ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లను హ్యాక్ చేయొచ్చా.? ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిక ఇదిగో
EV Safety Concerns: ఈ-రిక్షాలను యాప్‌ల ద్వారా స్విచ్ ఆఫ్ చేస్తున్న ఘటనలు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎలక్ట్రిక్ కార్లు, బైకులను కూడా హ్యాక్ చేయొచ్చా?
ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లను హ్యాక్ చేయొచ్చా.? ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిక ఇదిగో
EV Safety Concerns: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అయితే, సాంకేతికత పెరిగేకొద్దీ కొత్త ముప్పులు కూడా పొంచి ఉంటున్నాయి. ఈ-రిక్షాలను కొందరు సైబర్ నేరగాళ్లు యాప్‌ల ద్వారా సులభంగా స్విచ్ ఆఫ్ చేస్తున్న ఘటనలు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లు, బైకులను కూడా ఇలాగే హ్యాక్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన వాహనదారుల్లో తీవ్రంగా వ్యక్తమవుతోంది.
ఇక ఈ హ్యాకింగ్ భయాలు కేవలం ఊహాగానాలు కాదని స్పష్టమవుతోంది. ఉదాహరణకు, జర్మనీ దేశానికి చెందిన 'డేవిడ్' అనే ఒక హ్యాకర్ ఏకంగా 13 వేర్వేరు దేశాల్లో ఉన్న సుమారు 25 టెస్లా కార్ల రిమోట్ యాక్సెస్‌ను విజయవంతంగా సాధించాడని టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు. దీన్ని బట్టి ఎలక్ట్రిక్ వాహనాలపై సైబర్ దాడులు, హ్యాకింగ్ జరిగే అవకాశాలను మనం ఎంతమాత్రం కొట్టిపారేయలేమని ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు.
ముఖ్యంగా వెహికల్ సాఫ్ట్‌వేర్‌లో ఉండే చిన్నపాటి లోపాలను కూడా హ్యాకర్లు సులభంగా టార్గెట్ చేసుకుని కారు మొత్తాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునే తీవ్ర ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అందువల్ల, ఆటోమొబైల్ సంస్థలు ఈ ఎలక్ట్రిక్ వాహనాలను డెవలప్ చేసే ప్రాథమిక దశలోనే సైబర్ భద్రతపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని, పటిష్టమైన డిజిటల్ సెక్యూరిటీ ప్రమాణాలను పాటించాలని నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు. సరికొత్త టెక్నాలజీతో పాటు భద్రతా వ్యవస్థ కూడా అంతే బలంగా ఉంటేనే ఈవీల ప్రయాణం ప్రజలకు సురక్షితంగా ఉంటుంది.




