Kia: ఎర్టిగాకు చెక్ పెట్టేందుకు కియా నుంచి అద్భుతమైన 7-సీటర్ సీఎన్జీ కారు లాంఛ్

Kia: కియా భారతీయ మార్కెట్లో తన మోస్ట్ పాపులర్ 7-సీటర్ కార్లైన కారెన్స్, కారెన్స్ క్లావిస్ మోడళ్లలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ వెర్షన్లను అధికారికంగా విడుదల చేసింది.

CR Reddy
Published on: 20 Sept 2026 10:31 AM IST
Kia Carens CNG
X

Kia Carens CNG 

Kia: ప్రముఖ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా భారతీయ మార్కెట్లో తన మోస్ట్ పాపులర్ 7-సీటర్ కార్లైన కారెన్స్, కారెన్స్ క్లావిస్ మోడళ్లలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ వెర్షన్లను అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ కార్లకు డీలర్ లెవెల్ లేదా థర్డ్-పార్టీ ద్వారా సీఎన్జీ ఫిట్టింగ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కంపెనీ నేరుగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. దీని ధర విషయానికి వస్తే కారెన్స్ సీఎన్జీ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.12.12 లక్షలు ఉండగా, కారెన్స్ క్లావిస్ సీఎన్జీ ధర రూ.12.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఇవి వాటి పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ల కంటే దాదాపు రూ.లక్ష ఎక్కువగా ధర కలిగి ఉన్నాయి. కారెన్స్ సీఎన్జీ ఆప్షన్ కేవలం దాని ప్రీమియం (O) ట్రిమ్‌లో లభిస్తుండగా, క్లావిస్ మోడల్ లోయర్-స్పెక్ HTE, HTE (O) ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఇంజన్ పరంగా చూస్తే.. ఇందులో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది సీఎన్జీ మోడ్‌లో 96hp పవర్, 123Nm టార్గెట్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానించబడి ఉంది. కంపెనీ దీని మైలేజ్ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇది సుమారు 22 నుంచి 25 కిమీ/కేజీ వరకు మైలేజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఈ కారుకు ప్రధాన పోటీదారుగా మారుతి సుజుకీ ఎర్టిగా కొనసాగుతోంది. అలాగే టయోటా రూమియన్, మారుతి ఎక్స్ఎల్6 కార్లు కూడా దీనికి గట్టి పోటీ ఇస్తున్నాయి. ఎర్టిగా సీఎన్జీ ధరలు రూ.10.94 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, కియా కారెన్స్ తన ప్రీమియం ఫీచర్లు, విశాలమైన క్యాబిన్‌తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. పెద్ద కుటుంబాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఇది అద్భుతమైన ఎంపికగా మారుతోంది.

కారులో సీఎన్జీ సిలిండర్ అమరిక విషయానికి వస్తే, దీనిని బూట్ ఫ్లోర్ క్రింద చాలా చక్కగా అమర్చారు. దీనివల్ల బూట్ స్పేస్ కొద్దిగా తగ్గినా, ప్రయాణికులకు సీటింగ్ స్పేస్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా సీఎన్జీ సిలిండర్, ఇతర అదనపు బరువును దృష్టిలో ఉంచుకొని కంపెనీ దీని సస్పెన్షన్‌ను ప్రత్యేకంగా రీ-ట్యూన్ చేసింది. అలాగే ముందువైపు డిస్క్ బ్రేక్‌లను కూడా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా రోలపై మెరుగైన కంట్రోల్, సేఫ్టీ లభించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.