Car Maintenance Tips : మీ కారు లైఫ్ పెరగాలా?.. జేబుకు చిల్లు పడకుండా కాపాడే 5 సింపుల్ టిప్స్ ఇవే

Car Maintenance Tips : కారు మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గించుకోవడానికి, ఇంజన్ లైఫ్ పెంచడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు.. టైర్ ప్రెజర్, స్మూత్ డ్రైవింగ్, సమయానికి సర్వీసింగ్ చేయడం ద్వారా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

CR Reddy
Published on: 21 Jun 2026 12:01 PM IST
Car Maintenance Tips
X

Car Maintenance Tips 

Car Maintenance Tips : సొంత కారులో ఫ్యామిలీతో కలిసి లాంగ్ జర్నీలు చేయడం, రోజూ ఆఫీస్‌కు వెళ్లడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. కారు మన జీవితాన్ని చాలా కంఫర్టబుల్‌గా మారుస్తుంది.. కానీ అదే కారుకు నెలకు వేల రూపాయల మెయింటెనెన్స్ బిల్లు వస్తే మాత్రం గుండె గుభేల్ అంటుంది.. చాలామంది కారు పాతదైపోవడం వల్లో, లేదా సర్వీస్ సెంటర్ వాళ్లు ఎక్కువ ఛార్జ్ చేయడం వల్లో బిల్లు పెరుగుతుందని భావిస్తారు.. కానీ అసలు నిజం ఏంటంటే.. మనకున్న కొన్ని బ్యాడ్ హ్యాబి, నిర్లక్ష్యం వల్లే కారు త్వరగా పాడైపోతుంది.. కారు కొన్న మొదటి రోజు నుంచి కొన్ని చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే.. మైలేజ్ పెరగడంతో పాటు పెద్ద పెద్ద ఖర్చుల నుండి ఈజీగా తప్పించుకోవచ్చు.. మరి కారును ఎల్లప్పుడూ కొత్తదానిలా ఉంచే ఆ క్రేజీ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం.

కారు సర్వీసింగ్‌ను ఎప్పుడూ పోస్ట్‌పోన్ చేయకండి

కారు పర్ఫార్మెన్స్ ఎల్లప్పుడూ బాగుండాలి అంటే దానికి రెగ్యులర్ సర్వీసింగ్ చాలా అవసరం. చాలామంది కారులో ఏదైనా పెద్ద సమస్య వచ్చే వరకు లేదా కారు రోడ్డు మధ్యలో ఆగిపోయే వరకు సర్వీస్ సెంటర్‌కు వెళ్లరు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వేల రూపాయల భారీ బిల్లులు కట్టాల్సి వస్తుంది. కాబట్టి నిర్దేశిత సమయానికి ఇంజన్ ఆయిల్ మార్చడం, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయడం, ఇతర ముఖ్యమైన భాగాలను చెక్ చేయించడం వల్ల ఇంజన్ లైఫ్ పెరుగుతుంది.

టైర్ ప్రెజర్‌ను ఎప్పటికప్పుడు గమనించండి

కారు మైలేజ్,సేఫ్టీలో టైర్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. టైర్లలో గాలి తక్కువగా ఉన్నప్పుడు రోడ్డుపై ఘర్షణ పెరిగి, ఇంజన్‌పై అదనపు ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కారు మైలేజ్ దారుణంగా పడిపోవడమే కాకుండా.. టైర్లు చాలా త్వరగా అరిగిపోయి పాడవుతాయి. కాబట్టి ప్రతి వారం లేదా పది రోజులకు ఒకసారి కారు టైర్లలో ఎయిర్ ప్రెజర్‌ను కచ్చితంగా చెక్ చేయించుకోవడం అలవాటు చేసుకోవాలి.

స్మూత్ డ్రైవింగ్ అలవర్చుకోండి

రోడ్డు ఖాళీగా ఉందని ఒక్కసారిగా యాక్సిలరేటర్ తొక్కడం, సడన్ బ్రేకులు వేయడం, ట్రాఫిక్‌లో పదే పదే క్లచ్ నొక్కి పట్టుకోవడం వంటి అలవాట్లు కారు ప్రాణాలకే ప్రమాదం. ఇలా చేయడం వల్ల కారులోని క్లచ్ ప్లేట్లు, బ్రేక్ ప్యాడ్లు, సస్పెన్షన్ సిస్టమ్ చాలా త్వరగా పాడైపోతాయి. ఎప్పుడైనా సరే కారును బ్యాలెన్స్‌డ్‌గా, స్మూత్‌గా డ్రైవ్ చేయడం వల్ల కారు లైఫ్ పెరగడమే కాకుండా రిపేరింగ్ ఖర్చులు కూడా దాదాపు 80 శాతం వరకు తగ్గుతాయి.

డ్యాష్‌బోర్డ్ వార్నింగ్ సిగ్నల్స్ ను అస్సలు లైట్ తీసుకోవద్దు

కారు నడిపేటప్పుడు డ్యాష్‌బోర్డ్‌పై వచ్చే వార్నింగ్ లైట్లు (ఇంజన్ లైట్, ఆయిల్ లైట్ మొదలైనవి) కారులో ఏదో సమస్య ఉందనడానికి ముందస్తు సంకేతాలు. వీటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఇంజన్ సీజ్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే కారు నడిపేటప్పుడు ఇంజన్ నుంచి ఏవైనా వింత శబ్దాలు వచ్చినా, బ్రేక్ వేసినప్పుడు కిర్రుమనే సౌండ్ వచ్చినా వెంటనే అలర్ట్ అవ్వాలి. చిన్న చిన్న సమస్యలను ప్రారంభంలోనే గుర్తిస్తే పెద్ద ప్రమాదాల నుంచి, భారీ ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చు.

కారు లోపల, బయట శుభ్రత చాలా ముఖ్యం

కారును క్లీన్‌గా ఉంచుకోవడం అనేది కేవలం అందం కోసమే కాదు.. కారు భద్రతకు కూడా చాలా అవసరం. కారుపై పేరుకుపోయే దుమ్ము, ధూళి, మట్టి, తేమ వల్ల బాడీపై ఉన్న పెయింట్ పాడైపోవడమే కాకుండా లోపల లోహపు భాగాలు త్వరగా తుప్పు పట్టే అవకాశం ఉంది. కాబట్టి కాలానుగుణంగా కారును వాష్ చేయించడం, లోపల వ్యాక్యూమ్ క్లీనింగ్, బాడీ పాలిష్ చేయించడం వల్ల కారు ఎల్లప్పుడూ కొత్తదానిలా మెరిసిపోతూ ఉంటుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story