Honda Unicorn 150 vs Bajaj Pulsar 150: పల్సర్ కొనలా లేదా యూనికార్న్ కొనలా.? మీరు కూడా ఇదే డైలామాలో ఉన్నారా.?
Honda Unicorn 150 vs Bajaj Pulsar 150: భారతదేశంలో రోజువారీ ప్రయాణానికి ఉపయోగించే బైక్స్‌లో హోండా యూనికార్న్ 150, బజాజ్ పల్సర్ 150 చాలా ప్రాచుర్యం పొందినవి. ఈ రెండు బైక్స్ ధరలు దగ్గరగా ఉన్నప్పటికీ, వాటి పనితీరు, కంఫర్ట్, ఫీచర్స్ పరంగా తేడాలు ఉంటాయి. ఇప్పుడు పూర్తి వివరంగా చూద్దాం.
Honda Unicorn 150 vs Bajaj Pulsar 150
Honda Unicorn 150 vs Bajaj Pulsar 150: భారతదేశంలో రోజువారీ ప్రయాణానికి ఉపయోగించే బైక్స్‌లో హోండా యూనికార్న్ 150, బజాజ్ పల్సర్ 150 చాలా ప్రాచుర్యం పొందినవి. ఈ రెండు బైక్స్ ధరలు దగ్గరగా ఉన్నప్పటికీ, వాటి పనితీరు, కంఫర్ట్, ఫీచర్స్ పరంగా తేడాలు ఉంటాయి. ఇప్పుడు పూర్తి వివరంగా చూద్దాం.
ధరలు ఎలా ఉన్నాయంటే.?
హోండా యూనికార్న్ సుమారు రూ.1.13 లక్షల వద్ద అందుబాటులో ఉంటుంది. అదే పల్సర్ 150 ధర రూ.1.10 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు అని గుర్తుంచుకోవాలి. ధరలో పెద్ద తేడా లేదు. కానీ యూనికార్న్ సింపుల్, కంఫర్ట్ కోరుకునే వాళ్లకు సరిపోతుంది. పల్సర్ మాత్రం స్టైల్, స్పోర్టీ ఫీలింగ్ కోరుకునే యువతకు బాగా నచ్చుతుంది.
ఇంజిన్, పనితీరు ఎలా ఉంది?
హోండా యూనికార్న్‌లో 162.7cc ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 12.7 bhp పవర్, 14 Nm టార్క్ ఇస్తుంది. ఈ బైక్ స్మూత్ రైడింగ్‌కు ప్రసిద్ధి. వేగం కంటే కంఫర్ట్‌పై దృష్టి ఉంటుంది. పల్సర్ 150లో 149.5cc ఇంజిన్ ఉంటుంది. ఇది వేగంగా స్పందిస్తుంది. మంచి పికప్ ఉంటుంది. టాప్ స్పీడ్ కూడా 110–115 kmph వరకు వెళ్తుంది. కాస్త స్పోర్టీ రైడ్ కోరుకునే వారికి ఇది బెటర్.
కంఫర్ట్, రైడింగ్ అనుభవం
కంఫర్ట్ విషయంలో హోండా యూనికార్న్ ముందుంటుంది. దీని సీట్ పెద్దగా, సాఫ్ట్‌గా ఉంటుంది. సస్పెన్షన్ కూడా స్మూత్‌గా ఉండటం వల్ల గుంతల రోడ్లపై కూడా షాక్ తక్కువగా ఉంటుంది. పల్సర్ 150లో సస్పెన్షన్ కాస్త హార్డ్‌గా ఉంటుంది. ఇది హ్యాండ్లింగ్‌కు బాగుంటుంది కానీ ఎక్కువ దూరం వెళ్తే అలసట కలిగిస్తుంది. స్ప్లిట్ సీట్ ఉన్న వేరియంట్లు స్టైలిష్‌గా కనిపిస్తాయి కానీ కంఫర్ట్ కొంచెం తక్కువ.
మైలేజ్, ఫీచర్స్
హోండా యూనికార్న్ మైలేజ్ 50–60 kmpl వరకు ఇస్తుంది. 13 లీటర్ల ట్యాంక్ ఉంటుంది. పల్సర్ 150 మైలేజ్ 47–50 kmpl వరకు ఉంటుంది. కానీ దీని ట్యాంక్ 15 లీటర్లు కావడం వల్ల లాంగ్ రైడ్స్‌కు అనుకూలం. ఫీచర్స్ విషయానికి వస్తే యూనికార్న్ చాలా సింపుల్. బేసిక్ మీటర్, హాలోజన్ లైట్స్ మాత్రమే ఉంటాయి. పల్సర్ 150లో మాత్రం LED లైట్స్, డిజిటల్ డిస్ప్లే, బ్లూటూత్, USB ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్స్ ఉంటాయి.
డిజైన్, సేఫ్టీ
హోడా యూనికార్న్ డిజైన్ సింపుల్, క్లాసిక్‌గా ఉంటుంది. సాదాసీదా లుక్ ఇష్టపడేవారికి ఇది సరైన ఎంపికగా చెప్పొచ్చు. అదే పల్సర్ 150 మాత్రం షార్ప్ డిజైన్, మస్క్యులర్ ట్యాంక్‌తో యూత్‌కి బాగా నచ్చుతుంది. సేఫ్టీ కోసం రెండు బైక్స్‌లో కూడా సింగిల్ ఛానల్ ABS ఉంటుంది. పల్సర్‌లో కొన్ని వేరియంట్స్‌లో బ్రేకింగ్ ఆప్షన్స్ మరింత మెరుగ్గా ఉంటాయి.
మొత్తం మీద రోజువారీ ఆఫీస్ ప్రయాణం, కంఫర్ట్, మంచి మైలేజ్ కావాలంటే హోండా యూనికార్న్ బెస్ట్ అని చెప్పొచ్చు అదే స్టైల్, స్పీడ్, ఫీచర్స్ కోరుకునే వారికి మాత్రం పల్సర్ సెట్ అవుతుంది. మీ అవసరం ఏదో బట్టి ఎంపిక చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది.




