Automatic Cars : 25.75 కి.మీ మైలేజ్, సన్‌రూఫ్, అద్దిరిపోయే ఫీచర్లు.. రూ.10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

Automatic Cars : రూ.10 లక్షల బడ్జెట్‌లో మారుతీ స్విఫ్ట్ ఎఎమ్‌టీ, టాటా పంచ్ ఎఎమ్‌టీ, హోండా అమేజ్ సివిటీలు బెస్ట్ ఆటోమేటిక్ కార్లుగా నిలిచాయి. స్విఫ్ట్ లీటరుకు గరిష్టంగా 25.75 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

CR Reddy
Published on: 2 Aug 2026 8:20 AM IST
Automatic Cars
X

Automatic Cars

Automatic Cars : ప్రస్తుత బిజీ లైఫ్‌లో ముఖ్యంగా నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా గేర్లు మారుస్తూ క్లచ్ తొక్కడం వాహనదారులకు పెద్ద నరకంగా మారింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఆటోమేటిక్ కార్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ మీ బడ్జెట్ రూ. 10 లక్షల కంటే తక్కువగా ఉండి, మంచి ఆటోమేటిక్ కార్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మార్కెట్‌లో అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైలేజ్, సేఫ్టీ, డ్రైవింగ్ కంఫర్ట్ ఆధారంగా మారుతీ స్విఫ్ట్ ఏఎంటీ, టాటా పంచ్ ఏఎంటీ, హోండా అమేజ్ సివిటీ కార్లు టాప్ రేసులో నిలిచాయి.

మారుతీ స్విఫ్ట్ ఏఎంటీ

మారుతీ స్విఫ్ట్ ఆటోమేటిక్ (AGS) వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.03 లక్షలుగా ఉంది. కొత్త స్విఫ్ట్ మునుపటి కంటే చాలా స్పోర్టీ లుక్‌లో డిజైన్ చేయబడింది. ఇందులో కొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లు, స్టైలిష్ టెయిల్ లైట్లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో ఆల్-బ్లాక్ థీమ్, ప్రీమియం డాష్‌బోర్డ్‌తో పాటు సీట్ల క్వాలిటీ అద్భుతంగా ఉంది. దీనిలో 1.2 లీటర్, 3-సిలిండర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 80.46 bhp పవర్, 111.7 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 9-ఇంచ్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD వంటి ఫీచర్లు ఉంటాయి. ఆటోమేటిక్ వేరియంట్‌లో లీటరుకు ఏకంగా 25.75 కి.మీ మైలేజ్ ఇస్తుంది. తక్కువ నిర్వహణ ఖర్చు, అత్యధిక మైలేజ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

టాటా పంచ్ ఏఎంటీ

టాటా పంచ్ ఆటోమేటిక్ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.65 లక్షలుగా ఉంది. మైక్రో ఎస్‌యూవీగా గుర్తింపు పొందిన ఈ కార్ మస్క్యులర్ డిజైన్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. దీని డోర్లు 90 డిగ్రీల వరకు తెరుచుకోవడంతో కార్ లోపలికి ఎక్కడం, దిగడం చాలా సులభంగా ఉంటుంది. దీనిలో 1.2 లీటర్ రేవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 87 bhp పవర్, 115 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 10.25-ఇంచ్ పెద్ద టచ్‌స్క్రీన్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు వస్తాయి. జిఎన్సిఎపి నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇది లీటరుకు 20.09 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దృఢమైన బాడీ, సన్‌రూఫ్, ఎస్‌యూవీ ఫీల్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

హోండా అమేజ్ సివిటీ

హోండా అమేజ్ సివిటీ ఆటోమేటిక్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.65 లక్షలుగా ఉంది. ఇది ఒక ప్రీమియం కాంపాక్ట్ సెడాన్. క్రోమ్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌లాంప్‌లతో చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. డ్యూయల్ టోన్ ఇంటీరియర్, వెనుక కూర్చునే వారికి ఎక్కువ లెగ్‌రూమ్, 420 లీటర్ల భారీ బూట్ స్పేస్ దీని ప్రత్యేకతలు. దీనిలో 1.2 లీటర్, 4-సిలిండర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 89 bhp పవర్, 110 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని సివిటీ (CVT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. గేర్లు మారే సమయంలో ఎలాంటి జెర్కులు (జెర్క్ ఫ్రీ డ్రైవింగ్) అనిపించవు. ప్యాడల్ షిఫ్టర్లు, టచ్‌స్క్రీన్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX మౌంట్స్ ఫీచర్లు వస్తాయి. ఇది లీటరుకు 19.46 కి.మీ మైలేజ్ ఇస్తుంది. కంఫర్టబుల్ రైడ్, సెడాన్ లుక్ ఇష్టపడే వారికి అమేజ్ బెస్ట్ ఆప్షన్.

మీకు ఏ కార్ సరిపోతుంది?

మీ ప్రాధాన్యత అత్యధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు అయితే మారుతీ స్విఫ్ట్ ఏఎంటీఎంచుకోవచ్చు. బలమైన బాడీ, సేఫ్టీ, సన్‌రూఫ్, ఎస్‌యూవీ అనుభవం కావాలంటే టాటా పంచ్ ఏఎంటీసరైనది. అలా కాకుండా లాంగ్ రైడ్స్, స్మూత్ ఆటోమేటిక్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, ఎక్కువ బూట్ స్పేస్ కావలసి వస్తే హోండా అమేజ్ సివిటీ అద్భుతమైన ఎంపిక అవుతుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story