Mahindra Scorpio N: పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.. ఆగస్టు 15న రానున్న స్కోర్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్..
Mahindra Scorpio N: భారత రోడ్లపై పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌తో రాజసం ఒలకబోసే ఎస్‌యూవీలలో మహింద్రా స్కోర్పియో N ముందంజలో ఉంటుంది. లాంచ్ అయినప్పటి నుంచి నేటి వరకు ఈ మోడల్‌కు ఉన్న క్రేజ్ కొంచెమైనా తగ్గలేదు.
Mahindra Scorpio N: పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.. ఆగస్టు 15న రానున్న స్కోర్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్..
Mahindra Scorpio N: మహింద్రా కార్ల అభిమానులకు ఒక అదిరిపోయే తీపి కబురు అందుతోంది. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతున్న ప్రముఖ స్కోర్పియో N మోడల్‌ను అధునాతన అప్‌డేట్లతో ముందుకు తెచ్చేందుకు కంపెనీ ఇప్పుడు రంగం సిద్ధం చేసింది. వచ్చే ఆగస్టు 15న ఈ నయా అవతార్‌ను అధికారికంగా ప్రపంచానికి ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తుండటంతో, మన దేశీ ఎస్‌యూవీ ప్రియుల్లో ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
భారత రోడ్లపై పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌తో రాజసం ఒలకబోసే ఎస్‌యూవీలలో మహింద్రా స్కోర్పియో N ముందంజలో ఉంటుంది. లాంచ్ అయినప్పటి నుంచి నేటి వరకు ఈ మోడల్‌కు ఉన్న క్రేజ్ కొంచెమైనా తగ్గలేదు. కాగా, వినియోగదారుల మారుతున్న ఆలోచనలకు అనుగుణంగా ఈ వాహనాన్ని మరింత ప్రీమియంగా తీర్చిదిద్దాలని కంపెనీ భావిస్తోంది. అందులో భాగంగానే 2026 వర్షన్ స్కోర్పియో N ఫేస్‌లిఫ్ట్‌ను రూపొందిస్తోంది. ఈ నయా మోడల్‌లో ప్రధానంగా ఇంటీరియర్, టెక్నాలజీ, లగ్జరీ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
పనోరమిక్ సన్‌రూఫ్, బిగ్ స్క్రీన్ల హంగులు..
స్కోర్పియో N వినియోగదారుల నుంచి ఎప్పటి నుంచో వస్తున్న ప్రధాన డిమాండ్ పనోరమిక్ సన్‌రూఫ్. ప్రస్తుతం ఉన్న మోడల్‌లో కేవలం సింగిల్ పేన్ సన్‌రూఫ్ మాత్రమే లభిస్తోంది. ఈ లోటును భర్తీ చేస్తూ కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో భారీ పనోరమిక్ సన్‌రూఫ్‌ను అమర్చబోతున్నారు. ఇది కేబిన్‌కు అదనపు కాంతిని ఇవ్వడమే కాకుండా, ప్రయాణికులకు ఒక లగ్జరీ అనుభూతిని కలిగిస్తుంది.
అంతేకాకుండా, కేబిన్ ఇంటీరియర్స్‌లో సరికొత్త డిజిటల్ విప్లవాన్ని తీసుకువస్తున్నారు. ఇందులో రెండు పెద్ద 10.25 అంగుళాల డిస్ప్లేలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కాగా, మరొకటి పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లాంటి అత్యాధునిక సౌకర్యాలు ప్రయాణాన్ని మరింత సుఖమయం చేయనున్నాయి.
కొత్త లుక్, అధునాతన భద్రతా ఫీచర్లు..
బాహ్య రూపురేఖల విషయానికి వస్తే, స్కోర్పియో N తన ఐకానిక్, గంభీరమైన బాడీ షేప్‌ను అలాగే కాపాడుకోనుంది. అయితే ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్ ఈ మోడల్‌కు సరికొత్త స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. రాత్రి వేళల్లో ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు హెడ్‌లైట్ క్లస్టర్‌లో చిన్నపాటి మార్పులు చేశారు.
భద్రత విషయంలో మహింద్రా ఎప్పుడూ రాజీపడదు. ఈ ఫేస్‌లిఫ్ట్‌లో డ్రైవర్, ప్రయాణికుల రక్షణ కోసం 360 డిగ్రీల కెమెరా వ్యవస్థను జోడిస్తున్నారు. దీనివల్ల సన్నని వీధులు, రద్దీగా ఉండే పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాన్ని సులభంగా నడపవచ్చు. తో పాటు లెవెల్-2 ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లను ఉన్నత వేరియంట్లలో మరింత పటిష్టం చేస్తున్నారు. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ లాంటి సెక్యూరిటీ సిస్టమ్స్ డ్రైవింగ్‌ను మరింత సురక్షితం చేస్తాయి.
ఇంజిన్ శక్తిలో ఎలాంటి మార్పులు లేవు..
రూపురేఖలు, సాంకేతికత మారినప్పటికీ, వాహన పనితీరు విషయంలో మహింద్రా పాత నమ్మకాన్నే నిలబెట్టుకుంటోంది. శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదు. రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి. ఆఫ్ రోడింగ్ ఇష్టపడే సాహసికుల కోసం ప్రత్యేకమైన 4XPLOR ఫోర్-వీల్ డ్రైవ్ టెక్నాలజీ డీజిల్ మోడళ్లలో యథావిధిగా లభిస్తుంది. రోడ్డుపై ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నమ్మకంగా ప్రయాణించేందుకు ఈ పవర్‌ట్రెయిన్ ఎంతో తోడ్పడుతుంది.
స్కోర్పియో N ఫేస్‌లిఫ్ట్ రాకతో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ మరింత తీవ్రం కానుంది. ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం నాడు కీలక ప్రకటనలు చేసే సంప్రదాయాన్ని పాటిస్తూ, మహింద్రా ఈసారి కూడా ఆగస్టు 15న ఈ సరికొత్త మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంది. మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే బుకింగ్స్ తుఫాను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.




