Mahindra Scorpio: మూడు నెలల్లో 48 వేలకు పైగా విక్రయాలతో అగ్రస్థానంలో మహీంద్రా స్కార్పియో
Mahindra Scorpio: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో 4.5 మీటర్ల నుంచి 5 మీటర్ల పొడవు గల ఎస్‌యూవీలకు కస్టమర్ల నుంచి భారీ డిమాండ్ లభిస్తోంది.
Mahindra Scorpio
Mahindra Scorpio: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో 4.5 మీటర్ల నుంచి 5 మీటర్ల పొడవు గల ఎస్‌యూవీలకు కస్టమర్ల నుంచి భారీ డిమాండ్ లభిస్తోంది. ముఖ్యంగా గత జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో (Q3) జరిగిన విక్రయాలను పరిశీలిస్తే.. ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన మహీంద్రా స్కార్పియో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మూడు నెలల కాలంలో స్కార్పియో ఏకంగా 48,898 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ మోడల్ అమ్మకాల్లో దాదాపు 16.54 శాతం వృద్ధి కనిపించడం విశేషం.
ఈ సేల్స్ జాబితాలో మహీంద్రా కంపెనీకి చెందిన మరో మోడల్ ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ రెండో స్థానంలో నిలిచింది. ఈ ఎస్యూవీ 18.82 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 25,871 యూనిట్లను విక్రయించింది. అలాగే మూడో స్థానంలో మహీంద్రా XEV 9S నిలిచి 13,275 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఇక నాలుగో స్థానంలో టాటా మోటార్స్‌కు చెందిన ప్రముఖ ఎస్యూవీ టాటా హారియర్ నిలిచింది. హరియర్ 9,960 యూనిట్ల విక్రయాలను దక్కించుకోగా, ఐదో స్థానంలో నిలిచిన టయోటా ఫార్చ్యూనర్ 9,878 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
ఈ జాబితాలో ఆరో స్థానంలో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ నిలిచి 5,769 యూనిట్ల అమ్మకాలను సాధించగా, ఏడో స్థానంలో ఉన్న టాటా సఫారి 5,451 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఆ తర్వాత ఎనిమిదో స్థానంలో ఎంజీ హెక్టర్ 2,616 యూనిట్లతో నిలవగా, తొమ్మిదో స్థానంలో హ్యుందాయ్ అల్కాజార్ 2,460 యూనిట్లను విక్రయించింది. ఇక పదో స్థానంలో కియా సోరెంటో నిలిచి మొత్తం 2,104 యూనిట్ల అమ్మకాలను సొంతం చేసుకుంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే భారతీయ ఆటో మార్కెట్లో మహీంద్రా కార్ల హవా ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.




