Gmail Tips: ఎప్పుడో క్రియేట్ చేసిన జీమెయిల్ అడ్ర‌స్ ఇప్పుడు న‌చ్చ‌డం లేదా.? ఎలా మార్చుకోవాలో తెలుసా.?

Gmail Tips: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే దాదాపు ప్రతి ఒక్కరికీ జీమెయిల్‌ అకౌంట్ కామ‌న్‌గా మారిపోయింది.

Mokshith
Updated on: 12 July 2026 2:49 PM IST
Gmail Tips
X

Gmail Tips: ఎప్పుడో క్రియేట్ చేసిన జీమెయిల్ అడ్ర‌స్ ఇప్పుడు న‌చ్చ‌డం లేదా.? ఎలా మార్చుకోవాలో తెలుసా.?

Gmail Tips: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే దాదాపు ప్రతి ఒక్కరికీ జీమెయిల్‌ అకౌంట్ కామ‌న్‌గా మారిపోయింది. అయితే చాలా మంది ఒకప్పుడు ఏదో ఒక పేరుతో జీమెయిల్‌ను క్రియేట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు అడ్రస్‌ను ఎలా మార్చాలో చాలా మందికి తెలియదు. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం.

జీమెయిల్ అడ్రస్ మార్చుకోవ‌డం ఎలా.?

మీ జీమెయిల్‌ అడ్రస్ మార్చాలనుకుంటే ముందుగా myaccount.google.com వెబ్‌సైట్‌లో మీ Google అకౌంట్‌తో లాగిన్ అవ్వండి. ఎడమ వైపు కనిపించే Personal Info ఎంపికపై క్లిక్ చేయండి. తర్వాత Email విభాగంలోకి వెళ్లండి.

అక్కడ కనిపించే Google Account Email ఎంపికను ఎంచుకోండి. భద్రత కోసం మీ Google అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఎంట‌ర్ చేయాలి. ఆ తర్వాత కొత్త Gmail యూజర్‌నేమ్ నమోదు చేసి, Change Email ఎంపికపై క్లిక్ చేస్తే మార్పు పూర్తవుతుంది.

Gmail అడ్రస్ మార్చితే డేటాకు ఏమైనా ఇబ్బందా?

చాలా మందిలో Gmail అడ్రస్ మార్చితే పాత ఈమెయిల్స్, Google Drive ఫైళ్లు లేదా ఇతర Google సేవల్లోని సమాచారం పోతుందేమో అనే సందేహం ఉంటుంది. అయితే అలాంటి ఆందోళన అవసరం లేదు. Gmail అడ్రస్ మారినా... పాత ఈమెయిల్స్ అలాగే ఉంటాయి. Google Driveలోని ఫైళ్లకు ఎలాంటి నష్టం ఉండదు. YouTube, Google Maps, Google Photos వంటి Google సేవల్లోని మీ సమాచారం కూడా యథాతథంగానే ఉంటుంది. అంటే Gmail అడ్రస్ మారినంత మాత్రాన మీ Google అకౌంట్‌లోని డేటాపై ఎలాంటి ప్రభావం ఉండదు.

Gmail అడ్రస్ మార్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

Google కొన్ని ముఖ్యమైన నిబంధనలను పాటిస్తుంది. కొత్త gmail.com అడ్రస్‌ను 12 నెలలకు ఒకసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి కొత్త Gmail అడ్రస్ క్రియేట్ చేసిన‌ తర్వాత దాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. కొత్త Gmail అడ్రస్ మీ Google అకౌంట్‌తో శాశ్వతంగా లింక్ అయి ఉంటుంది. అవసరమైతే పాత Gmail అడ్రస్‌ను కూడా కొన్ని సందర్భాల్లో మళ్లీ ఉపయోగించే అవకాశం ఉంటుంది.

మార్పు చేసే ముందు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోండి

Gmail అడ్రస్ మార్చే ముందు మీ అకౌంట్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఒకసారి పరిశీలించడం మంచిది. మార్పు తర్వాత కూడా Google Maps, YouTube, Google Drive వంటి సేవల్లో కొత్త లేదా పాత Gmail ఆధారంగా లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ Gmail అడ్రస్ మార్పు గురించి సందేహాలు ఉంటే Google అధికారిక Help పేజీలో ఇచ్చిన సూచనలు చదవడం మంచిది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ Gmail అడ్రస్‌ను సురక్షితంగా మార్చుకోవచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story