Independence Day Offers : స్వాతంత్య్ర వేళ బైక్‌ల జోరు.. ఈ మోడళ్లకు ఫుల్ డిమాండ్.!

Independence Day Offers : స్వాతంత్య్ర దినోత్సవ పండుగ వారంలో దేశవ్యాప్తంగా బడ్జెట్ మోటార్‌సైకిళ్ల కొనుగోళ్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. వాహన తయారీ సంస్థలు

G Krishna
Published on: 11 Aug 2026 2:58 PM IST
Independence-Day-Offers
X

Independence-Day-Offers

Independence Day Offers : స్వాతంత్య్ర దినోత్సవ పండుగ వారంలో దేశవ్యాప్తంగా బడ్జెట్ మోటార్‌సైకిళ్ల కొనుగోళ్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. వాహన తయారీ సంస్థలు అందిస్తున్న పండుగ ప్రత్యేక డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్లను దక్కించుకోవడానికి కొనుగోలుదారులు షోరూమ్‌లకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రోజువారీ ప్రయాణాలకు ఎంతగానో ఉపయోగపడే కమ్యూటర్ మోడళ్ల విభాగంలో తీవ్రమైన డిమాండ్ కనిపిస్తోంది. ఆగస్టు తొలి వారంలో నమోదైన 'వాహన్' రిటైల్ రిజిస్ట్రేషన్ల గణాంకాల ప్రకారం మార్కెట్లో కంపెనీల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రముఖ మోడళ్లు, వేరియంట్ల కోసం కొనుగోలుదారులు కొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

కస్టమర్ల ఓటు ఆ మోడళ్లకే.. వెయిటింగ్ పీరియడ్ ఎంతంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా షైన్, బజాజ్ ప్లాటినా వంటి మోడళ్లకు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. చాలా ప్రాంతాల్లో హీరో స్ప్లెండర్ ప్లస్ సాధారణ మోడళ్లు తక్షణమే డెలివరీ అవుతున్నప్పటికీ, ప్రీమియం కలర్ ఆప్షన్ల కోసం పది రోజుల వరకు సమయం పడుతోంది. అలాగే హోండా షైన్ కొనుగోలు చేయాలనుకునే వారికి స్థిరంగా ఏడు రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. బైక్ బ్రేకింగ్ సిస్టమ్ ఆధారంగా కూడా డెలివరీ సమయం మారుతోంది. సాధారణ బేస్ డ్రమ్ బ్రేక్ మోడళ్లు షోరూమ్‌లలో సులభంగానే దొరుకుతున్నా, భద్రతకు ప్రాధాన్యమిచ్చే కొనుగోలుదారులు డిస్క్ బ్రేక్ వేరియంట్ల వైపే మొగ్గు చూపుతుండటంతో వాటి డెలివరీకి కొంత ఆలస్యం అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన కొనుగోలు ట్రెండ్స్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాహనదారుల ఇష్టాఇష్టాలు ప్రాంతాన్ని బట్టి విభిన్నంగా ఉంటున్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఆఫీస్ ప్రయాణాలు, రోజువారీ అవసరాల కోసం ప్రీమియం లుక్ ఇచ్చే హోండా షైన్ మోడల్‌కు మంచి డిమాండ్ ఉంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో, వ్యవసాయ సంబంధిత పనుల కోసం రఫ్ అండ్ టఫ్ బాడీతో పాటు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బజాజ్ ప్లాటినాను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు డీలర్లు కేవలం రూ. 1,500 లోపే ఆకర్షణీయమైన ఈఎమ్‌ఐ ఆప్షన్లు, తక్కువ డౌన్ పేమెంట్ , వేగవంతమైన లోన్ ప్రాసెసింగ్ సదుపాయాలను అందిస్తున్నారు.

సరైన బైక్ ఎంపికతో పెట్రోల్ భారం భవితకు భరోసా

రోజువారీ బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవడానికి బైక్ ఇచ్చే అసలైన మైలేజ్ చాలా కీలకం. ఎంట్రీ లెవల్ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్, బజాజ్ ప్లాటినా వంటి మోడళ్లు లీటరుకు సుమారు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తూ జేబుకు చిల్లు పడకుండా చూస్తున్నాయి. ఇక 125 సీసీ విభాగంలో ఉండే సూపర్ స్ప్లెండర్, హోండా షైన్ మోడళ్లు 55 కిలోమీటర్ల వరకు స్థిరమైన మైలేజీని అందిస్తున్నాయి. ఆధునిక ఫ్యూయల్-ఇంజెక్షన్ సాంకేతికత వల్ల నగరాల్లోని విపరీతమైన ట్రాఫిక్‌లోనూ ఇవి స్మూత్ రైడింగ్ అనుభూతిని ఇస్తున్నాయి. పండుగ ఆఫర్లు ముగిసేలోగా వేర్వేరు షోరూమ్‌లలో ధరలు, ఆఫర్లను పోల్చి చూసుకుని, డెలివరీ తేదీని ముందే ఖరారు చేసుకోవడం శ్రేయస్కరం.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story