Hero XPulse 421 : 421ccతో హీరో ఎంట్రీ.. ఫీచర్స్ చూస్తే షాక్.!

Hero XPulse 421 : టూ-వీలర్ మార్కెట్‌లో 'హీరో' అంటే ఒకప్పుడు కేవలం మైలేజ్ బైకులు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ, ఎప్పుడైతే ఎక్స్‌పల్స్ సిరీస్ మార్కెట్లోకి వచ్చిందో..

G Krishna
Published on: 18 Jun 2026 11:55 AM IST
Hero XPulse 421
X

Hero XPulse 421

Hero XPulse 421 : టూ-వీలర్ మార్కెట్‌లో 'హీరో' అంటే ఒకప్పుడు కేవలం మైలేజ్ బైకులు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ, ఎప్పుడైతే ఎక్స్‌పల్స్ సిరీస్ మార్కెట్లోకి వచ్చిందో, అడ్వెంచర్ లవర్స్‌కు హీరో ఫేవరెట్ బ్రాండ్‌గా మారిపోయింది. ఇప్పుడు అదే సిరీస్‌లో మరింత పవర్‌ఫుల్, ప్రీమియం బైక్‌ను తీసుకొస్తూ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450, కేటీఎం 390 అడ్వెంచర్‌లకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఎత్తైన కొండల్లో పూర్తిస్థాయిలో టెస్టింగ్ జరుపుకుంటూ కెమెరాలకు చిక్కిన 'హీరో ఎక్స్‌పల్స్ 421' విశేషాలు మీకోసం..

లడఖ్ కొండల్లో దొరికిపోయిన Hero XPulse 421..

ఇప్పటివరకు కేవలం ఊహాగానాలకే పరిమితమైన ఈ బైక్, ఇప్పుడు రియల్ వరల్డ్‌లో అది కూడా ఎత్తైన కొండ ప్రాంతాలలో హై-ఆల్టిట్యూడ్ టెస్టింగ్ చేస్తూ కనిపించింది. భారీ బాడీ, ఎత్తైన విండ్‌స్క్రీన్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, ఎత్తుగా ఉండే ఎగ్జాస్ట్ పైపుతో చూడగానే ఇదొక 'బిగ్ బైక్' అనే రేంజ్‌లో అడ్వెంచర్ స్టాన్స్‌తో అదరగొడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎక్స్‌పల్స్ 210 కంటే ఇది చాలా పెద్దదిగా, ప్రీమియం లుక్‌తో మెరిసిపోతోంది.

గుండెకాయ మార్చేశారు.. 400cc దాటేసింది బాసూ..

ఈ బైక్‌లో అసలైన సర్ప్రైజ్ దీని ఇంజన్. హీరో ఇందులో సరికొత్త 421cc లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. దీని పవర్ అవుట్‌పుట్ కూడా ఈ సెగ్మెంట్లోని ఇతర బైకులకు గట్టి పోటీ ఇచ్చేలా ఉంటుంది. లాంగ్ రైడ్స్‌లో అలసట లేకుండా వెళ్లడానికి వీలుగా కంపెనీ ఇందులో 'క్రూయిజ్ కంట్రోల్' ఫీచర్‌ను కూడా ఇస్తోంది. అవును, మీరు విన్నది నిజమే.. కుడిచేతి హ్యాండిల్‌బార్‌పై ప్రత్యేకమైన క్రూయిజ్ కంట్రోల్ స్విచ్ స్పష్టంగా కనిపించింది, ఇది లాంగ్ టూరింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది.

ఆఫ్-రోడింగ్ కోసం ఐరన్ బాడీ.. సరికొత్త ఫ్రేమ్..

హీరో తన పాత మోడల్స్ ఆర్కిటెక్చర్‌ను పక్కనపెట్టి, ఈ 421 మోడల్ కోసం సరికొత్త 'ట్రెల్లిస్ ఫ్రేమ్' ను ఉపయోగించింది. గతుకుల రోడ్లను కూడా స్మూత్‌గా దాటడానికి వీలుగా ముందు భాగంలో లాంగ్-ట్రావెల్ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. దీని వీల్స్ విషయానికొస్తే.. ముందు వైపు 21-ఇంచుల వైర్-స్పోక్ వీల్ ఉండగా, వెనుక చక్రం సైజ్ కొంచెం తక్కువగా ఉంది, ఇది ఆఫ్-రోడింగ్‌లో బైక్‌పై పట్టు కోల్పోకుండా మంచి బ్యాలెన్స్ ఇస్తుంది.

స్క్రీన్ చూస్తే మైండ్ బ్లాకే.. ఐపాడ్ రేంజ్ డిస్‌ప్లే

ఈ బైక్ కాక్‌పిట్‌లో అమర్చిన పెద్ద టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ రైడర్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. సాధారణంగా ఈ బడ్జెట్ బైకుల్లో కనిపించే స్క్రీన్ల కంటే ఇది చాలా పెద్దదిగా ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో పాటు విభిన్న రైడింగ్ మోడ్స్‌ను మార్చుకోవడానికి హ్యాండిల్‌బార్‌పై ప్రత్యేకమైన మోడ్ సెలెక్టర్ బటన్‌ను కూడా ఇచ్చారు. సేఫ్టీ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో పాటు ఆఫ్-రోడ్ వెళ్లేటప్పుడు వెనుక వీల్ ఏబీఎస్‌ను ఆఫ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడు..?

ప్రస్తుతం జరుగుతున్న అడ్వాన్స్‌డ్ టెస్టింగ్ చూస్తుంటే.. రాబోయే కొన్ని నెలల్లోనే హీరో దీని ప్రొడక్షన్ మోడల్‌ను అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఇది షోరూమ్‌లలోకి అడుగుపెట్టనుంది. లాంగ్-టూరింగ్, ఆఫ్-రోడింగ్ ఇష్టపడే అడ్వెంచర్ బైకర్స్‌కు హీరో నుంచి ఇది ఒక పక్కా లోడెడ్ గిఫ్ట్ కాబోతోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story