Bajaj Pulsar: బైక్ మీటర్ పైనే నేరుగా గూగుల్ మ్యాప్స్.. సరికొత్త హంగులతో నయా బజాజ్ పల్సర్

Bajaj Pulsar: ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో తన అత్యంత పవర్ ఫుల్ బైక్ పల్సర్ NS400Zను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తెచ్చింది.

CR Reddy
Published on: 2 Oct 2026 9:19 AM IST
Bajaj Pulsar
X

Bajaj Pulsar

Bajaj Pulsar: ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో తన అత్యంత పవర్ ఫుల్ బైక్ పల్సర్ NS400Zను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తెచ్చింది. పల్సర్ బ్రాండ్ ప్రయాణం ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కంపెనీ ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌ను పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రకారం ఈ బైక్ ప్రారంభ ధర రూ.1,90,015గా నిలిచింది. రైడర్ల సౌకర్యాన్ని పెంచేలా డిజైన్ చేసిన ఈ బైక్ దేశీయ మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది.

మీటర్ పైనే నేరుగా గూగుల్ మ్యాప్స్ ఫీచర్

ఈ బైక్‌లో చేసిన అత్యంత కీలకమైన మార్పు ఐదు అంగుళాల డిజిటల్ కన్సోల్ స్క్రీన్. దీని సహాయంతో రైడర్లు ప్రయాణం చేస్తున్నప్పుడు నేరుగా మీటర్ స్క్రీన్ పైనే గూగుల్ మ్యాప్స్ వీక్షించవచ్చు. దారి చూసేందుకు మొబైల్ ఫోన్‌ను హ్యాండిల్‌కు పెట్టాల్సిన పని ఇకపై ఉండదు. ఈ ఫీచర్ రాకతో ఈ సెగ్మెంట్‌లోని బైకుల్లో పల్సర్ NS400Z అగ్రస్థానంలో నిలిచింది. లాంగ్ రైడ్స్ వెళ్లే బైకర్లకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

రైడింగ్ అనుభవాన్ని మార్చేసే అడ్వాన్స్డ్ ఫీచర్లు

కొత్త డిజిటల్ స్క్రీన్ ద్వారా రైడర్లు 4 వేర్వేరు రైడింగ్ మోడ్లను సులువుగా మార్చుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్‌ను నియంత్రించడం, పాటలు మార్చుకోవడం, అత్యవసర డాక్యుమెంట్లు డిజిటల్‌గా భద్రపరుచుకోవడం వంటి సదుపాయాలు లభిస్తాయి. ఫోన్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. హఠాత్తుగా బ్రేక్ వేసినప్పుడు వెనుక వచ్చే వాహనాలకు హెచ్చరికగా నిలిచే పానిక్ బ్రేక్ అలర్ట్ ఫీచర్ కూడా ఇందులో పొందుపరిచారు.

పవర్ ఫుల్ ఇంజిన్ పర్ఫామెన్స్

ఈ బైక్ పవర్‌ట్రేన్ విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇందులో గతంలో ఉన్న నమ్మకమైన 349 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ కొనసాగించారు. ఈ ఇంజిన్ 40 బీహెచ్‌పీ పవర్‌ను, 33 ఎన్ఎమ్ టార్గెట్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ జతచేసిన ఈ ఇంజిన్ అద్భుతమైన పికప్ అందిస్తుంది. ముందు భాగంలో 43 ఎంఎం సస్పెన్షన్, రెండు చక్రాలకు ఏబీఎస్ బ్రేకులు ఇవ్వడం ద్వారా రైడింగ్ అత్యంత సురక్షితంగా మారుతుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.