Best Scooters: డైలీ ఆఫీస్ వెళ్లేవారికి పర్ఫెక్ట్ ఛాయిస్.. మార్కెట్లో టాప్ 5 స్కూటర్లు ఇవే

Best Scooters: రోజూ ఆఫీస్‌కు వెళ్లేందుకు సౌకర్యవంతమైన, మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్ కోసం చూస్తున్నారా?

CR Reddy
Published on: 22 Sept 2026 10:51 AM IST
best office scooters
X

best office scooters

Best Scooters: రోజూ ఆఫీస్‌కు వెళ్లేందుకు సౌకర్యవంతమైన, మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్ కోసం చూస్తున్నారా? పెరుగుతున్న పెట్రోల్ ధరలు, నగర ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని సరైన టూ-వీలర్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. తక్కువ ధర, మంచి మైలేజ్, సౌకర్యవంతమైన రైడింగ్‌తో పాటు స్టైలిష్ లుక్ కోరుకునే ఉద్యోగుల కోసం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్కూటర్ ఆప్షన్లు ఇవే.

1.హోండా యాక్టివా

భారతీయ రోడ్లపై ఆఫీసుకు వెళ్లేవారి మొదటి ఎంపిక ఎప్పుడూ హోండా యాక్టివానే ఉంటుంది. దీని సింపుల్ డిజైన్, నగరంలోని భారీ ట్రాఫిక్‌లో దీన్ని సులభంగా కంట్రోల్ చేసే వీలుండటం దీనికి ప్రధాన కారణం. 110 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ స్కూటర్ అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.77 వేల వరకు ఉంటుంది. లీటరు పెట్రోల్‌కు దాదాపు 59 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. నగరంలో రోజూ తిరిగే వారికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది.

2. టీవీఎస్ జూపిటర్

ప్రయాణంలో ఎక్కువ సౌకర్యం కోరుకునేవారికి టీవీఎస్ జూపిటర్ అద్భుతమైన ఆప్షన్. జూపిటర్ 125 మోడల్‌లో ఏకంగా 33 లీటర్ల భారీ అండర్-సీట్ స్టోరేజ్ ఇవ్వడం విశేషం. ఈ పెద్ద స్పేస్‌లో ఆఫీస్ బ్యాగ్, హెర్మెట్ లేదా రోజూవారీగా కావలసిన సరుకులు చాలా సులభంగా సర్దుకోవచ్చు. దీనిలోని అడ్వాన్స్డ్ సస్పెన్షన్ సిస్టమ్ గుంతలు ఉన్న రోడ్లపై కూడా ఎలాంటి జర్కులు తగలకుండా సాఫీగా ప్రయాణించేలా చేస్తుంది. కుటుంబంతో పాటు ఆఫీస్ పనులకు కూడా ఇది చక్కగా సరిపోతుంది.

3. సుజుకీ యాక్సెస్ 125

కేవలం ఆఫీస్‌కే కాకుండా వీకెండ్స్‌లో లాంగ్ రైడ్స్ వెళ్లడం ఇష్టపడేవారి కోసం సుజుకీ యాక్సెస్ 125 సరైన ఎంపిక. ఇందులో శక్తివంతమైన 124 సీసీ ఇంజిన్ ఉంటుంది, ఇది డైలీ రన్నింగ్‌కు అద్భుతమైన పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. మార్కెట్ నివేదికల ప్రకారం ఈ స్కూటర్ ప్రారంభ ధర సుమారు రూ.83 వేల నుంచి 86 వేల మధ్య ఉంది. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల్లో చిన్నపాటి మార్పులు ఉండవచ్చు, కానీ దీని పనితీరు మాత్రం ఎప్పుడూ నెంబర్ వన్‌గా ఉంటుంది.

4. యామహా రేజెడ్‌ఆర్

చాలా తేలికగా ఉండే, స్పోర్టీ డిజైన్ ఇష్టపడే యువతకు యామహా రేజెడ్‌ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ మంచి ఛాయిస్ అవుతుంది. దీని తక్కువ బరువు కారణంగా సిటీ ట్రాఫిక్‌లో స్కూటర్‌ను తిప్పడం లేదా ముందుకు పోనివ్వడం చాలా సులభం అవుతుంది. 125 సీసీ ఇంజిన్‌తో వస్తున్న ఈ స్కూటర్ ధర దాదాపు రూ.82 వేల వరకు ఉంటుంది. రోజువారీ ప్రయాణానికి సరిపడా అద్భుతమైన మైలేజ్ ఇస్తూనే, స్టైలిష్ లుక్‌ను కూడా కోరుకునేవారికి ఇది చక్కగా సరిపోతుంది.

5. ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఇప్పటి కాలంలో పెట్రోల్ ఖర్చును పూర్తిగా ఆదా చేసుకోవాలనుకునేవారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. మీ ఇల్లు లేదా ఆఫీస్‌లో ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యం ఉంటే ఈవీ స్కూటర్లను ఎంచుకోవడం చాలా లాభదాయకం. రోజూ పరిమిత దూరం ప్రయాణించే ఉద్యోగులు పెట్రోల్ బాదరబంది లేకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కొనుగోలు చేసే ముందే మీ రోజువారీ ప్రయాణ దూరాన్ని బట్టి సరైన బ్యాటరీ రేంజ్ ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం మంచిది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.