Budget vs Premium: బడ్జెట్ vs ప్రీమియం.. కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే ఏమొస్తుందో తెలుసా..?
Budget vs Premium Evs: మన దేశంలో రూ. 10 నుంచి రూ. 15 లక్షల లోపు బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కార్లకు కొదవే లేదు. టాటా మోటార్స్ నుంచి వస్తున్న టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెగ్సాన్ ఈవీ వంటి కార్లు సామాన్యులకు బాగా చేరువయ్యాయి.
Budget vs Premium: బడ్జెట్ vs ప్రీమియం.. కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే ఏమొస్తుందో తెలుసా..?
Budget vs Premium Evs: ఎలక్ట్రిక్ కారు కొనేటప్పుడు తక్కువ బడ్జెట్ లోనే సరిపెట్టుకోవాలా? కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే ప్రీమియం వైపు వెళ్లాలా? ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. తక్కువ బడ్జెట్ మోడళ్లు రోజువారీ ప్రయాణాలకు సరిపోయినా, ప్రీమియం కార్లు ఇచ్చే డ్రైవింగ్ అనుభూతి, భద్రత, రేంజ్ ముందు ఇవి తేలిపోతున్నాయి. అసలు ఈ రెంటి మధ్య తేడా ఏమిటో చూద్దాం.
బడ్జెట్ ఈవీ ప్రపంచం: నగర ప్రయాణాలకు ఓకే..
మన దేశంలో రూ. 10 నుంచి రూ. 15 లక్షల లోపు బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కార్లకు కొదవే లేదు. టాటా మోటార్స్ నుంచి వస్తున్న టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెగ్సాన్ ఈవీ వంటి కార్లు సామాన్యులకు బాగా చేరువయ్యాయి. టియాగో ఈవీ కేవలం రూ. 4.69 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. పంచ్ ఈవీ, నెగ్సాన్ ఈవీలు కూడా బడ్జెట్ ధరల్లోనే లభిస్తున్నాయి. ఎంజీ నుంచి వస్తున్న కామెట్ ఈవీ, విండ్సర్ ఈవీలు కూడా తక్కువ ఖర్చుతో సిటీలో తిరగడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి ఆఫీసుకి వెళ్లడానికి, ఇంటి పనులకు చక్కగా సరిపోతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడే అసలు చిక్కు వస్తుంది.
రేంజ్ టెన్షన్ కి బైబై..
హైవే మీద ప్రయాణం చేసేటప్పుడు ఛార్జింగ్ స్టేషన్ల కోసం వెతుక్కోవడం పెద్ద తలనొప్పి. మహీంద్రా బీఈ 6 (రూ. 18.90 - 26.90 లక్షలు), ఎక్స్ఈవీ 9ఈ (రూ. 21.90 - 30.50 లక్షలు), ఏడు సీట్ల ఎక్స్ఈవీ 9ఎస్ (రూ. 20.65 - 30.70 లక్షలు) వంటి ప్రీమియం కార్లలో ఆ బాధ ఉండదు. వీటిలో ఇచ్చే 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 682 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. రియల్ వరల్డ్ రోడ్లపై సులువుగా 450 నుంచి 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఊళ్లకు వెళ్లేవారికి ఈ అదనపు రేంజ్ కొండంత కొండంత అభయాన్ని ఇస్తుంది. తరచుగా ఛార్జింగ్ ప్లగ్ పెట్టే అవసరం కూడా తప్పుతుంది.
పెర్ఫార్మెన్స్, సేఫ్టీలో భారీ తేడా..
బడ్జెట్ కార్లు నెమ్మదిగా సాగిపోతాయి. ప్రీమియం కార్లు మాత్రం రేసు గుర్రాల్లా దూసుకెళ్తాయి. మహీంద్రా ప్రీమియం మోడళ్లు కేవలం 6.7 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. దాదాపు డబుల్ పవర్ అవుట్‌పుట్ వల్ల ఓవర్ టేకింగ్ చాలా ఈజీ అయిపోతుంది. సేఫ్టీ విషయంలోనూ భారీ వ్యత్యాసం ఉంది. 5 రాడార్లు, విజన్ బేస్డ్ లెవెల్ 2+ అడాస్ (ADAS) వ్యవస్థ రోడ్డుపై నడిచే మనుషులను, జంతువులను స్పష్టంగా గుర్తుపడుతుంది. డ్రైవర్ అలసటను గుర్తించే టెక్నాలజీ, ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, బలమైన బాడీ నిర్మాణం ప్రయాణికులకు పూర్తి రక్షణ కల్పిస్తాయి.
భవిష్యత్తు కోసం చేసే సరైన పెట్టుబడి..
లగ్జరీ ఫీచర్ల విషయానికొస్తే ప్రీమియం కార్లలో 43 అంగుళాలకు పైగా ఉన్న ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, 16 స్పీకర్ల హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెచ్‌యూడీ, మెమరీ సీట్లు, ఆటో పార్క్ అసిస్ట్ వంటి ఎన్నో హంగులు ఉన్నాయి. లోపల ఉండే విశాలమైన స్పేస్ కుటుంబంతో హాయిగా ప్రయాణించడానికి తోడ్పడుతుంది. ఎక్కువ దూరం ప్రయాణించేవారికి, లాంగ్ టర్మ్ ఉపయోగం కోరుకునేవారికి ప్రీమియం ఈవీ పై పెట్టే ప్రతి రూపాయి తగిన న్యాయం చేస్తుంది.
బడ్జెట్ ఈవీలు నగర పరిధిలో రోజువారీ వాడకానికి మాత్రమే సరిపోతాయి. హైవే డ్రైవింగ్, అధునాతన భద్రత, సూపర్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ కోరుకునేవారికి ప్రీమియం కార్లపై కొద్దిగా ఎక్కువ ఖర్చు చేయడం ఏమాత్రం వృధా కాదు. దీర్ఘకాలిక అవసరాలను ఆలోచిస్తే ప్రీమియం ఈవీ కొనుగోలు చేయడమే తెలివైన నిర్ణయం.




