19 కిమీల మైలేజ్.. 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీ బడ్జెట్‌లో దొరికే బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే..!

Honda Amaze: సొంత కారు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం కనే అందమైన కల.

Venkat
Published on: 16 Aug 2026 8:28 PM IST
Honda Amaze
X

19 కిమీల మైలేజ్.. 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీ బడ్జెట్‌లో దొరికే బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే..!

Honda Amaze: సొంత కారు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం కనే అందమైన కల. అందులోనూ రోజూవారీ ప్రయాణాలకు అనువుగా ఉండే మంచి మైలేజ్, కుటుంబ సభ్యులకు భద్రత, అలాగే బడ్జెట్‌ను మించని ధర.. ఈ మూడు ఫీచర్లు ఉన్న కారు దొరకడం అంటే నిజంగా లక్కే. మీ అన్వేషణకు తెరదించుతూ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా అమేజ్ ఒక బెస్ట్ ఆప్షన్‌గా ముందుకొచ్చింది.

సరికొత్త ఫీచర్లతో భద్రతకు పెద్దపీట..

కారు కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ ముందుగా ఆలోచించేది మైలేజ్ గురించే. కానీ, హోండా అమేజ్ కారు మైలేజ్‌తో పాటు ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ సెడాన్ కారులోని అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించడం దీని ప్రత్యేకత. అత్యవసర పరిస్థితుల్లో బ్రేకులు వేసినప్పుడు కారు స్కిడ్ కాకుండా కాపాడే యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ఎత్తు పల్లాల్లో నడిపేందుకు హిల్‌స్టార్ట్ అసిస్ట్, సురక్షితమైన పార్కింగ్ కోసం రియర్ సెన్సార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. టాప్ ఎండ్ (ZX) మోడల్‌లో అయితే ఏడీఏఎస్ లాంటి అత్యంత అధునాతన భద్రతా వ్యవస్థ కూడా ఉండటం విశేషం.

మెరుగైన మైలేజ్.. బలమైన ఇంజిన్..

కేవలం 7.65 లక్షల రూపాయల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తున్న ఈ సెడాన్ కారులో 1.2 లీటర్ల i-VTEC పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 89 బీహెచ్‌పీ పవర్‌ను, 110 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మోడల్‌ను నడిపితే లీటరుకు దాదాపు 18.65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ట్రాఫిక్‌లో క్లచ్, గేర్లు మార్చే ఇబ్బంది పడకూడదనుకునే వారి కోసం సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు ఏకంగా 19.46 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. సిటీ డ్రైవింగ్‌కు ఇది ఎంతో అనువైనది.

విశాలమైన క్యాబిన్.. విలాసవంతమైన ఫీచర్లు..

చూసేందుకు కాంపాక్ట్ సెడాన్ అయినప్పటికీ, లోపల మాత్రం ఐదుగురు కుటుంబ సభ్యులు ఎంతో సౌకర్యవంతంగా కూర్చునేలా డిజైన్ చేశారు. సుదూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు అవసరమైన లగేజీ పెట్టుకోవడానికి వీలుగా ఏకంగా 416 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ అందించారు. వినోదం కోసం 8-అంగుళాల స్మార్ట్ టచ్‌స్క్రీన్, ఫోన్ కనెక్ట్ చేసుకునేందుకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే ఫీచర్లు ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ ఏసీ, వెనుక సీట్లలో కూర్చునే వారి కోసం ప్రత్యేకంగా ఏసీ వెంట్స్ వంటి సదుపాయాలు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి.

తక్కువ బడ్జెట్‌లో, ఎక్కువ ఫీచర్లు కోరుకునే మధ్యతరగతి కుటుంబాలకు హోండా అమేజ్ ఒక బెస్ట్ ఛాయిస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మెరుగైన మైలేజ్, సిటీలో నడిపేందుకు కంఫర్ట్ కలయికగా వస్తున్న ఈ కారును కచ్చితంగా పరిశీలించవచ్చు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story