కారు అద్దం అంచున ఉండే ఆ నల్లటి చుక్కలేంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే..!
Car Windshield Black Dots: కారు అద్దం అంచున ఉండే నల్లటి చుక్కలను ఎందుకు ఇచ్చారు, వీటి ఉపయోగం ఏంటో తెలుసా? చాలామంది వీటిని కేవలం డిజైన్ కోసం ఇచ్చారని అనుకుంటారు. కానీ, వీటి వెనుక చాలా పెద్ద కారణం ఉంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కారు అద్దం అంచున ఉండే ఆ నల్లటి చుక్కలేంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే..!
Car Windshield Black Dots: మీరు ఎప్పుడైనా కారు ముందు అద్దం (విండ్‌షీల్డ్) అంచులను గమనించారా? అక్కడ నల్లటి చుక్కల డిజైన్ ఉంటుంది. చాలా మంది ఇది కేవలం కారు అందం పెంచడానికి చేసిన డిజైన్ అని భావిస్తారు. కానీ, నిజానికి ఇది అద్భుతమైన ఇంజనీరింగ్ సాంకేతికత. ప్రయాణీకుల భద్రతతోపాటు అద్దం మన్నికలో ఈ నల్లటి చుక్కలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఏమిటి ఈ ఫ్రిట్స్ టెక్నాలజీ..?
కారు అద్దం అంచున ఉండే ఈ నల్లటి చుక్కల అమరికను ‘ఫ్రిట్స్’ అని పిలుస్తారు. ఇవి సాధారణ పెయింట్ కాదు, సెరామిక్ పెయింట్‌ను అధిక ఉష్ణోగ్రత వద్ద అద్దంపై ముద్రించడం ద్వారా తయారు చేస్తారు. ఇవి కేవలం అలంకారం కోసం కాకుండా, విండ్‌షీల్డ్ కారు ఫ్రేమ్‌కు గట్టిగా అతుక్కుని ఉండటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ సాంకేతికత లేకపోతే మండుతున్న ఎండలకు కారు అద్దం పగిలిపోవడమే కాకుండా, తన స్థానం నుంచి బయటకు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
ఉష్ణోగ్రతను సమానంగా విస్తరించడం..
కారు అద్దంపై సూర్యరశ్మి పడినప్పుడు, అద్దం మధ్య భాగం కంటే అంచులు త్వరగా వేడెక్కుతాయి. దీనివల్ల అద్దంపై ఒత్తిడి పెరిగి అది పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఈ నల్లటి చుక్కలు (ఫ్రిట్స్) అద్దం అంతటా ఉష్ణోగ్రతను సమానంగా విస్తరించడంలో సహాయపడతాయి. దీనివల్ల కంటికి కనిపించే దృశ్యాలు వంకరగా కనిపించే ‘ఆప్టికల్ ఇల్యూషన్’ సమస్య కూడా తలెత్తదు.
అడెసివ్ రక్షణ..
కారు అద్దాన్ని ఫ్రేమ్‌కు అతికించడానికి ‘యురేథేన్ సీలెంట్’ అనే ఒక ప్రత్యేకమైన గమ్‌ను ఉపయోగిస్తారు. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు నేరుగా ఈ గమ్‌పై పడితే అది కరిగిపోయి అద్దం వదులయ్యే అవకాశం ఉంది. ఈ నల్లటి చుక్కలు సూర్యకిరణాలను అడ్డుకుని, ఆ గమ్ పటిష్టంగా ఉండేలా చూస్తాయి. తద్వారా వేగంగా కారు నడుపుతున్నప్పుడు లేదా కుదుపులకు గురైనప్పుడు అద్దం ఊడిపోకుండా ఉంటుంది.
పటిష్టమైన పట్టు కోసం ‘ఎచెస్’..
ఈ చుక్కలు కేవలం వేడిని నియంత్రించడమే కాదు, అద్దం ఉపరితలాన్ని కొంచెం గరుకుగా మార్చుతాయి. దీనినే ‘ఎచెస్’ అని పిలుస్తారు. ఈ గరుకుదనం వల్ల అద్దానికి, కారు ఫ్రేమ్‌కు మధ్య ఉండే బంధం మరింత బలోపేతం అవుతుంది. ఇది ఒక రకమైన పట్టును (గ్రిప్) అందిస్తుంది, దీనివల్ల విండ్‌షీల్డ్ తన స్థానంలో స్థిరంగా ఉంటుంది.
ఇవి అరిగిపోతే ప్రమాదమే..!
చాలా కాలం వాడకం తర్వాత లేదా నాణ్యత లేని అద్దాల వల్ల ఈ నల్లటి చుక్కలు అరిగిపోయినా లేదా వెలిసిపోయినా వెంటనే అద్దాన్ని మార్చుకోవడం మంచిది. ఎందుకంటే ఈ చుక్కలు లేని అద్దం ఎప్పుడు వదులై ఊడిపోతుందో చెప్పలేము. కారుకు బ్రేకులు ఎంత ముఖ్యమో, విండ్‌షీల్డ్ భద్రతకు ఈ ఫ్రిట్స్ కూడా అంతే ముఖ్యం. మీ భద్రత కోసం వీటిని ఎప్పుడూ విస్మరించకండి.




