Hero: హీరో బైక్, స్కూటర్లపై భారీ డిస్కౌంట్స్.. ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే

Hero: దేశీయ మార్కెట్‌లో దిగ్గజ టూ-వీలర్ తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ పండుగ సీజన్ ప్రారంభం సందర్భంగా కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది.

CR Reddy
Published on: 17 Sept 2026 11:26 AM IST
Hero MotoCorp
X

Hero MotoCorp

Hero: దేశీయ మార్కెట్‌లో దిగ్గజ టూ-వీలర్ తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ పండుగ సీజన్ ప్రారంభం సందర్భంగా కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. సెప్టెంబర్ 2026 పండుగ సీజన్‌ను పురస్కరించుకుని తన పాపులర్ మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై రూ.10,000 వరకు భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ లిమిటెడ్ పీరియడ్ ఫెస్టివల్ ఆఫర్లు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. బడ్జెట్ ధరలో కొత్త టూ-వీలర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు.

కేవలం డిస్కౌంటే కాదు.. ఎక్స్ఛేంజ్ బోనస్

ఈ ప్రత్యేక పండుగ ఆఫర్ కింద కంపెనీ కేవలం క్యాష్‌బ్యాక్ మాత్రమే కాకుండా, అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. 10,000 రూపాయల వరకు లభించే క్యాష్‌బ్యాక్ ఆఫర్ కేవలం ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై మాత్రమే వర్తిస్తుంది. దీనితో పాటు కస్టమర్లకు ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా రోడ్‌సైడ్ అసిస్టెన్స్(RSA) సౌకర్యం ఉచితంగా లభిస్తుంది. ఈ ఫ్రీ ఆర్‌ఎస్‌ఏ సదుపాయం ఇన్వాయిసింగ్ జరిగిన 10 రోజుల తర్వాత వర్తిస్తుంది. అంతేకాకుండా, పాత వాహనాన్ని స్క్రాప్ చేసే కస్టమర్లకు అదనంగా రూ.1,500 ఈఎల్‌వీ గ్రీన్ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు.

వివిధ మోడళ్లపై తగ్గిన ధరలు ఇవే

హీరో సంస్థ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్స్‌ట్రీమ్ 160R 4V, ఎక్స్‌ట్రీమ్ 160R, డెస్టినీ 125, డెస్టినీ ప్రైమ్, ప్లెజర్+ ఎక్స్‌టెక్, డెస్టినీ 110 వంటి పాపులర్ మోడళ్లపై ధరలను తగ్గించి ప్రత్యేక ధరలతో లిస్ట్ చేసింది.

* హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V: ఎక్స్-షోరూమ్ ధర రూ.133,195 నుంచి రూ.123,194కు తగ్గింది.

* హీరో ఎక్స్‌ట్రీమ్ 160R: ధర రూ.112,329 నుంచి రూ.102,328కు పడిపోయింది.

* హీరో డెస్టినీ 125 & ప్రైమ్: ధరలు వరుసగా రూ.76,888, రూ.72,210గా ఉన్నాయి.

* హీరో ప్లెజర్+ Xtec: ఎక్స్-షోరూమ్ ధర రూ.69,766 నుంచి రూ.67,266కు తగ్గింది.

* హీరో డెస్టినీ 110: ధర రూ.73,900 నుంచి రూ.71,800కు చేరింది.

అమ్మకాలను పెంచుకోవడమే లక్ష్యం

పండుగ సీజన్‌ సమయంలో ఆటోమోబైల్ విక్రయాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ తరుణంలో కస్టమర్లను ఆకర్షించి అమ్మకాల రికార్డులను సృష్టించేందుకు హీరో మోటోకార్ప్ ఈ భారీ ఆఫర్లను తీసుకువచ్చింది. ఈ ఆఫర్లు, డిస్కౌంట్ల గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తిగల కస్టమర్లు తమ సమీపంలోని అధీకృత హీరో డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చని కంపెనీ వెల్లడించింది. సెప్టెంబర్ 30 లోపు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.