Driving Licence at 16: 18 ఏళ్లు అవసరం లేదు.. 16 ఏళ్లకే డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు..! ఎలా అప్లై చేయాలంటే..?

Driving Licence at 16: భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ అంటే 18 ఏళ్లు నిండాకే అనుకుంటారు. కానీ కొన్ని ప్రత్యేక షరతులతో 16 ఏళ్ల వయసులోనే లైసెన్స్ పొందే అవకాశం ఉంది

Venkat
Published on: 16 March 2026 9:57 PM IST
Driving Licence at 16: భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ అంటే 18 ఏళ్లు నిండాకే అనుకుంటారు
X

Driving Licence at 16

Driving Licence at 16: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే తప్పనిసరిగా 18 ఏళ్లు ఉండాలనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. అయితే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, 16 ఏళ్ల వయసులోనే కొన్ని వాహనాల కోసం లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఈ అనుమతి ముఖ్యంగా మోటార్‌సైకిల్ వితౌట్ గేర్ (MCWOG) కేటగిరీకి మాత్రమే వర్తిస్తుంది. అంటే గేర్ లేని ద్విచక్ర వాహనాలు, అవి కూడా 50cc వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్నవాటిని మాత్రమే నడపడానికి ఈ లైసెన్స్ చెల్లుతుంది.

అంటే, స్కూటర్లు లేదా తక్కువ సామర్థ్య గల గేర్ లెస్ వాహనాలను మాత్రమే 16 ఏళ్ల వయసులో చట్టబద్ధంగా నడపవచ్చు. కానీ, దీన్ని చూసి అన్ని రకాల బైక్స్ లేదా కార్లు నడపొచ్చని అనుకోవడం తప్పు.

ఏ వాహనాలకు అనుమతి లేదు?

18 ఏళ్లలోపు వయసు ఉన్న వారు కార్లు, గేర్ బైక్స్, లేదా ఇతర లైట్ మోటార్ వాహనాలు నడపడానికి అనుమతి ఉండదు. అలాంటి వాహనాలకు దరఖాస్తు చేయాలంటే కనీస వయసు 18 ఏళ్లు తప్పనిసరి.

ఇంకా ఒక ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, 16 ఏళ్ల వయసులో లైసెన్స్‌కు అప్లై చేసే వారు తమ తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ నుంచి రాతపూర్వక సమ్మతి తప్పనిసరిగా సమర్పించాలి. గార్డియన్ అనుమతి లేకుండా దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాదు.

ఎలా అప్లై చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రక్రియ..

అర్హత ఉన్న టీనేజర్లు ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. లేదా తమ ప్రాంతానికి చెందిన RTO కార్యాలయంను ప్రత్యక్షంగా సందర్శించి కూడా దరఖాస్తు సమర్పించవచ్చు.

దరఖాస్తు ప్రక్రియలో ముందుగా ఆన్‌లైన్ ఫారం నింపాలి. తర్వాత వయస్సు ధృవీకరణ పత్రం, చిరునామా రుజువు, గార్డియన్ సమ్మతి పత్రం వంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. అనంతరం నిర్ణయించిన ఫీజు చెల్లించాలి.

దీని తర్వాత అభ్యర్థి లెర్నర్ లైసెన్స్ టెస్ట్ కు హాజరుకావాలి. ఇందులో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై ప్రాథమిక అవగాహనను పరీక్షిస్తారు. టెస్ట్‌లో ఉత్తీర్ణులైతే లెర్నర్ లైసెన్స్ జారీ అవుతుంది.

నియమాలు అతిక్రమిస్తే తీవ్ర చర్యలు..

16 ఏళ్లకే లైసెన్స్ పొందే అవకాశం ఉన్నా, ఇది చాలా కఠినమైన పరిమితులతో ఉంటుంది. 50cc వరకు గేర్ లెస్ వాహనాలకు మాత్రమే ఇది చెల్లుతుంది. దీనితో గేర్ బైక్ లేదా కారు నడిపితే అది చట్టవిరుద్ధం.

అధికారులు స్పష్టం చేస్తున్న విషయం ఏమిటంటే, లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనం నడిపితే అది తీవ్రమైన నేరం. అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.

కాబట్టి 16 ఏళ్ల వయసులో లైసెన్స్ పొందాలనుకునే వారు నియమాలు పూర్తిగా తెలుసుకుని, అనుమతించిన వాహనాలకే పరిమితం కావాలి.

Venkat

Venkat

Next Story