మిడిల్ క్లాస్ డ్రీమ్ కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.55 వేల భారీ డిస్కౌంట్!

Maruti Brezza: సాధారణంగా ఏ కంపెనీ అయినా డిమాండ్ తక్కువగా ఉన్న మోడళ్లపైనే డిస్కౌంట్లు ఇస్తుంటుంది. కానీ, మారుతి సుజుకి ఈసారి కస్టమర్ల మనసు గెలుచుకునేలా నిర్ణయం తీసుకుంది.

Venkat
Updated on: 5 July 2026 11:36 PM IST
Maruti Brezza
X

మిడిల్ క్లాస్ డ్రీమ్ కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.55 వేల భారీ డిస్కౌంట్!

Maruti Brezza July 2026 Discount: సొంతంగా ఒక అందమైన కారు కొనుక్కోవాలని, కుటుంబంతో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలని ప్రతి మధ్యతరగతి కుటుంబం ఎన్నో కలలు కంటుంది. అలాంటి వారి కలలను నిజం చేస్తూ, భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఈ జూలై నెలలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యే తన పాపులర్ ఎస్‌యూవీ 'బ్రెజ్జా'పై ఏకంగా రూ.55,000 వరకు భారీ తగ్గింపును ప్రకటించి కస్టమర్లకు బంపర్ గిఫ్ట్ ఇచ్చింది.

పెట్రోల్, సీఎన్‌జీ మోడల్స్ రెండింటిపై కాసుల వర్షం!

సాధారణంగా ఏ కంపెనీ అయినా డిమాండ్ తక్కువగా ఉన్న మోడళ్లపైనే డిస్కౌంట్లు ఇస్తుంటుంది. కానీ, మారుతి సుజుకి ఈసారి కస్టమర్ల మనసు గెలుచుకునేలా నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న బ్రెజ్జా పెట్రోల్ వేరియంట్లతో పాటు, మైలేజ్ కింగ్ గా పేరుతెచ్చుకున్న సీఎన్‌జీ (CNG) మోడల్స్ అన్నింటిపై కూడా ఈ రూ.55,000 తగ్గింపు వర్తిస్తుందని ప్రకటించింది. ఈ ఆఫర్‌లో నేరుగా వచ్చే నగదు తగ్గింపుతో పాటు, పాత కారును మార్చుకునే వారికి లభించే ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ కూడా కలిసి ఉన్నాయి. అయితే, ఈ అదిరిపోయే ఆఫర్ కేవలం ఈ జూలై 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

ధరల పెంపు భారం లేదు.. పాత ధరలకే సొంతం చేసుకోండి!

ఇటీవలే మారుతి సుజుకి తన కార్ల ధరలను స్వల్పంగా పెంచిన సంగతి తెలిసిందే. అయితే బ్రెజ్జా అభిమానులకు ఇక్కడో పెద్ద ఊరట లభించింది. ఈ ధరల పెంపు పరిధిలోకి కంపెనీ బ్రెజ్జాను చేర్చలేదు. అంటే పాత ధరలకే ఈ కారు లభిస్తుండటంతో పాటు అదనంగా డిస్కౌంట్ కూడా అందుతోంది. ప్రస్తుతం మార్కెట్లో మారుతి బ్రెజ్జా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.69 లక్షల నుంచి ప్రారంభమై, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.13.98 లక్షల మధ్య ఉంది. ఇప్పుడు ఇస్తున్న రూ.55 వేల డిస్కౌంట్ వల్ల ఈ కారును మరింత తక్కువ ధరకే ఇంటికి తీసుకెళ్లే సువర్ణావకాశం కస్టమర్లకు దక్కింది.

లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజ్.. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్!

మారుతి బ్రెజ్జా లుక్ పరంగానే కాకుండా పర్ఫార్మెన్స్ లోనూ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇందులో సరికొత్త జనరేషన్‌కు చెందిన K-సిరీస్ 1.5-లీటర్ డ్యుయల్ జెట్ ఇంజన్‌‎ను అమర్చారు. ఇది స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ గరిష్టంగా 103 హార్స్‌పవర్ శక్తిని, 137 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది. ఇక మధ్యతరగతి వారికి అత్యంత ముఖ్యమైన మైలేజ్ విషయానికి వస్తే, దీని మాన్యువల్ వేరియంట్ లీటరుకు 20.15 కిలోమీటర్లు, అలాగే ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 19.80 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజ్ ఇస్తుందని కంపెనీ గట్టిగా చెబుతోంది.

హైటెక్ ఫీచర్లు.. 360 డిగ్రీల కెమెరా భద్రత!

ఈ సరికొత్త బ్రెజ్జా కారులో ప్రయాణికుల రక్షణకు, సౌకర్యానికి పెద్దపీట వేశారు. ఇందులో ఉన్న 360 డిగ్రీల కెమెరా సిస్టమ్ ద్వారా కారు చుట్టుపక్కల పరిసరాలను లోపలి స్క్రీన్ పైనే స్పష్టంగా చూసుకోవచ్చు. 9-ఇంచుల అధునాతన స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వంటి సరికొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనితో పాటు మొబైల్ ఫోన్ హీట్ అవ్వకుండా కాపాడే ప్రత్యేక సేఫ్టీ ఫీచర్‌తో కూడిన వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం విశేషం.

ముఖ్య గమనిక: కారుపై లభించే ఈ డిస్కౌంట్లు వేర్వేరు నగరాలు, అలాగే డీలర్ల వద్ద ఉండే స్టాక్‌ను బట్టి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు మీ సమీపంలోని అధికారిక మారుతి సుజుకి షోరూమ్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

మంచి లుక్, అదిరిపోయే మైలేజ్, నమ్మకమైన రీసేల్ వాల్యూ ఉన్న మారుతి బ్రెజ్జాను సొంతం చేసుకోవడానికి ఇంతకంటే మంచి సమయం రాదనే చెప్పాలి. ఒకవైపు ధరల పెంపు భారం పడకపోవడం, మరోవైపు రూ.55 వేల భారీ తగ్గింపు లభిస్తుండటంతో ఈ జూలై నెలలో కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది నిజంగానే పండగ లాంటి వార్త.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story