Honda: హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ లాంచింగ్ డేట్ ఫిక్స్.. కొత్త లుక్‌తో రానున్న అదిరిపోయే ఎస్‌యూవీ
Honda: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా సిద్ధమైంది.
Honda Elevate
Honda: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా సిద్ధమైంది. ఇందులో భాగంగా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. చాలా కాలంగా భారతీయ రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటున్న ఈ సరికొత్త కారు అక్టోబర్ ఆరో తేదీన విడుదల కానుందని సమాచారం. మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేలా కంపెనీ ఈ వాహనంలో అనేక ఆధునిక మార్పులు చేసింది.
ఆకర్షణీయమైన ఎక్స్ టీరియర్
ఈ కొత్త ఎలివట్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్ టీరియర్లో అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముందు భాగంలో సరికొత్త స్లీక్ ఎల్ఈడీ హెడ్‌లైట్లతో పాటు ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ఫంక్షన్ డీఆర్ఎల్స్ అమర్చారు. ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌ను పూర్తిగా మార్చడంతో పాటు బంపర్ మీద ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త డిజైన్ అలాయ్ వీల్స్‌తో పాటు డోర్లపై ప్రత్యేక బ్రాండింగ్ వస్తుంది. వెనుక భాగంలో కొత్త టెయిల్ లైట్లు కారుకు మరింత ప్రీమియం లుక్‌ను తెచ్చిపెడతాయి.
మరింత లగ్జరీ ఇంటీరియర్
కారు లోపలి భాగంలో కస్టమర్లకు మరింత సౌకర్యవంతమైన అనుభూతి లభించనుంది. ఈ కొత్త మోడల్‌లో వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీల కెమెరా అలాగే సరికొత్త ఇంటీరియర్ కలర్ థీమ్ అందించనున్నారు. పాత మోడల్‌లో ఉన్న 15 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు యథావిధిగా కొనసాగుతాయి. కుటుంబ సమేతంగా ప్రయాణించే వారికి ఈ ఇంటీరియర్ ఎంతగానో నచ్చుతుంది.
పవర్ఫుల్ ఇంజిన్ అలాగే సేఫ్టీ ఫీచర్లు
ఇంజన్ విషయంలో ఎలాంటి మార్పులు చేయకుండా పాత మోడల్‌లోని 1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగిస్తున్నారు. ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది. భద్రత విషయానికి వస్తే హోండా సెన్సింగ్ అడాస్ టెక్నాలజీతో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్సీ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి. ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉండగా, ఈ కారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.




