Hybrid SUVs : కార్ లవర్స్‌కి దీపావళి ధమాకా.. మార్కెట్లోకి రాబోతున్న రెండు పవర్‌ఫుల్ హైబ్రిడ్ SUVలు

Hybrid SUVs : ఈ దీపావళి పండుగ సీజన్‌లో మార్కెట్లోకి రెండు అదిరిపోయే హైబ్రిడ్ ఎస్‌యూవీ కార్లు రాబోతున్నాయి. కియా సోరెంటో, రెనాల్ట్ డస్టర్ మోడళ్లు సూపర్ మైలేజ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో లాంచ్ కానున్నాయి.

CR Reddy
Published on: 17 July 2026 8:12 AM IST
Hybrid SUVs
X

Hybrid SUVs

Hybrid SUVs : ఈ ఏడాది దీపావళి పండుగ సీజన్‌లో సరికొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం ఒక సూపర్ న్యూస్. రాబోయే పండుగ రోజుల్లో భారత ఆటోమొబైల్ మార్కెట్లో రెండు సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీ కార్లు సందడి చేయబోతున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన కియా ఇండియా, రెనాల్ట్ ఇండియా తమ సరికొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి రెడీ అయ్యాయి. కియా సంస్థ తన మొదటి హైబ్రిడ్ మోడల్ అయిన సోరెంటో ప్రీమియం ఎస్‌యూవీని అక్టోబర్ నాటికే మార్కెట్లోకి తెస్తుండగా, రెనాల్ట్ కంపెనీ తన మోస్ట్ పాపులర్ డస్టర్ హైబ్రిడ్ కారును నవంబర్ 2026 నాటికి షోరూమ్‌లలో అందుబాటులో ఉంచనుంది.

ప్రీమియం లుక్‌తో వస్తున్న కియా సోరెంటో

లగ్జరీ కార్ల మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వడానికి కియా సోరెంటో హైబ్రిడ్ ఎస్‌యూవీ సిద్ధమవుతోంది. మార్కెట్ అంచనాల ప్రకారం ఈ కారు ధర రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రీమియం కారు కోసం ఇప్పటికే కొన్ని సెలెక్టెడ్ కియా డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. లీకైన సమాచారం ప్రకారం ఈ ఎస్‌యూవీ మోడల్ డీజిల్ ఇంజన్‌తో పాటు పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఆప్షన్లలో లభించనుంది. కంపెనీ ఇంకా అఫీషియల్ స్పెసిఫికేషన్లను ప్రకటించనప్పటికీ, సోరెంటో హైబ్రిడ్ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన ఎలక్ట్రిక్ సెటప్ ఉంటుందని టాక్. ఇందులో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా ఉంటాయి.

6, 7 సీటర్ ఆప్షన్లలో అదిరిపోయే ఫీచర్లు

పెద్ద ఫ్యామిలీల కోసం కియా సోరెంటో కారును 6 సీటర్, 7 సీటర్ సిట్టింగ్ ఆప్షన్లలో డిజైన్ చేశారు. ఇదొక లగ్జరీ కారు కాబట్టి ఫీచర్ల విషయంలో కంపెనీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ కారులో డ్యూయల్ 12.3 ఇంచుల డిస్‌ప్లే స్క్రీన్లు, ఎండీ కాలంలో కూలింగ్ ఇచ్చేలా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్కై వ్యూ కోసం పనోరమిక్ సన్‌రూఫ్, నైట్ రైడింగ్ కోసం యాంబియంట్ లైటింగ్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి ఎన్నో అప్‌డేట్స్ ఉన్నాయి. వీటితో పాటు సేఫ్టీ కోసం 360-డిగ్రీ కెమెరా, డ్రైవింగ్ సులభతరం చేసే లెవెల్-2 అడాస్ (ADAS) టెక్నాలజీని కూడా ఇందులో అమర్చారు.

హైబ్రిడ్ ఇంజన్‌తో రెనాల్ట్ డస్టర్

ఒకప్పుడు ఇండియాలో ఎస్‌యూవీ ట్రెండ్ సెట్ చేసిన రెనాల్ట్ డస్టర్ సరికొత్త అవతారంలో మళ్లీ రాబోతోంది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ కేటగిరీలో రానున్న రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ధర రూ. 18 లక్షల నుండి రూ. 21 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కారులో 1.8 లీటర్ ఫోర్-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను వాడారు. దీనికి అదనంగా రెండు ఎలక్ట్రిక్ మోటార్లను (49 bhp డ్రైవ్ మోటార్, 20 bhp జనరేటర్ మోటార్) జత చేశారు. ఈ మొత్తం సిస్టమ్‌కు సపోర్ట్ ఇవ్వడానికి 1.4 కిలోవాట్ అవర్ (kWh) బ్యాటరీ ప్యాక్‌ను కూడా అమర్చారు.

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ స్పెసిఫికేషన్లు ఇవే

ఈ సరికొత్త ఇంజన్ సెటప్‌తో డస్టర్ కారు 109 బీహెచ్‌పీ (bhp) పవర్‌ను, 172 ఎన్ఎమ్ (Nm) టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనివల్ల ఈ కేటగిరీలోనే ఇది అత్యంత పవర్‌ఫుల్ కారుగా నిలవనుంది. ఈ ఎస్‌యూవీ మల్టీ-మోడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఫ్రంట్-వీల్ డ్రైవ్ (FWD) సిస్టమ్‌తో వస్తుంది. లుక్ పరంగా చూస్తే నార్మల్ డస్టర్ లాగే ఉన్నప్పటికీ, దీనిపై ప్రత్యేకంగా హైబ్రిడ్ బ్యాడ్జ్ ఉండబోతోంది. కారు ఇంటీరియర్ డిజైన్, మిగతా ఫీచర్లు అన్నీ స్టాండర్డ్ డస్టర్ మోడల్ తరహాలోనే ఉండనున్నాయి. మైలేజ్ ఎక్కువ కావాలనుకునే వారికి ఈ పండుగ సీజన్లో డస్టర్ ఒక బెస్ట్ ఛాయిస్ కానుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story