Kia Sonet: కాంపాక్ట్ SUV లవర్స్‌కు కియా అదిరిపోయే ఆఫర్.. ఆగస్టు నెలంతా భారీ డిస్కౌంట్లు
Kia Sonet: ఆగస్టు నెలలో కియా సోనెట్ SUVపై రూ.45,000 వరకు భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ వివరాలు చూద్దాం.
Kia Sonet
Kia Sonet: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కియా ఇండియా తమ ప్రముఖ కాంపాక్ట్ SUV కియా సోనెట్ పై ఆగస్టు నెలలో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ నంబర్ వన్ మోడల్‌గా నిలిచిన ఈ SUVపై ఈ నెలలో దాదాపు రూ. 45,000 వరకు బెనిఫిట్స్ లభించనున్నాయి. ముఖ్యంగా సోనెట్ MY26 మోడల్ కొనుగోలుపై రూ. 10,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 వరకు కార్పొరేట్ ఆఫర్, రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్ లభిస్తుంది. అదే సమయంలో MY25 వర్షన్‌కి కేవలం స్క్రాపేజ్ ఆఫర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్‌లో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.32 లక్షల నుంచి ప్రారంభమై రూ. 14.37 లక్షల వరకు ఉంది.
పెట్రోల్, డీజిల్ వేరియంట్ల అప్‌డేటెడ్ ధరలు
వివిధ ఇంజన్ ఆప్షన్లలో లభించే కియా సోనెట్ కొత్త ధరల వివరాలను పరిశీలిస్తే... 1.2-లీటర్ నార్మల్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లలో HTE వెర్షన్ ధర రూ. 7.33 లక్షలు, HTE(O) ధర రూ. 7.76 లక్షలు, HTK(O) ధర రూ. 8.77 లక్షలు, HTK+ ధర రూ. 9.14 లక్షలు, HTK+(O) వేరియంట్ ధర రూ. 9.64 లక్షలుగా ఉన్నాయి. 1.0-లీటర్ టర్బో పెట్రోల్ iMT వేరియంట్లలో HTK(O) ధర రూ. 9.16 లక్షలు కాగా HTK+(O) ధర రూ. 10.11 లక్షలుగా నమోదైంది. ఇక 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ (DCT) వర్షన్‌లో HTK(O) ధర రూ. 9.96 లక్షలు, HTK+(O) ధర రూ. 10.91 లక్షలు, HTX ధర రూ. 11.66 లక్షలు, GTX+ ధర రూ. 13.57 లక్షలు, టాప్-ఎండ్ X-Line ధర రూ. 13.71 లక్షలుగా నిర్ణయించారు.
డీజిల్ లవర్స్ కోసం అందించే 1.5-లీటర్ టర్బో డీజిల్ మాన్యువల్ వర్షన్‌లో HTE(O) రూ. 9.01 లక్షలు, HTK+ రూ. 10.37 లక్షలు, HTK+(O) రూ. 10.87 లక్షలు, HTX వేరియంట్ రూ. 11.32 లక్షలుగా ఉంది. 1.5-లీటర్ టర్బో డీజిల్ ఆటోమేటిక్ (TC) వర్షన్‌లో HTE(O) ధర రూ. 9.81 లక్షలు, HTK(O) ధర రూ. 10.81 లక్షలు, HTK+ ధర రూ. 11.17 లక్షలు, HTK+(O) రూ. 11.67 లక్షలు, HTX ధర రూ. 12.11 లక్షలు, GTX+ వేరియంట్ ధర రూ. 14.08 లక్షల ఎక్స్-షోరూమ్ వద్ద అందుబాటులో ఉంది.
పవర్ఫుల్ ఇంజన్ ఆప్షన్లు, స్పెసిఫికేషన్లు
కియా సోనెట్ భారతీయ వినియోగదారుల కోసం 3 రకాల ఇంజన్ ఆప్షన్లను అందిస్తోంది. అందులో మొదటిది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కాగా, ఇది 120bhp పవర్, 172Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండవది 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఇది 83bhp పవర్, 115Nm టార్క్‌ను అందిస్తుంది. మూడవది 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్, ఇది గరిష్టంగా 116bhp పవర్, 250Nm పీక్ టార్క్‌ను అందిస్తుంది. ఇవి సుదీర్ఘ ప్రయాణాలకు, మైలేజీకి అత్యుత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి.
హైటెక్ సేఫ్టీ ఫీచర్లు, గట్టి పోటీ
సేఫ్టీ విషయంలో కియా సోనెట్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో స్టాండర్డు 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా వంటి మోడ్రన్ టెక్నాలజీలు ఉన్నాయి. వీటితో పాటు లెవెల్-1 ADAS ఫీచర్ కూడా ఈ కారులో కలదు. సబ్-కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో కియా సోనెట్ నేరుగా టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా, మహీంద్రా XUV 3XO, టయోటా అర్బన్ క్రూజర్ టైజర్, నిస్సాన్ మాగ్నెట్, రెనాల్ట్ కైగర్ వంటి ప్రముఖ కార్లతో గట్టి పోటీని ఎదుర్కొంటుంది.




