Chery: పెట్రోల్ టెన్షన్ లేదు.. ఛార్జింగ్ భయం అసలే లేదు.. ఈ కారుతో లాంగ్ డ్రైవ్స్ పండగే

Chery: చైనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం చెరీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

CR Reddy
Published on: 28 Sept 2026 7:15 AM IST
Chery Exeed ET8 REEV
X

Chery Exeed ET8 REEV

Chery: చైనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం చెరీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరో సరికొత్త రేంజ్ ఎక్స్‌టెండర్ ఎలక్ట్రిక్ వెహికల్‌కు సంబంధించి దేశంలో పేటెంట్ నమోదు చేసింది. ఈ ప్రీమియం ఎస్‌యూవీ పేరు ఎక్సీడ్ ET8 REEV కాగా, ఫుల్ ట్యాంక్ అలాగే ఫుల్ ఛార్జ్‌తో దీని కంబైన్డ్ రేంజ్ 1300 కిలోమీటర్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారత ఆటో మార్కెట్‌లో ఈ తరహా టెక్నాలజీతో వస్తున్న కార్లపై వినియోగదారుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎక్సీడ్ ఈటీ8 డిజైన్ అలాగే ప్రత్యేకతలు

ఎక్సీడ్ ఈటీ8 మోడల్ అత్యంత ఆకర్షణీయమైన బాక్సీ డిజైన్‌తో పాటు ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్‌గా రానున్న ఈటీ9 డిజైన్ లాంగ్వేజ్‌ను పోలి ఉంటుంది. ఇటీవలే చైనాలో జరిగిన ప్రత్యేక వేడుకలో ఈ వాహనాలను ప్రదర్శించారు. ముఖ్యంగా వెనుక డోర్ల కోసం ప్రత్యేకమైన రియర్-హింజ్ సెటప్ అందించడం దీని ప్రత్యేకత. భారత్‌లో పేటెంట్ దక్కించుకున్నంత మాత్రాన వెంటనే లాంచ్ అవుతుందని చెప్పలేకపోయినా, రాబోయే రోజుల్లో రోడ్డెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

బ్యాటరీ సామర్థ్యం అలాగే ఇంజిన్ పనితీరు

ఈ సరికొత్త ఎక్సీడ్ ఈటీ8 ఆర్ఈఈవీ మోడల్‌లో దాదాపు 40 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల ఎల్ఎఫ్‌పీ బ్యాటరీని అమర్చనున్నారు. దీనికి జతగా 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అలాగే జనరేటర్ మోటార్ సెటప్ ఉంటుంది. ఈ ఆర్ఈఈవీ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటంటే, పెట్రోల్ ఇంజిన్ నేరుగా చక్రాలకు శక్తిని ఇవ్వకుండా కేవలం బ్యాటరీని ఛార్జ్ చేసే జనరేటర్‌లా పనిచేస్తుంది. వాహన చక్రాలను పూర్తిగా ఎలక్ట్రిక్ మోటారే నడిపిస్తుంది.

అద్భుతమైన డ్రైవింగ్ రేంజ్

నివేదికల ప్రకారం ఈ ఎస్‌యూవీ కేవలం బ్యాటరీ సాయంతోనే సుమారు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇక పెట్రోల్ ట్యాంక్ నింపి, బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే మొత్తం రేంజ్ 1300 కిలోమీటర్లు దాటుతుంది. లాంగ్ డ్రైవ్ లవర్లను ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. భారత్‌లో ఈ కార్ల ప్రవేశం కోసం ప్రముఖ సంస్థలతో కలిసి భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.