Mahindra Scorpio : లిమిటెడ్ టైం ఆఫర్.. మహీంద్రా స్కార్పియో పై రూ.1.70 లక్షల వరకు భారీ డిస్కౌంట్
Mahindra Scorpio : మహీంద్రా స్కార్పియో కారు కొనాలనుకునే వారికి జులై నెలలో అదిరిపోయే ఆఫర్ లభిస్తోంది. స్కార్పియో ఎన్ మోడల్‌పై ఏకంగా రూ.1.70 లక్షల వరకు, క్లాసిక్ మోడల్‌పై రూ.70 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
Mahindra Scorpio
Mahindra Scorpio : సొంతంగా ఒక పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు మహీంద్రా కంపెనీ ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. తన పోర్ట్‌ఫోలియోలోనే నెంబర్ వన్ మోడల్‌గా దూసుకుపోతున్న మహీంద్రా స్కార్పియో కారుపై ఈ జులై నెలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కారు కొనే కస్టమర్లకు ఏకంగా రూ.1.70 లక్షల వరకు భారీ లాభం చేకూరనుంది. కంపెనీ తన పాపులర్ మోడళ్లయిన స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్ రెండింటిపైనా ఈ తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. కొత్త కారు కొని డబ్బులు ఆదా చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
లక్షల్లో తగ్గిన మహీంద్రా స్కార్పియో ఎన్ ధర
ఈ జులై ఆఫర్లలో మహీంద్రా కంపెనీ అత్యధికంగా స్కార్పియో ఎన్ మోడల్‌పైనే డిస్కౌంట్లను ఇస్తోంది. స్కార్పియో ఎన్ కారుపై వేరియంట్లను బట్టి గరిష్టంగా రూ.1.70లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. మరోవైపు పాత లుక్‌తో ఆకట్టుకునే స్కార్పియో క్లాసిక్ కారుపై కూడా రూ.70,000 వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో స్కార్పియో క్లాసిక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.13.37 లక్షల నుంచి రూ.17.40 లక్షల వరకు ఉండగా, లేటెస్ట్ మోడల్ అయిన స్కార్పియో ఎన్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.13.49 లక్షల నుంచి ప్రారంభమై రూ.24.95 లక్షల వరకు పలుకుతున్నాయి.
ఏ మోడల్‌పై ఎంత తగ్గింది?
స్కార్పియో ఎన్ మోడల్ లోని వేర్వేరు వేరియంట్లకు కంపెనీ వేర్వేరు ఆఫర్లను ఇస్తోంది. బేస్ మోడల్ జెడ్2 పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ. 25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తున్నారు. జెడ్4 పెట్రోల్ మోడల్‌పై రూ.20,000 క్యాష్ డిస్కౌంట్ తో పాటు మొత్తంగా రూ.75,000 వరకు లాభం అందుకోవచ్చు. అలాగే జెడ్8 ఎస్ పెట్రోల్, జెడ్8 ఎల్ అడాస్ మోడళ్లపై రూ.25,000 క్యాష్ డిస్కౌంట్ తో కలిపి రూ.50,000 వరకు తగ్గింపు ఉంది. వీటితో పాటు జెడ్8 ఎల్ ఆటోమేటిక్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై ఏకంగా రూ.65,000 క్యాష్ డిస్కౌంట్, రూ.35,000 యాక్సెసరీస్ బెనిఫిట్స్ తో కలిపి మొత్తం రూ.1.25 లక్షల వరకు భారీ ఆఫర్ నడుస్తోంది. అన్నింటికంటే ఎక్కువగా జెడ్8 ఎల్, జెడ్8 టి ఆటోమేటిక్ (4WD) డీజిల్ వేరియంట్‌పై ఏకంగా రూ.1,15,000 క్యాష్ డిస్కౌంట్‌తో కలిపి మొత్తం రూ.1.70 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇకపోతే స్కార్పియో క్లాసిక్ లోని ఎస్, ఎస్11 డీజిల్ మోడళ్లపై రూ.20,000 క్యాష్ డిస్కౌంట్ తో కలిపి రూ.70,000 వరకు ఆఫర్ ఉంది.
5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్
ఫీచర్లు, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మహీంద్రా స్కార్పియో ఎన్ కారులో థార్, ఎక్స్‌యూవీ700 మోడళ్లలో వాడే పవర్‌ఫుల్ ఇంజన్లను ఉపయోగించారు. ఇది 2.0 లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఇంజన్లకు 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను జత చేశారు. కారు టాప్ ఎండ్ మోడళ్లలో ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా లభిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా గ్లోబల్ ఎన్‌క్యాప్ కొత్త నిబంధనల ప్రకారం జరిపిన క్రాష్ టెస్టుల్లో ఈ కారుకు ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చింది. అంటే ఫ్యామిలీ ప్రయాణాలకు ఈ కారు అత్యంత సురక్షితమైనదని రుజువైంది.
మోడర్న్ లుక్, లగ్జరీ ఇంటీరియర్‌తో అదిరిపోయే రైడింగ్ ఎక్స్‌పీరియన్స్
లుక్ పరంగా ఈ కారులో మహీంద్రా కంపెనీ సరికొత్త క్రోమ్ ఫినిషింగ్ సింగిల్ గ్రిల్‌ను అమర్చింది. గ్రిల్‌పై కంపెనీ కొత్త లోగో కారు అందాన్ని మరింత పెంచింది. ఇందులో కొత్త డిజైన్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సీ-షేప్ ఎల్ईడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు (DRLs), టూ-టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, వర్టికల్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఇచ్చారు. కారు లోపల లగ్జరీ లుక్ ఇచ్చేందుకు కొత్త డాష్ బోర్డ్, సెంటర్ కన్సోల్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లెదర్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. సేఫ్టీ కోసం కారులో సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, రేర్ డిస్క్ బ్రేక్‌లు వంటి ఎన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ జులై నెల ముగిసేలోపు కారు కొనేవారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని డీలర్లు చెప్తున్నారు.




