'బేబీ పెట్రోల్' అని పిలుస్తోంది. దీని ఫ్రంట్ లుక్‌లో హారిజాంటల్ స్లాట్స్ ఉన్న పెద్ద గ్రిల్, దానిపై ఎరుపు రంగు స్ట్రిప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బోనెట్‌పై పెద్ద అక్షరాలతో 'TEKTON' అని రాసి ఉంటుంది. వెనుక భాగంలో కనెక్టెడ్ సి-షేప్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ దీనికి మరింత రగ్గడ్ స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి.
ప్రీమియం ఇంటీరియర్స్, అధునాతన సేఫ్టీ ఫీచర్లు..
నిస్సాన్ టెక్టాన్ కారు లోపలి భాగం ఎంతో లగ్జరీగా ఉండబోతోంది. ఇందులో 10.1-ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్-బిల్ట్ గూగుల్ మ్యాప్స్ సపోర్ట్, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన వసతులు కల్పించారు. భద్రతకు పెద్దపీట వేస్తూ ఇందులో కస్టమర్ల మోస్ట్ ఫేవరెట్ అడాస్ (ADAS) టెక్నాలజీతో పాటు 360-డిగ్రీ కెమెరాను కూడా జోడించారు. ఈ కారు బేస్ వేరియంట్ ప్రారంభ ధర దాదాపు రూ.11 లక్షల బడ్జెట్ లోనే ఉండే అవకాశం ఉంది.
ఆటోమొబైల్ రంగంలో రాబోయే రెండు వారాలు ఎంతో ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. అటు పర్యావరణహితమైన లాంగ్ రేంజ్ బ్యాటరీతో వస్తున్న టాటా సియెర్రా ఈవీ, ఇటు లగ్జరీ, రగ్గడ్ లుక్స్‌తో మెప్పించబోతున్న నిస్సాన్ టెక్టాన్.. ఈ రెండు మోడళ్లు ఖచ్చితంగా భారతీయ కార్ల మార్కెట్లో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.




