CNG Cars: సీఎన్జీ కార్ల యజమానులకు సూపర్ ట్రిక్.. ఈ 5 చిట్కాలతో మైలేజ్ డబుల్ అవ్వడం ఖాయం

CNG Cars: పెట్రోల్, డీజిల్ భారం తట్టుకోలేక చాలామంది సీఎన్జీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

CR Reddy
Published on: 30 Aug 2026 7:52 AM IST
CNG Cars
X

CNG Cars

CNG Cars: పెట్రోల్, డీజిల్ భారం తట్టుకోలేక చాలామంది సీఎన్జీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా పట్టించుకోకపోతే ఈ వాహనాల్లోనూ మైలేజ్ క్షీణించి ఇంధన ఖర్చులు పెరిగిపోతాయి. పెద్దగా డబ్బు ఖర్చు చేయకుండా కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ సీఎన్జీ కారు ఇచ్చే మైలేజ్‌ను ఊహించని రీతిలో పెంచుకోవచ్చు. ఆ రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సీఎన్జీ సిలిండర్ అమర్చడం వల్ల కారు వెనుక భాగంలో అదనపు బరువు తోడవుతుంది. ఇలాంటి సమయంలో టైర్లలో గాలి తగ్గితే రహదారిపై రాపిడి పెరిగిపోతుంది. ఫలితంగా కారు ముందుకు సాగడానికి ఇంజిన్ ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఇది నేరుగా ఇంధన వినియోగాన్ని పెంచి మైలేజ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ప్రతీ వారం తప్పనిసరిగా టైర్ల ఒత్తిడిని తనిఖీ చేయించుకోవడం మంచిది. సరైన విదంగా గాలిని నిర్వహించడం వల్ల ఇంజిన్‌పై అనవసర భారం తగ్గి ప్రయాణం సఫీగా సాగుతుంది.

ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ పరిశుభ్రత

ఇంజిన్ సజావుగా పనిచేయడానికి తగినంత స్వచ్ఛమైన గాలి అవసరం. ఎయిర్ ఫిల్టర్‌లో దుమ్ము చేరితే ఇంజిన్ గాలి పీల్చుకోవడం కష్టంగా మారి పనితీరు మందగిస్తుంది. ప్రతీ 5,000 కిలోమీటర్లకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్‌ను శుభ్రం చేయడం లేదా అవసరమైతే మార్చడం చేయాలి. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్జీ మండటానికి ఎక్కువ స్పార్క్ అవసరం పడుతుంది. పాతబడిన లేదా మురికి పట్టిన స్పార్క్ ప్లగ్స్ వల్ల గ్యాస్ వృథా అవుతుంది. క్రమం తప్పకుండా స్పార్క్ ప్లగ్స్‌తో పాటు సీఎన్జీ కిట్ ట్యూనింగ్ నిపుణులతో తనిఖీ చేయించడం ఉత్తమం.

సరియైన వేగంతో డ్రైవింగ్ చేసే అలవాటు

మనం కారు నడిపే విధానం కూడా మైలేజ్ పై నేరుగా ప్రభావం చూపుతుంది. అకస్మాత్తుగా యాక్సిలరేటర్ నొక్కడం, పదే పదే గట్టిగా బ్రేకులు వేయడం లాంటి అలవాట్ల వల్ల ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో పయనిస్తే అద్భుతమైన మైలేజ్ సాధించవచ్చు. సరైన సమయంలో గేర్లు మారుస్తూ ప్రశాంతంగా డ్రైవింగ్ చేయడం వల్ల కారు ఇంజిన్ ఆయుష్షు పెరగడమే కాకుండా గ్యాస్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది.

సీఎన్జీ నింపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గ్యాస్ పట్టించే సమయం కూడా మీ బండి మైలేజ్‌ను ప్రభావితం చేస్తుందనే విషయం చాలామందికి తెలియదు. ఉదయం వేళల్లో లేదా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. చల్లని వాతావరణంలో గ్యాస్ సాంద్రత పెరిగి, సిలిండర్‌లోకి ఎక్కువ పరిమాణంలో గ్యాస్ సరైన ప్రెజర్‌తో చేరుతుంది. దీనివల్ల ఎక్కువ గ్యాస్ పట్టడమే కాకుండా మెరుగైన రేంజ్ లభిస్తుంది. ఈ చిన్నచిన్న నియమాలు పాటిస్తే మీ రోజువారీ ఇంధన బడ్జెట్‌ను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story