Honda ZR-V : మార్కెట్లోకి ఇలా వచ్చిందో లేదో అలా అయిపోయాయి.. షోరూంల వద్ద సోల్డవుట్ బోర్డులు
Honda ZR-V : హోండా కంపెనీ భారత మార్కెట్ కోసం కేటాయించిన ZR-V ప్రీమియం హైబ్రిడ్ SUV కార్ల కోటా మొత్తం అమ్ముడైంది. లగ్జరీ లుక్స్, 22.08 కేఎంపీఎల్ మైలేజ్‌తో కస్టమర్ల నుంచి దీనికి భలే డిమాండ్ దక్కింది.
Honda ZR-V
Honda ZR-V : ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ హోండా భారత ఆటోమొబైల్ రంగంలో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇతర కార్ల కంపెనీలు తక్కువగా అంచనా వేసిన తమ ప్రీమియం క్రాస్‌ఓవర్ SUV ZR-V మోడల్‌తో హోండా మార్కెట్‌ను ఊపేసింది. భారత మార్కెట్ కోసం కేటాయించిన ZR-V కార్ల మొత్తం కోటాను కంపెనీ దిగ్విజయంగా విక్రయించింది. మొదటి రెండు బ్యాచ్‌లకు లభించిన అనూహ్య స్పందన తర్వాత, మూడో బ్యాచ్‌తో కలిపి మొత్తం దాదాపు 160 యూనిట్లను భారత్ కోసం కేటాయించగా.. అవన్నీ పూర్తిగా అమ్ముడయ్యాయి. కొత్త బుకింగ్‌లను కూడా ప్రస్తుతానికి నిలిపివేశారని, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి ఈ కారుకు విపరీతమైన డిమాండ్ వచ్చిందని సమాచారం.
పవర్ ఫుల్ ఇంజన్.. క్రేజీ మైలేజ్
భారతదేశంలో లగ్జరీ అండ్ ప్రీమియం విభాగాన్ని విస్తరించేందుకు హోండా రాబోయే రెండేళ్లలో విడుదల చేయనున్న ప్లాన్లలో ఈ ZR-V మొదటిది. ఈ కారును సిబీయూ రూపంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుని పూర్తి ఫీచర్లతో విక్రయిస్తున్నారు. ఇందులో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 181bhp పవర్, 315Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్ కావడంతో, లీటరుకు ఏకంగా 22.08 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని హోండా కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.
దిగ్గజ కార్లకు గట్టి పోటీ.. CR-V SUVకి పునాది
ధర, పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే హోండా ZR-V మోడల్.. స్కోడా కొడియాక్, ఫోక్స్‌వాగన్ టెరాన్, టయోటా ఫార్చ్యూనర్ వంటి దిగ్గజ కార్లకు నేరుగా పోటీ ఇస్తుంది. రాబోయే రెండేళ్లలో హోండా విడుదల చేయబోయే ప్రతిష్టాత్మక CR-V SUV మోడల్‌కు మంచి మార్కెట్ గ్రౌండ్ సిద్ధం చేయడంలో ఈ ZR-V విజయం కీలక పాత్ర పోషించనుంది.
మోడర్న్ లుక్స్ అండ్ స్టైలిష్ డిజైన్
లుక్స్, డిజైన్ పరంగా హోండా ZR-V కి మోడర్న్ క్రాస్‌ఓవర్ స్టైలింగ్ ఇచ్చారు. ముందు భాగంలో ఎల్-షేప్ DRLs తో కూడిన స్లిమ్ అండ్ షార్ప్ LED హెడ్‌లైట్లు, వర్టికల్ స్లాట్స్ గ్రిల్, ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో స్మూత్ కర్వ్స్, బాడీ కలర్ వీల్ ఆర్చ్‌లు, 18-ఇంచుల డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. వెనుక వైపు క్లియర్ లెన్స్ టెయిల్ లాంప్స్, రూఫ్ స్పాయిలర్, e:HEV బ్యాజింగ్, సిల్వర్ ఫినిషింగ్ డ్యూయల్ ఎగ్జాస్ట్ పైపులు ఇచ్చారు.
సాలెడ్ స్పేస్ అండ్ కలర్ ఆప్షన్లు
స్పేస్ విషయానికి వస్తే ZR-V చాలా విశాలమైన కేబిన్‌ను కలిగి ఉంది. ఈ కారు పొడవు 4,567 మిమీ, వెడల్పు 1,840 మిమీ, ఎత్తు 1,621 మిమీగా ఉంటుంది. లోపల కూర్చునే వారికి అద్భుతమైన లెగ్‌రూమ్ అందించేందుకు 2,655 మిమీ లాంగ్ వీల్‌బేస్‌ను అందించారు. ఈ ఫ్లాగ్‌షిప్ కారును ట్విలైట్ మిస్ట్ బ్లాక్ పెర్ల్, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్, మెటియోరాయిడ్ గ్రే మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్ అనే నాలుగు రాయల్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది.




