Harley-Davidson: బైక్ లవర్లకు గుడ్‌న్యూస్.. హార్లే-డేవిడ్‌సన్ నుంచి సరికొత్త ఎంట్రీ లెవెల్ బైక్

Harley-Davidson: ప్రపంచ ప్రసిద్ధ బైక్ తయారీ సంస్థ హార్లే-డేవిడ్‌సన్ భారతీయ మార్కెట్ కోసం తన 440 సీరీస్‌ను మరింత విస్తరిస్తోంది

CR Reddy
Published on: 27 Oct 2026 9:34 AM IST
Harley Davidson Sprint 440
X

Harley Davidson Sprint 440

Harley-Davidson: ప్రపంచ ప్రసిద్ధ బైక్ తయారీ సంస్థ హార్లే-డేవిడ్‌సన్ భారతీయ మార్కెట్ కోసం తన 440 సీరీస్‌ను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ అప్‌కమింగ్ బైక్ స్ప్రింట్ 440 ఎలాంటి క్యామఫ్లాజ్ కవర్లు లేకుండా నేరుగా డీలర్‌షిప్‌లకు చేరుకుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా, బైక్ డిజైన్ తో పాటు పలు కీలక వివరాలు బయటకు వచ్చాయి. ఈ సరికొత్త క్రూజర్ బైక్ డిసెంబర్ 2026 లేదా 2027 ప్రారంభంలో అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

అద్భుతమైన డిజైన్.. అదిరిపోయే క్రూజర్ లుక్

ఈ సరికొత్త బైక్ X440 రోడ్‌స్టర్ కంటే భిన్నంగా అచ్చం పక్కా క్రూజర్ బైక్ లా కనిపిస్తుంది. ఇందులో సరికొత్త ఫ్యూయల్ ట్యాంక్, రైడర్ కోసం ప్రత్యేకంగా స్కూప్ చేసిన సింగిల్ పీస్ సీట్, వెనక్కి వంచిన హ్యాండిల్ బార్స్ అమర్చారు. బైక్ బాడీపై బ్లాక్ ఫినిషింగ్ ఎక్కువగా ఉండగా, ఇంజిన్ మెరిసే భాగాలు, ఎగ్జాస్ట్ పై ఉన్న బ్రైట్ హీట్ షీల్డ్ దీనికి సూపర్ లుక్ ఇస్తున్నాయి. ట్యాంక్ పై ఆరెంజ్ బోర్డర్ గ్రాఫిక్స్ తో పాటు హార్లే-డేవిడ్‌సన్ పేరు స్పష్టంగా రాసి ఉంది. అలాగే సైడ్ ప్యానెల్స్ పై స్ప్రింట్ బ్రాండింగ్ ఇచ్చారు.

ఆకట్టుకునే ఫ్రంట్ లుక్.. కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్

బైక్ ముందు భాగంలో సింపుల్ గా ఉండే రౌండ్ హెడ్‌ల్యాంప్ ఇచ్చారు. దీనికి చుట్టూ షైనింగ్ ట్రిమ్, వేర్వేరు టర్న్ ఇండికేటర్లు, కాంపాక్ట్ మడ్‌గార్డ్ అమర్చారు. రైడర్ సీటు కాస్త లోతుగా ఉండి, వెనక కూర్చునే వారికి కొంచెం పైకి లేపిన డిజైన్ ఇచ్చారు. హ్యాండిల్ బార్లు కొంచెం పైకి, వెనక్కి తిరిగి ఉండటం వల్ల లాంగ్ రైడ్స్ లో కూడా ఎలాంటి అలసట లేకుండా ప్రయాణం చేయవచ్చు. దీని వీల్‌బేస్ X440 కన్నా ఎక్కువగా ఉండటంతో పాటు రెక్ యాంగిల్ లో కూడా మార్పులు చేశారు.

సేఫ్టీ ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్

భద్రత విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు భాగంలో యూఎస్‌డీ ఫోర్కులు, వెనక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్లు, అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. ముందు, వెనక రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్ లు ఉండటంతో పాటు ఏబీఎస్ సెన్సార్ రింగ్ కూడా ఉంది. ఇక ఇంజిన్ విషయానికొస్తే, ఇందులో X440 మోడల్ లో ఉన్న 440సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉండే ఛాన్స్ ఉంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో రానుంది. ఎంట్రీ లెవెల్ మోడల్ కాబట్టి దీని ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేలా కంపెనీ ప్లాన్ చేస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.