Car Safety : కారు కీపై ఫాయిల్ ఎందుకు చుడుతున్నారు.? ఈ టెక్నిక్ తెలిస్తే షాక్ అవుతారు.!
Car Safety : ప్రస్తుతం వస్తున్న లేటెస్ట్ కార్లలో కీలెస్ ఎంట్రీ (Keyless Entry) ఫీచర్ మన లైఫ్ ని చాలా ఈజీ చేసేసింది. కారు డోర్ ఓపెన్ చేయడానికి..
car-safety
Car Safety : ప్రస్తుతం వస్తున్న లేటెస్ట్ కార్లలో కీలెస్ ఎంట్రీ (Keyless Entry) ఫీచర్ మన లైఫ్ ని చాలా ఈజీ చేసేసింది. కారు డోర్ ఓపెన్ చేయడానికి , ఇంజిన్ స్టార్ట్ చేయడానికి పదే పదే తాళం చెవి తీయాల్సిన అవసరం లేదు. కీ మన పాకెట్‌లో , బ్యాగ్‌లో ఉంటే చాలు, కారు దానంతట అదే మనల్ని గుర్తించి అన్‌లాక్ అయిపోతుంది. అయితే ఇదే కంఫర్ట్ ఇప్పుడు కారు ఓనర్లకు కొత్త టెన్షన్ తీసుకువస్తోంది. అమెరికా , యూరప్ లాంటి దేశాల్లో దొంగలు ఈ టెక్నాలజీని వాడుకుని కార్లను ఈజీగా కొట్టేస్తున్నారు. అందుకే చాలా మంది తమ కారు కీస్‌ను అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి దాస్తున్నారు. ఇది వింతగా అనిపించినా దీని వెనుక ఒక పక్కా సైన్స్ ఉంది.
కీలెస్ ఎంట్రీ టెక్నాలజీ అసలు ఎలా పనిచేస్తుంది?
ఈ ఫీచర్ ఉన్న కార్లు నిరంతరం వైర్‌లెస్ రేడియో సిగ్నల్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. కారు కీ ఈ సిగ్నల్ పరిధిలోకి రాగానే రెండింటి మధ్య ఒక కమ్యూనికేషన్ జరిగి కారు ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది. అంటే మీరు ఫిజికల్ గా కీని లాక్‌లో పెట్టి తిప్పాల్సిన పని లేదు. కానీ సైబర్ నేరగాళ్లు ఈ వైర్‌లెస్ సిగ్నల్స్‌నే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీనికోసం వారు రిలే అటాక్ (Relay Attack) అనే ఒక డేంజరస్ పద్ధతిని వాడుతున్నారు.
ఏమిటీ 'రిలే అటాక్'? దొంగలు ఎలా స్కామ్ చేస్తున్నారు?
రిలే అటాక్‌లో దొంగలు రెండు ఎలక్ట్రానిక్ డివైజ్‌లను యూజ్ చేస్తారు. మీ కారు కీ ఇంట్లో ఎక్కడో టేబుల్ మీద ఉన్నా సరే, ఒక దొంగ మీ ఇంటి బయట ఉండి ఆ కీ ఇచ్చే సిగ్నల్‌ని తన దగ్గర ఉన్న డివైజ్‌తో క్యాచ్ చేస్తాడు. ఆ సిగ్నల్‌ని కారు దగ్గర ఉన్న మరో దొంగ డివైజ్‌కి ట్రాన్స్‌మిట్ చేస్తాడు. అసలు కీ తన దగ్గరే ఉందని భ్రమపడిన కారు వెంటనే అన్‌లాక్ అవుతుంది. ఇలా దొంగలు ఎలాంటి డ్యామేజ్ చేయకుండానే కేవలం నిమిషాల వ్యవధిలో కారుతో పారిపోతున్నారు. అసలు కీ మన ఇంట్లోనే ఉన్నా కారు చోరీకి గురవడం ఓనర్లను భయపెడుతోంది.
అల్యూమినియం ఫాయిల్ రక్షణ కవచంలా ఎలా మారుతోంది?
దొంగల నుండి కారును కాపాడుకోవడానికి ఈ మధ్య కాలంలో అల్యూమినియం ఫాయిల్ ఒక మంచి ‘హోమ్ రెమెడీ’లా మారింది. ఇది ఫారడే కేజ్ (Faraday Cage) అనే సైంటిఫిక్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. అల్యూమినియం లాంటి మెటల్స్‌కి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ బయటకు వెళ్లకుండా బ్లాక్ చేసే పవర్ ఉంటుంది. మీ కారు కీని పూర్తిగా అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టేస్తే, అది బయటకు ఇచ్చే వైర్‌లెస్ సిగ్నల్స్ నిలిచిపోతాయి. దీనివల్ల దొంగల దగ్గర ఉన్న డివైజ్‌లు మీ కీ సిగ్నల్‌ని అందుకోలేవు.
మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి
ఈ పద్ధతి వర్కౌట్ అవుతుందో లేదో మీరే సింపుల్‌గా చెక్ చేయవచ్చు. కారు కీని ఫాయిల్‌లో గట్టిగా చుట్టి కారు దగ్గరకు వెళ్లండి. కారు అన్‌లాక్ కాకపోతే ఆ కవచం పక్కాగా పనిచేస్తున్నట్లే లెక్క. ఒకవేళ ఫాయిల్ చుట్టడం ఇబ్బందిగా అనిపిస్తే, మార్కెట్‌లో ఫారడే బ్యాగ్స్ (Faraday Bags) కూడా దొరుకుతున్నాయి. కారు ఆపిన తర్వాత కీని అందులో వేస్తే చాలు, మీ కారు సిగ్నల్స్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉండదు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఖరీదైన కార్లను దొంగల బారి నుండి సేఫ్ గా ఉంచుకోవచ్చు.




