Honda: పండుగ ధమాకా అంటే ఇదే.. హోండా కార్లపై ఊహించని రేంజ్ ఆఫర్లు

Honda: అక్టోబర్ 2026 పండుగ సీజన్ సందర్భంగా హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

CR Reddy
Published on: 5 Oct 2026 11:05 AM IST
Honda Festive Offers
X

Honda Festive Offers

Honda: పండుగ వేళ కొత్త కారు కొనుగోలు చేయాలని చూస్తున్న వాహన ప్రియులకు హోండా కార్స్ ఇండియా అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. అక్టోబర్ 2026 పండుగ సీజన్ పురస్కరించుకుని తమ ఫేమస్ ఎస్‌యూవీలతో పాటు ప్రజాదరణ పొందిన సెడాన్ మోడళ్లపై కంపెనీ భారీ తగ్గింపులను ప్రకటించింది. హోండా పాపులర్ ఎస్‌యూవీ ఎలివేట్‌తో పాటు ఫ్లాగ్‌షిప్ సెడాన్‌లు సిటీ, అమెజ్‌లపై ఏకంగా రూ.2.34 లక్షల వరకు మైండ్ బ్లాకింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. హోండా కారును గ్యారేజీలో నిలపాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన అవకాశం.

హోండా ఎలివేట్‌పై భారీ డిస్కౌంట్

ఈ పండుగ సేల్‌లో అందరి దృష్టి హోండా ఎలివేట్‌పైనే ఉంది. ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీపై కస్టమర్లు గరిష్టంగా రూ. 2,34,600 వరకు భారీ ప్రయోజనాలను పొందవచ్చు. మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ. 11.81 లక్షలుగా ఉంది. ఇందులో శక్తివంతమైన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. సరికొత్త ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ అక్టోబర్ 6న గ్రాండ్‌గా లాంచ్ కానున్న నేపథ్యంలో, ప్రస్తుత స్టాక్‌పై డీలర్లు కస్టమర్లకు మరింత బెటర్ డీల్స్ అందించే అవకాశం ఉంది.

హోండా సిటీ పై అదిరిపోయే సేవింగ్స్

ప్రతిష్టాత్మక సెడాన్ హోండా సిటీని సొంతం చేసుకోవాలనుకునే వారికి కూడా పండుగ డిస్కౌంట్లు భారీ ఊరటనిస్తున్నాయి. ఈ ఐకానిక్ సెడాన్ మోడల్‌పై కంపెనీ ఏకంగా రూ. 1,70,900 వరకు ఆఫర్లను ప్రకటిస్తోంది. మెరుగైన మైలేజ్, క్లాసీ లుక్, అధునాతన ఫీచర్లతో అలరించే ఈ కారుపై లభిస్తున్న ప్రయోజనాలు కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేరియంట్ బట్టి మాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

కొత్త అమేజ్ పైన కాసుల వర్షం

థర్డ్ జనరేషన్ వర్షన్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టిన సరికొత్త హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌పై రూ. 66,800 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 7.65 లక్షలుగా ఉంది. ఆధునిక సేఫ్టీ టెక్నాలజీ అయిన అడాస్ (ADAS) ఫీచర్‌తో వస్తున్న ఈ కారు బడ్జెట్ విభాగంలో బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. రూఫ్ టాప్ సొబగులు, రీ డిజైన్డ్ ఇంటీరియర్ ఈ మోడల్‌కు అదనపు ఆకర్షణగా మారాయి.

పాత అమేజ్ పైనా స్పెషల్ డిస్కౌంట్లు

తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన సెడాన్ కోరుకునే వారి కోసం సెకండ్ జనరేషన్ అమెజ్ మోడల్‌ను కూడా కంపెనీ విక్రయిస్తోంది. ఈ మోడల్‌పై రూ. 57,600 వరకు తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తోంది. ప్రారంభ ధర సుమారు రూ. 6.98 లక్షలు మాత్రమే కావడం విశేషం. అతితక్కువ ధరకు ప్రీమియం సెడాన్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఈ పాత మోడల్ డీల్ సరైన ఎంపికగా చెప్పవచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.