Hyundai: హ్యుందాయ్ బంపర్ ఆఫర్.. ఈ 5 పాపులర్ కార్లపై ఏకంగా రూ.లక్ష వరకు డిస్కౌంట్
Hyundai: కొత్త కారు కొనాలని చూస్తున్న వాహన ప్రియులకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ అద్భుతమైన అవకాశం అందించింది.
Hyundai
Hyundai: కొత్త కారు కొనాలని చూస్తున్న వాహన ప్రియులకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ అద్భుతమైన అవకాశం అందించింది. ఆగస్టు ఆఫర్లలో భాగంగా తన 5 అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లపై ఏకంగా రూ.లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్లు, ఇతర బెనిఫిట్స్ ప్రకటిస్తూ కార్ల లవర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సొంత కారు కల నెరవేర్చుకోవాలనుకునే వారికి హ్యుందాయ్ కంపెనీ ఒక అరుదైన డిస్కౌంట్ ధమాకా తీసుకొచ్చింది. ఈ తగ్గింపు ఆఫర్లలో నగదు డిస్కౌంట్లతో పాటు కార్పొరేట్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా కలిసి ఉన్నాయి. ఈ ఆఫర్లను సొంతం చేసుకోవడానికి కేవలం 4 రోజులు మాత్రమే గడువు ఉండటంతో షోరూమ్‌లకు కస్టమర్ల రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. పండుగల సీజన్ ప్రారంభానికి ముందే లభిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్ కారు కొనుగోలుదారుల బడ్జెట్‌కు పెద్ద ఊరట నిస్తుందనడంలో సందేహం లేదు.
హ్యుందాయ్ క్రెటా, వెర్నాలపై భారీ పొదుపు
కంపెనీకి చెందిన అత్యంత పాపులర్ ఎస్యూవీ హ్యుందాయ్ క్రెటాపై గరిష్ఠంగా రూ.లక్ష వరకు పొదుపు చేసుకునే అవకాశాన్ని అందించారు. వేర్వేరు ఇంజిన్ వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11 లక్షల నుంచి రూ.20.15 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం సెడాన్ విభాగంలో మెరిసే హ్యుందాయ్ వెర్నా మోడల్‌పై ఏకంగా రూ.95,000 వరకు తగ్గింపు లభిస్తోంది. సరికొత్త డిజైన్, బలమైన ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ కారు ప్రారంభ ధర రూ.11 లక్షల నుంచి రూ.17.42 లక్షల మధ్య అందుబాటులో ఉంది.
అల్కాజార్ పై ఆకర్షణీయ తగ్గింపు
పెద్ద కుటుంబాల కోసం రూపొందించిన 6, 7 సీటర్ ఎస్యూవీ హ్యుందాయ్ ఆల్కాజార్పై కస్టమర్లు రూ.75,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. టర్బో పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభించే ఈ ఎస్యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.14.99 లక్షల నుంచి రూ.21.55 లక్షల వరకు పలికిస్తోంది. సుదీర్ఘ ప్రయాణాలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండే ఈ ప్రీమియం కారుపై ఇంత పెద్ద మొత్తంలో డిస్కౌంట్ రావడం ఇదే తొలిసారి.
హాచ్బ్యాక్, మైక్రో ఎస్‌యూవీలపై పండుగ ఆఫర్లు
ఎక్కువ మైలేజ్ కోరుకునే వారి ఆదరణ పొందిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌పై కంపెనీ రూ. 70,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. పెట్రోల్ తో పాటు సిఎన్జి ఆప్షన్ ఉన్న ఈ హాచ్బ్యాక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.92 లక్షల నుంచి రూ. 8.56 లక్షల మధ్యలో ఉంది. మైక్రో ఎస్యూవీ విభాగంలో దుమ్మురేపుతున్న హ్యుందాయ్ ఎక్స్టర్ మోడల్‌పై కస్టమర్లు రూ.55,000 వరకు లబ్ధి పొందవచ్చు. నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ చిన్న ఎస్యూవీ ప్రారంభ ధర రూ.6.13 లక్షల నుంచి రూ.10.43 లక్షల వరకు మార్కెట్లో అందుబాటులో ఉంది.




