HondaADV160: భారతదేశంలో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ స్కూటర్.. ఎంట్రీ ఇచ్చిన హోండా ఏడీవీ160..!
Honda adv160 Flex Fuel e85 Scooter: సాధారణ పెట్రోల్ వాహనాల నుంచి ఈ20 ఇంధనానికి మారిన తరుణంలో, హోండా ఏకంగా 85 శాతం ఎథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో నడిచే ఈ85 ఇంజిన్‌తో ఈ కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది.
HondaADV160: భారతదేశంలో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ స్కూటర్.. ఎంట్రీ ఇచ్చిన హోండా ఏడీవీ160..!
Honda adv160 Flex Fuel e85 Scooter: టూవీలర్ మార్కెట్లో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా. భారతదేశంలోనే మొట్టమొదటి ఈ85 (E85) ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో నడిచే అడ్వెంచర్ మ్యాక్సీ స్కూటర్ 'ADV160' ను అధికారికంగా ఆవిష్కరించింది. పెట్రోల్ ఖర్చులకు చెక్ పెడుతూ ఎథనాల్ ఇంధనంతో నడిచే ఈ వాహనం వాహనదారుల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.
భారత ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు వేగంగా పరుగులు తీస్తోంది. సాధారణ పెట్రోల్ వాహనాల నుంచి ఈ20 ఇంధనానికి మారిన తరుణంలో, హోండా ఏకంగా 85 శాతం ఎథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో నడిచే ఈ85 ఇంజిన్‌తో ఈ కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా ఇంధన ఖర్చులు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. భారత్‌లో తయారై ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి అయ్యేలా ఈ వాహనాన్ని డిజైన్ చేశారు.
పవర్ ఫుల్ ఇంజిన్.. అదిరిపోయే పెర్ఫార్మెన్స్..
హోండా ADV160 స్కూటర్‌లో 157 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 16.3 బిహెచ్‌పి పవర్, 14.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే ఈ వాహనం నగర ప్రయాణాలకే కాకుండా లాంగ్ రైడ్స్ చేసే వారికి కూడా అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. రోడ్డు ఎలాంటిదైనా సునాయాసంగా ముందుకెళ్లేలా ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, రీఫైన్డ్ సస్పెన్షన్‌తో దీనిని రూపొందించారు.
అడ్వెంచర్ లుక్స్.. అత్యాధునిక ఫీచర్లు..
హోండా ఎక్స్-ఏడీవీ మోడల్ ఆధారంగా దీని రూపకల్పన జరిగింది. మస్కులర్ బాడీ, అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్, ట్విన్ ఎల్ఈడీ హెడ్‌లాంప్స్ దీనికి స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కలిగిన డిజిటల్ టిఎఫ్టి డిస్‌ప్లే, హోండా రోడ్‌సింక్ యాప్ సాయంతో నావిగేషన్, కాల్ నోటిఫికేషన్లు చూడవచ్చు. 27 లీటర్ల విశాలమైన అండర్ సీట్ స్టోరేజ్, సింగిల్ ఛానల్ ఎబిఎస్, టీఓఆర్క్యూ కంట్రోల్ (HSTC) వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 8.1 లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ సుదూర ప్రయాణాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
పోటీదారులకు సవాల్..
మార్కెట్లో విక్రయమవుతున్న యమహా ఏరాక్స్ 155, హీరో జూమ్ 160 వంటి మ్యాక్సీ స్కూటర్లకు హోండా ADV160 గట్టి పోటీ ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా ఉన్న హోండా రెడ్ వింగ్, బిగ్ వింగ్ షోరూమ్‌ల ద్వారా దీని విక్రయాలు జరగనున్నాయి. ధర, సేల్స్ లాంచ్ తేదీలను త్వరలోనే కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది.
పర్యావరణ హిత ఇంధన సాంకేతికతతో వచ్చిన హోండా ADV160 భారత వాహన రంగంలో నూతన శకానికి నాంది పలికింది. వినూత్న ఫీచర్లు, ఫ్లెక్స్ ఫ్యూయల్ సామర్థ్యంతో వస్తున్న ఈ అడ్వెంచర్ స్కూటర్ భారతీయ కస్టమర్ల మనసు దోచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.




