Hyundai Bayon: హ్యుందాయ్ నుంచి మరో క్రేజీ ఎస్‌యూవీ.. ఈ కారు లుక్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
Hyundai Bayon: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తన హవాను మరింత పెంచేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మరో కొత్త ఎస్‌యూవీ బేయాన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Hyundai Bayon
Hyundai Bayon: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తన హవాను మరింత పెంచేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మరో కొత్త ఎస్‌యూవీ బేయాన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గత కొన్ని రోజులుగా రాబోయే ఎస్‌యూవీకి సంబంధించిన టీజర్లు, ఫోటోలను కంపెనీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో దీనికి సంబంధించిన అధికారిక బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కానప్పటికీ, అక్టోబర్ 2026లో ఈ కారు మార్కెట్లోకి రానుందని అంచనా వేస్తున్నారు.
మస్కులర్ లుక్, మోడ్రన్ డిజైన్
కొత్త హ్యుందాయ్ బేయాన్ డిజైన్ మునుపటి మోడళ్ల కంటే చాలా మోడ్రన్‌గా, పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. రోడ్డుపై దీనికి ప్రత్యేక గుర్తింపునిచ్చేలా మస్కులర్ బోనెట్, ముందు భాగంలో హ్యుందాయ్ సిగ్నేచర్ H షేప్ ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లను అమర్చారు. అయితే ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నంగా ఇందులో ఫ్రంట్ కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్ ఇవ్వకపోవడం విశేషం. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, 16 అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్, మందపాటి బాడీ క్లాడింగ్, రూఫ్ రైల్స్ ఈ కారుకు అసలైన ఎస్‌యూవీ లుక్‌ను తెచ్చిపెడుతున్నాయి.
అత్యాధునిక టెక్నాలజీ, ఏఐ ఫీచర్లు
ఈ ఎస్‌యూవీ ఇంటీరియర్ పరంగా చాలా హై-టెక్‌గా ఉండనుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు ఇవ్వనున్నారు. అలాగే 360-డిగ్రీ కెమెరా సదుపాయం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో అందించనున్న ఇన్-బిల్ట్ జనరేటివ్ AI వాయిస్ అసిస్టెంట్ దీనికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీని ద్వారా వాయిస్ కమాండ్ తోనే కార్‌లోని పలు ఫీచర్లను ఆపరేట్ చేయవచ్చు. భద్రత కోసం స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, ప్రత్యేకమైన సీఎన్‌జీ ఆప్షన్
పవర్‌ట్రేన్ విషయానికి వస్తే, ఈ కారులో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉంది. దీనిని మాన్యువల్, IVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జత చేయనున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యమైన హైలైట్ ఏంటంటే.. 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న ఈ సెగ్మెంట్‌లో కంపెనీ ఫిటెడ్ సీఎన్‌జీ ఆప్షన్‌తో వస్తున్న తొలి హ్యుందాయ్ ఎస్‌యూవీ ఇదే కావచ్చు. సాధారణంగా సీఎన్‌జీ సిలిండర్ కారణంగా బూట్ స్పేస్ తగ్గిపోతుంది, కానీ ఇందులో సీఎన్‌జీ ట్యాంక్‌ను బూట్ లోపల కాకుండా బాడీ కింద అమర్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల లగేజ్ పెట్టుకోవడానికి బూట్‌లో ఎక్కవ స్థ లం మిగులుతుంది. లాంచ్ సమయంలో దీని ధరలు మరియు పూర్తి వివరాలు తెలియనున్నాయి.




